Araku Valley: గుడ్ న్యూస్.. అరకులోయలో పారాగ్లైడింగ్ ట్రయల్ రన్ సక్సెస్
పారా గ్లైడింగ్ ... మరిచిపోలేని థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తోంది. పారా గ్లైడింగ్ కోసం భారత టూరిస్టులు, సినీప్రముఖులు పనిగట్టుకుని విదేశాలకు వెళ్తారు పర్వతాలు, లోయలలో పారాగ్లైడింగ్ చేసి గొప్ప అనుభూతిని పొందుతారు. ఇక మీదట పారా గ్లైడింగ్ కోసం మనవాళ్లెవరూ విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు..

మన్యంలో ప్రకృతి పరవశిస్తోంది. అరకు అందాలు కనువిందు చేస్తున్నాయి. వెండిమబ్బులు గాల్లో తేలుతున్న అక్కడి ఆహ్లాదకర వాతావరణం, అందమైన దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. అరకు లోయతో పాటు లంబసింగి, వంజంగిలోని ఈ మేఘాల కొండలు మైమరిపిస్తున్నాయి. ఆకాశమే దిగివచ్చిందా అన్నట్లు ఈ అద్భుత దృశ్యాలు ఔరా అనిపిస్తున్నాయి. అరకులో ఉన్నామా… ఆకాశంలో విహరిస్తున్నామా అన్న అనుమానాలు కలిగిస్తున్నాయి. మన అరకువ్యాలీ ఇప్పుడు ఇంకా చాలా డెవలప్ అయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అరకులో పారాగ్లైడింగ్ అకవకాశాన్ని కల్పించబోతోంది. ఇప్పటికే అందాల అరకులోయ అద్భుతసోయగాలతో పర్యాటకులను ఫిదా చేస్తోంది. ప్రకృతి వరప్రసాదం అరకువ్యాలీకి అదనపు హంగులు అద్దుతోంది ఆంధ్ర ప్రదేశ్ సర్కార్
అరకు లోయలో ఇక పారాగ్లైడింగ్ అందుబాటులోకి రాబోతోంది. ట్రయల్ రన్ సక్సెస్ అయింది. మాడగడ సన్‌రైజ్ వ్యూపాయింట్ దగ్గర ట్రయల్ రన్ నిర్వహించారు కోచ్ విజయ్. హిమాచల్‌కు చెందిన పైలెట్లు పారాగ్లైడింగ్ చేశారు. నెలాఖరు నుంచి అందుబాటులో తెచ్చేలా ప్రణాళికలు
అరకు ప్రాంతంలో గాలివాటాన్ని అంచనా వేసి.. వాతావరణ పరిస్థితులు ఎంత వరకూ అనుకులిస్తాయనే దానిపై ఓ అంచనాకు వచ్చాక ట్రయల్ రన్ చేశారు. ట్రయల్ రన్ సక్సెస్ కావడంపై కోచ్, పైలట్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అరకులోయ పారాగ్లైడింగ్ ఎంతో అనుకూలంగా ఉందన్నారు. ఈ నెలాఖరులో నిర్వహించే అరకు ఉత్సవాల నాటికి పారా గ్లైడింగ్ అందుబాటులోకి తేనున్నారు. ఇందుకోసం అధికారులు అన్నిఏర్పాట్లు చేస్తున్నారు.
థర్డ్ హాట్ ఎయిర్ బెలూన్ రైడ్‌లు, పారామోటర్ రైడింగ్ అడ్వెంచర్‌తో అరకు వ్యాలీ గత కొన్ని నెలలుగా పర్యాటకుల సాహస క్రీడలకు హబ్‌గా మారింది. ఇప్పుడు ఉత్సవాలకు పారాగ్లైడింగ్ ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతోంది.
