AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Gurukula Exam 2026 Postponed: ఏపీ గురుకుల ప్రవేశ పరీక్షలు వాయిదా.. కొత్త తేదీ చూశారా?

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకులాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి 5వ తరగతి ప్రవేశాలకు నిర్వహించే ఎంట్రన్స్‌ టెస్ట్‌ మార్చి 1 (ఆదివారం) జరగనుంది. ఈ మేరకు తాజాగా హాల్ టికెట్లను వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు తమ రిజిస్టర్‌..

AP Gurukula Exam 2026 Postponed: ఏపీ గురుకుల ప్రవేశ పరీక్షలు వాయిదా.. కొత్త తేదీ చూశారా?
AP Gurukula Backlog Exams
Srilakshmi C
|

Updated on: Feb 27, 2026 | 7:02 AM

Share

అమరావతి, ఫిబ్రవరి 27: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకులాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి 5వ తరగతి ప్రవేశాలకు నిర్వహించే ఎంట్రన్స్‌ టెస్ట్‌ మార్చి 1 (ఆదివారం) జరగనుంది. ఈ మేరకు తాజాగా హాల్ టికెట్లను వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు తమ రిజిస్టర్‌ ఐడీ, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వీరితోపాటు ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ ప్రవేశాలకు, ఐఐటీ/ నీట్‌ ప్రవేశాలకు నిర్వహించనున్న ప్రవేశ పరీక్ష కూడా మార్చి 1న జరగనుంది.

రందరికీ మార్చి 1వ తేదీన మొత్తం మూడు షిఫ్టుల్లో పరీక్షలు జరుగుతాయి. ఇక 6వ తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రవేశాలకు మార్చి 2వ తేదీన జరగాల్సిన పరీక్ష మాత్రం వాయిదా పడింది. తొలుత ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం మార్చి 2వ తేదీన జరగవల్సి ఉంది. అయితే దీనిని మార్చి 8వ తేదీకి వాయిదా వేసినట్టు గురుకుల సంస్థ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. 5వ తరగతి, ఇంటర్మీడియట్‌ ప్రవేశాలకు మార్చి 1న యథాతథంగా పరీక్ష జరగుతుందని, బ్యాక్‌లాగ్‌ సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మార్చి 8వ తేదీన పరీక్ష నిర్వహిస్తామని వెల్లడించింది.

ఏపీ గురుకుల ప్రవేశ పరీక్ష 2026 హాల్‌ టికెట్ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

ఏపీ ఆర్‌సెట్‌ 2026 ర్యాంక్‌ కార్డులు విడుదల.. డైరెక్ట్‌ లింక్‌ ఇదిగో

ఏపీ ఆర్‌సెట్‌ 2024-25 ర్యాంక్‌ కార్డులను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ కె మధుమూర్తి, శ్రీపద్మావతి మహిళా విశ్వ విద్యాలయం వీసీ వి ఉమ విడుదల చేశారు. అభ్యర్ధులు ఉన్నత విద్యామండలి అధికారిక వెబ్‌సైట్ నుంచి ర్యాంకు కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఏపీ ఆర్‌సెట్‌ కన్వీనర్‌ ఆర్‌ ఉష, కో-కన్వీనర్‌ జాన్‌ సుష్మ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.

ఏపీ ఆర్‌సెట్‌ 2026 ర్యాంక్‌ కార్డుల డౌన్‌లోడ్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us