విశాఖ రిసార్ట్‌లో బర్త్ డే పార్టీ.. అంతలోనే విషాదం..! మిస్టరీగా యువకుడి డెత్
విశాఖ దొండపర్తి ప్రాంతానికి చెందిన యువకుల్లో ఒకరికి పుట్టినరోజు. దాసు అనే యువకుడికి బర్త్డే కావడంతో గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసుకున్నందుకు స్నేహితులంతా ప్లాన్ చేసుకున్నారు. ఇందులో భాగంగానే భీమిలి బ్యాంకు కాలనీలో.. అనిల్ రిసార్ట్ కు వెళ్లారు. 14 మంది స్నేహితులు అంతా ఒక్కచోట చేరి సరదాలలో నిమగ్నమయ్యారు. రిసార్ట్స్ లో విద్యుత్ షాక్ తో ధర్మవరపు రాముడు అనే యువకుడు మృతి చెందాడు. స్నేహితులతో బర్త్ డే పార్టీ కి రిసార్ట్‌కు వెళ్లాడు రాముడు. పార్టీ చేసుకుని స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేశారు..
విశాఖపట్నం, ఆగస్టు 11: వాళ్లంతా స్నేహితులు.. వేర్వేరు రంగాల్లో ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. మరి అందులో ఒక స్నేహితుడికి పుట్టినరోజు కావడంతో వేడుకగా జరపాలనుకున్నారు. ఎక్కడెక్కడో ఉన్న వారంతా ఒక్కచోట చేరారు. అందరూ సరదాగా గడిపేందుకు ఓ రిసార్టుకు వెళ్లారు. సంతోషంగా పార్టీ చేసుకున్నారు. స్విమ్మింగ్ పూల్ లో జలకాలాడారు.. అంతలోనే స్నేహితుల్లో ఒకడు కుప్పకూలిపోయాడు. కళ్ళముందే విగతజీవిగా మారడంతో వేడుకల ఆనందంలో ఉన్న వారంతా.. విషాదంలోకి వెళ్లిపోయారు. ఈ షాకింగ్ ఘటన విశాఖపట్నంలో శుక్రవారం (ఆగస్టు 11) చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..
రిసార్ట్ లో జరిగిందిదే..!
విశాఖ దొండపర్తి ప్రాంతానికి చెందిన యువకుల్లో ఒకరికి పుట్టినరోజు. దాసు అనే యువకుడికి బర్త్డే కావడంతో గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసుకున్నందుకు స్నేహితులంతా ప్లాన్ చేసుకున్నారు. ఇందులో భాగంగానే భీమిలి బ్యాంకు కాలనీలో.. అనిల్ రిసార్ట్ కు వెళ్లారు. 14 మంది స్నేహితులు అంతా ఒక్కచోట చేరి సరదాలలో నిమగ్నమయ్యారు. రిసార్ట్స్ లో విద్యుత్ షాక్ తో ధర్మవరపు రాముడు అనే యువకుడు మృతి చెందాడు. స్నేహితులతో బర్త్ డే పార్టీ కి రిసార్ట్‌కు వెళ్లాడు రాముడు. పార్టీ చేసుకుని స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేశారు.
ఆ తర్వాత.. పూల్ బయటకు వఛ్చి తడిసిన బట్టలతో విద్యుత్ లైట్ పోల్ ను పట్టుకున్నడు రాముడు. అప్పటికే జోరున వర్షం కూడా కురిసింది. పోల్‌ను పట్టుకున్న వెంటనే కుప్పకూలీ పోయాడు. ఏం జరిగిందో తెలుసుకునే లోపు రాముడు కుప్పకూలిపోయాడు. స్నేహితులు హుటాహుటీన బాధితుడిని ఆసుపత్రికి తరలించిన ఫలితం లేకుండా పోయింది. పరీక్షించిన వైద్యులు అప్పటికే రాముడు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించారు. రంగంలోకి దిగిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని భీమిలి మార్చురీకి తరలించారు. అప్పటి వరకూ సరదాగా తమతో గడిపిన రాముడు మృతితో స్నేహితులు విషాదంలో మునిగిపోయారు. మృతుడి కుటుంబం కన్నీరు మున్నిరై విలపించింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.