Andhra News: ట్రైన్ వేగన్‌లో రహస్యంగా విశాఖకు చేరుకున్న మేఘాలయ వ్యక్తి..
వేదాంత కంపెనీలో లోడింగ్ కోసం వచ్చిన ట్రైన్ వేగన్‌లో వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తి రాష్ట్రాలు దాటుకుంటూ రహస్యంగా విశాఖపట్నం చేరుకున్నాడు. ఐతే అతను ఏ ఉద్దేశంతో డైరెక్ట్‌గా పోర్టులోనే వేదాంత కంపెనీలో లోడింగ్ కోసం వచ్చిన వ్యాగన్‌లో..

వేదాంత కంపెనీలో లోడింగ్ కోసం వచ్చిన ట్రైన్ వేగన్‌లో వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తి రాష్ట్రాలు దాటుకుంటూ రహస్యంగా విశాఖపట్నం చేరుకున్నాడు. ఐతే అతను ఏ ఉద్దేశంతో డైరెక్ట్‌గా పోర్టులోనే వేదాంత కంపెనీలో లోడింగ్ కోసం వచ్చిన వ్యాగన్‌లో ప్రత్యక్షమయ్యాడో సీఐఎస్ఎఫ్ సిబ్బంది తొలుత అర్థం కాలేదు. వెంటనే సదరు వ్యక్తిని సిఐఎస్ఎఫ్ సిబ్బంది హార్బర్ పోలీసులకు అప్పగించి విచారణ చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఫిబ్రవరి 20వ తేదీ రాత్రి సుమారు ఒంటి గంటకు వేదాంత కంపెనీలో సిసిఆర్ యార్డ్ దగ్గర ఒక ట్రైన్ వేగన్ లోడింగ్ కోసం వచ్చింది. ఐతే వేగన్ క్లీన్ చేస్తుండగా ఒక వేగన్‌లో ఓ గుర్తు తెలియని వ్యక్తి పడుకుని ఉన్నట్లు సిబ్బంది గమనించారు. వారు వేదాంత కంపెనీ మేనేజ్మెంట్‌కు తెలియపరచగా వారు సీఐఎస్‌ఎఫ్ సిబ్బందికి సమాచారం అందజేశారు. అనంతరం అతన్ని హర్బరు పోలీస్ స్టేషన్‌కు అప్పగించినారు. హర్బరు పోలీస్ స్టేషన్ సీఐ పీ శోభన్ బాబు అతన్ని విచారించారు. అతని వద్ద ఉన్న ఆధార్ కార్డు పరిశీలించగా అతని పేరు పాస్తర్ సంగ్మ (42) మేఘాలయ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అనంతరం సంగ్మ కుటుంబ సభ్యులకి సమాచారం అందించారు. తప్పిపోయి విశాఖ వరకు చేరుకున్నట్టు పోలీసులు ప్రాథమిక నిర్దారణకు వచ్చారు. గురువారం సంగ్మ కుటుంబ సభ్యులకు అతన్ని అప్పగించి, ట్రైన్ ఎక్కించి పోలీసులు మంచి మనసు చాటుకున్నారు.
మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.







