Andhra Pradesh: గ్యాస్ సిలిండర్, లైటర్‌తో పెట్రోల్ బంకులోకి దూరిన వ్యక్తి.. పరుగో పరుగు..!

విశాఖ సింహాచలంలో ఓ యువకుడు కలకలం సృష్టించాడు.. ఓ వ్యక్తి ఆటోతో పెట్రోల్ బంక్ లోకి వచ్చాడు. అందరూ పెట్రోల్ డీజిల్ కొట్టించుకుంటాడులే అనుకున్నారు. అప్పుడే 20వేల లీటర్ల ట్యాంకర్ అదే పెట్రోల్ బంక్ లో అన్‌లోడ్ అవుతుంది.

Andhra Pradesh: గ్యాస్ సిలిండర్, లైటర్‌తో పెట్రోల్ బంకులోకి దూరిన వ్యక్తి.. పరుగో పరుగు..!
Auto Driver
Follow us
Maqdood Husain Khaja

| Edited By: Balaraju Goud

Updated on: Aug 02, 2024 | 10:19 PM

విశాఖ సింహాచలంలో ఓ యువకుడు కలకలం సృష్టించాడు.. ఓ వ్యక్తి ఆటోతో పెట్రోల్ బంక్ లోకి వచ్చాడు. అందరూ పెట్రోల్ డీజిల్ కొట్టించుకుంటాడులే అనుకున్నారు. అప్పుడే 20వేల లీటర్ల ట్యాంకర్ అదే పెట్రోల్ బంక్ లో అన్‌లోడ్ అవుతుంది. ఆటో నుంచి సిలిండర్ తీసుకొని దిగాడు ఆ యువకుడు. చేతిలో లైటర్ కూడా ఉంది. పెట్రోల్ అన్‌లోడ్ అవుతున్న ట్యాంకర్ దగ్గరకు వెళ్ళాడు. గ్యాస్ ఓపెన్ చేసి లైటర్ పట్టుకున్నాడు. ఇక అంతా పరుగులు..!

విశాఖపట్నంలోని సింహాచలం గోశాల బంక్ వద్ద ఆటో డ్రైవర్ హల్‌చల్ చేశాడు. గ్యాస్ సిలెండర్‌తో పెట్రోల్ బంక్ లోకి చొరబడాడు. చేతిలో లైటర్ పట్టుకుని తగలబెట్టేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. గ్యాస్ ఓపెన్ చేసి బంక్ పేల్చేస్తానంటూ హల్‌చల్ చేశాడు. అదే సమయంలో పెట్రోల్ బంకులో భారీ ట్యాంకర్ అన్‌లోడ్ అవుతుంది. పెట్రోల్ తీసుకొచ్చి బంకులో నింపుతోంది. అక్కడికి గ్యాస్ సిలిండర్ తో వెళ్లి హడావిడి చేశాడు ఆటో డ్రైవర్. దీంతో పెట్రోల్ బంక్ సిబ్బంది స్థానికులు భయంతో పరుగులు తీశారు. కాసేపటికి అత్యంత చాకచక్యంగా అతగాడిని పట్టుకున్నారు బంక్ సిబ్బంది. ఈ లోగా పోలీసులు వచ్చి అదుపులోకి తీసుకున్నారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఆ ఆటో డ్రైవర్ పేరు రోలెక్స్ రాజు. తను అద్దెకు ఉంటున్న యజమానితో వివాదాలు ఉన్నాయట. ఈ మధ్య పోలీసు స్టేషన్ కు కూడా వెళ్ళాడు. అయితే.. తనను, తన కుటుంబాన్ని వేధిస్తున్నా పోలీసులో పట్టించుకోవడంలేదని ఆ డ్రైవర్ ఆవేదన. గర్భిణిగా ఉన్న భార్యను కూడా ఇంటి యజమాని వేధించాడని ఆరోపించాడు రాజు. ఇప్పటికైనా తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. ఇక పోలీసులు సకాలంలో అక్కడికి చేరుకుని ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకోవడంతో అంతా ఉపిరి పీల్చుకున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..