Palnadu district: బోల్తా పడిన మంచి నూనె ట్యాంకర్.. బిందెలు, బకెట్లు, డబ్బాలతో ఎగబడ్డ జనం
బోల్తా పడటంతో ట్యాంకర్లో ఉన్న మంచి నూనె రోడ్డు పక్కనున్న గుంతలో పడి నిల్వ ఉండిపోయింది. విషయం తెలుసుకున్న సమీప గ్రామాల ప్రజలు.. నూనెను తీసుకెళ్లేందుకు భారీగా అక్కడికి చేరుకున్నారు.
Andhra Pradesh: పల్నాడు జిల్లా నకరికల్లు మండలం(Nekarikallu) చల్లగుండ్ల(Challagundla) వద్ద నార్కట్ పల్లి – అద్దంకి హైవేపై యాక్సిడెంట్ జరిగింది. చెన్నై(Chennai) నుంచి హైదరాబాద్(Hyderabad) వెళ్తున్న మంచి నూనె ట్యాంకర్ అదుపు తప్పి హైవేపై బోల్తా పడింది. ట్యాంకర్లో ఉన్న మంచి నూనె రోడ్డు పక్కనున్న గుంతలో పడి నిల్వ ఉండిపోయింది. విషయం తెలుసుకున్న సమీప గ్రామాల ప్రజలు.. అక్కడికి ఎగబడి వచ్చారు. నూనె తీసుకు వెళ్లేందుకు భారీ సంఖ్యలో క్యాన్లు, బిందెలు, డబ్బాలతో చేరుకున్నారు. అందినకాడికి నూనెను నింపుకుని వెళ్తున్నారు. నకరికల్లు పోలీసులు స్పాట్‌కు చేరుకుని జనాన్ని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ ఎవరూ పట్టించుకోకపోవడంతో.. చేసేది లేక వదిలేశారు. దీనితో హైవేపై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎట్టకేలకు భారీ క్రేన్ సాయంతో ట్యాంకర్‌ను అక్కడి నుంచి తరలించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..