ఆ గ్రామంలో ఎద్దులకు 2రోజులు సెలవు.. వింత ఆచారానికి కారణం ఇదే..
విద్యాసంస్థలకు ఉద్యోగులకు హాలిడేస్ ఉన్నట్లుగా ఎద్దులకు కూడా సెలవులు ఉన్నాయండోయ్. ఇది ఊహాజనితం కాదు నిజం. ఆ సెలవులు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఆ ఎద్దులు ఎదురు చూస్తూ ఉంటాయి. ఇంతకు అదేదో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే కర్నూలు జిల్లా వెళ్లాల్సిందే. కర్నూలు జిల్లా కోసిగి మండలం చిన్నబోంపల్లిలో బసవన్నలకు సంవత్సరంలో రెండు రోజులు సెలవులు కేటాయిస్తున్నారు గ్రామస్తులు.

విద్యాసంస్థలకు ఉద్యోగులకు హాలిడేస్ ఉన్నట్లుగా ఎద్దులకు కూడా సెలవులు ఉన్నాయండోయ్. ఇది ఊహాజనితం కాదు నిజం. ఆ సెలవులు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఆ ఎద్దులు ఎదురు చూస్తూ ఉంటాయి. ఇంతకు అదేదో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే కర్నూలు జిల్లా వెళ్లాల్సిందే. కర్నూలు జిల్లా కోసిగి మండలం చిన్నబోంపల్లిలో బసవన్నలకు సంవత్సరంలో రెండు రోజులు సెలవులు కేటాయిస్తున్నారు గ్రామస్తులు. ఆ గ్రామంలో బసవన్న గుడిలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు రైతులు, ఆడపడుచులు. సంవత్సరం వరకు ఎండనక వాననక ఎద్దులతో పొలాల్లో పనులు చేయిస్తుంటారు రైతులు. కానీ సంవత్సరానికి ఒకసారి ఏరువాక పౌర్ణమి పండగ సందర్భంగా.. ఎద్దులకు ఉదయం నదిలోగాని, కుంటల్లో గానీ స్నానాలు చేయించి ఎద్దుల కొమ్ములకు రంగులు వేస్తారు. అలాగే ఒళ్లంతా రంగు రంగుల బొట్లు పెట్టి ఎద్దులకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తరువాత పిండి వంటలతో కూడిన నైవేద్యాలు పెట్టి బసవన్నలకు కను విందుగా తినిపిస్తున్నారు ఆ గ్రామస్తులు.
జిగేలుమనే పట్టు చీరలతో అలంకారం చేసి ఎద్దులకు ప్రత్యేక పూజలు చేసి గ్రామవీధుల్లో ఊరేగింపు చేస్తుంటారు. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజమే. కర్నూలు జిల్లా కోసిగి మండలం చిన్నబోంపల్లి రైతులు ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. ఏ పని ఉన్నా ఏరువాక పౌర్ణమి పండుగ రోజు ఆ ఎద్దులకు పనులు మాత్రం చేయించరు. ఈ ఆచారం పురాతన కాలాల నుంచి వచ్చిందని గ్రామస్తులు అంటున్నారు. కానీ అప్పటినుంచి ఇప్పటివరకు ఈ పండుగలకు ఎద్దులకు రెండు రోజులు సెలవులు ప్రకటిస్తున్నామని గ్రామస్తులు తెలిపారు. ఆ గ్రామ రైతులు ఏరువాక పౌర్ణమి సందర్భంగా రెండ్రోజుల పాటు పొలంలో ఎద్దులతో పనిచేయించరు. వాటిని ముస్తాబు చేసి డప్పు వాయిద్యాలతో ఊరేగించి వేడుక చేస్తారు. ఇలా తమ గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా ప్రతి ఒక్కరు ఎద్దులకు సెలవులు ఇవ్వాలని కోరుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
