Gun Misfire: తుపాకీ మిస్‌ఫైర్‌ ఘటనలో కొత్త కోణం.. క్షణికాశంలో హోంగార్డే భార్యపై కాల్పులు

Gun Misfire: విజయవాడలోని గొల్లపూడిలో తుపాకీ మిస్‌ఫైర్‌ అయిన ఘటనలో కొత్తకోణం వెలుగు చూసింది. క్షణికావేశంలో హోంగార్డే భార్యపై కాల్పులు జరిపినట్లు దర్యాప్తు అధికారులు...

Gun Misfire: తుపాకీ మిస్‌ఫైర్‌ ఘటనలో కొత్త కోణం.. క్షణికాశంలో హోంగార్డే భార్యపై కాల్పులు
Gun Misfire
Follow us
Subhash Goud

|

Updated on: Apr 13, 2021 | 6:04 AM

Gun Misfire: విజయవాడలోని గొల్లపూడిలో తుపాకీ మిస్‌ఫైర్‌ అయిన ఘటనలో కొత్తకోణం వెలుగు చూసింది. క్షణికావేశంలో హోంగార్డే భార్యపై కాల్పులు జరిపినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి భద్రతా విభాగంలోని ఏఎస్పీ శశిభూషణ్‌ వద్ద హోంగార్డ్‌ వినోద్‌ కుమార్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. మూడు రోజుల కిందట శశిభూషణ్‌ అనంతపురం వెళ్లారు. ఆ సమయంలో ఏఎస్పీ తుపాకీని హోగార్డు వద్ద ఉంచారు. దానిని హోంగార్డ్‌ ఇంటికి తీసుకువచ్చాడు. అయితే మొదట ఇంట్లో తుపాకీ మిస్‌ఫైర్‌ అయినట్లు హోంగార్డ్‌ చెప్పాడు. బుల్లెట్‌ అతడి భార్య సూర్యరత్నప్రభ గుండెల్లో దూసుకెళ్లింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆదివారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భవానీపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. అయితే భార్యను బెదిరించే క్రమంలోనే ఆ తుపాకీతో హోంగార్డు కాల్పులు జరిపినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. బంగారం నగలు తాకట్టు పెట్టిన విషయంలో భార్యభర్తల మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కేసు విచారణలో ఉందని త్వరలో పూర్తి వివరాలు తెలియజేస్తామని పశ్చిమ మండల ఏసీపీ హనుమంతరావు పేర్కొన్నారు.

అయితే చివరికి హోంగార్డే భార్య‌పై కాల్పులు జ‌రిపిన‌ట్టు విచార‌ణాధికారులు ప్రాథ‌మిక నిర్ధార‌ణ‌కు రావ‌డం మిస్‌ఫైర్ కేసులో ట్విస్ట్‌గా చెప్పొచ్చు. దీంతో హోంగార్డు వినోద్‌కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఆదివారం అర్ధ‌రాత్రి హోంగార్డు ఇంటి నుంచి గ‌న్ పేల‌డంతో క‌ల‌క‌లం రేపింది. ఈ ఘ‌ట‌న‌లో హోంగార్డు భార్య‌, నాలుగు నెల‌ల గ‌ర్భిణి అయిన సూర్య‌ర‌త్న గుండెల్లోకి తూటా దూసుకుపోయి ప్రాణాలు కోల్పోయింది.

అయితే భార్య‌కు గ‌న్‌ చూపిస్తున్న స‌మ‌యంలో మిస్‌ఫైర్ అయిన‌ట్టు హోంగార్డు వినోద్ క‌ట్టు క‌థ అల్లాడు. కానీ ఆ స‌మ‌యంలో గ‌న్ చూపాల్సిన అవ‌స‌రం ఏంట‌నే ప్రశ్న తలెత్తుతోంది. ఈ ఘటనలో పోలీసుల‌కు ప‌లు అనుమానాలు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో వినోద్‌కుమార్‌ను భ‌వానీపురం పోలీసులు అదుపులోకి తీసుకుని తమ స్టైల్‌లో విచార‌ణ చేప‌ట్టారు. దీంతో అస‌లు నిజాలు బ‌య‌టికొచ్చాయి.

ఇవీ చదవండి: Mystery: హత్య చేశారు.. చేయలేదని బుకాయించారు.. కానీ, పోలీసుల శాటిలైట్ వీడియోకి దొరికిపోయారు!

Viral Video : మద్యం మత్తులో రోడ్డుపైకొచ్చిన పాదాచారుడు.. ఏం జరిగిందో తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే..