Mystery: హత్య చేశారు.. చేయలేదని బుకాయించారు.. కానీ, పోలీసుల శాటిలైట్ వీడియోకి దొరికిపోయారు!

శాటిలైట్ వీడియో ఏమిటి? మతేమన్నా పోయిందా అనుకుంటున్నారా? మేమిచ్చిన హెడింగ్ కరెక్ట్.. కావాలంటే ఇది చదవండి..

Mystery: హత్య చేశారు.. చేయలేదని బుకాయించారు.. కానీ, పోలీసుల శాటిలైట్ వీడియోకి దొరికిపోయారు!
Mystery
Follow us

|

Updated on: Apr 12, 2021 | 9:28 PM

Mystery:నేరం చేయడం నేరగాళ్ల పని.. నేరాన్ని కప్పిపుచ్చడానికి చావు తెలివితేటలూ ఉపయోగిస్తారు. కొందరు కరుడుగట్టిన నేరగాళ్లయితే.. అసలు తాము చేసిన నేరాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ బయటపెట్టారు. నేరస్థులను పట్టుకోవడం.. దర్యాప్తు చేయడం.. అసలు నేరస్థుల నుంచి నేరం గురించిన సమాచారాన్ని రాబట్టడం పోలీసుల విధి. ఎంత మొండి నేరగాళ్లయినా సరే.. తమదైన పద్ధతిలో ట్రీట్ చేసి నేరాన్ని బయటపెట్టే ప్రయత్నం చేస్తారు పోలీసులు. ఒక్కోసారి అమాయకుల్ని కూడా తమ స్టైల్ లో ఇరికించేస్తారనుకోండి అది వేరే సంగతి. కానీ, పోలీసులు చిత్రహింసలు పెట్టి మాత్రమే కాదు.. ఒక్కోసారి చిన్న చిన్న ట్రిక్ లు ఉపయోగించి కూడా నేరస్థులను దారిలోకి తెచ్చేస్తారు. అదిగో అలాంటి తెలివైన పనే చేశారు ఢిల్లీ పోలీసులు. పోలీసులు ఇచ్చిన షాక్ కి ఆ హంతకులకు మతిపోయింది. అసలు ఏం జరిగిందంటే..

దేశరాజధానిలో ఈ నెల 5వ తేదీన దారుణ హత్య జరిగింది. మంగోల్‌పురి ప్రాంతంలో చంద్రభాన్ అనే వ్యక్తిని దారుణంగా చంపేశారు. రక్తపు మడుగులో పడివున్న మృతదేహం చూసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరిన పోలీసులు చనిపోయిన వ్యక్తి ఎవరో గుర్తించి హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

చనిపోయిన చంద్రభాను ఎవరితో తిరిగాడు.. చనిపోయే ముందు ఎక్కడ కనిపించాడు. ఆ సమయంలో ఎవరు ఆయనతో ఉన్నారు వంటి విషయాలు పోలీసులు కూపీ లాగారు. మృతుడు చనిపోవడానికి కొద్దిసేపటి ముందు రాజు, ప్రదీప్ అనే వ్యక్తులతో చివరిసారిగా కనిపించినట్టు కనిపెట్టారు. వెంటనే వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. తమ స్టైల్ లో వారిని ప్రశ్నించారు. అయినా ఫలితం లేకపోయింది. వారిచ్చిన సమాధానాలు అసలు పొంతన లేకుండా ఉండటంతో పోలీసులకు ఏం చేయాలో పాలుపోలేదు.

సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులకు మృతుడు ఇద్దరు వ్యక్తులతో కలిసి వెళుతున్నట్టు వీడియో దొరికింది. కానీ, అందులో ఉన్న ఇద్దరిని గుర్తించడం కష్టంగా మారింది. అయితే, కచ్చితంగా హత్య చేసింది వీరిద్దరే అనే అంచనాకు వచ్చారు పోలీసులు దీంతో మరోమారు వారిని ప్రశ్నించారు. కానీ, ఆ కేటుగాళ్లు మాత్రం ఎటువంటి నిజం చెప్పకపోగా..పోలీసులను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు విషయం అర్ధం అయిపోయింది. హత్య చేసింది మీరే అని తేలిపోయింది అని వారికి చెప్పారు. సీసీలో మీరు కనిపించలేదు కానీ, మీరు మాత్రం అడ్డంగా దొరికారు అంటూ దబాయించారు. మీరు ఏం చేశారన్నది లేటెస్ట్ టెక్నాలజీతో శాటిలైట్ కెమెరాతో మేం కనిపెట్టాం అని ఝలక్ ఇచ్చారు. దీంతో హంతకులు ఇద్దరూ శాటిలైట్ కెమెరాలో నిజంగానే రికార్డు అయివుంటుంది అనుకుని భయపడి.. నిజం చెప్పేశారు.

చంద్రభాను తమను ఘోరంగా అవమానించాడనీ, మద్యం తాగమంటూ కొట్టి హింసించాడనీ అందుకే చంపేశామని చెప్పారు. ఇదండీ సంగతి. పోలీసుల స్మార్ట్ నెస్ ఒక కేసును ఈవిధంగా పరిష్కరించింది.

Also Read: ఎంబీబీస్ అమ్మాయి నైన్త్ క్లాస్ అబ్బాయి…!! చివరికి ట్విస్ట్ ఏంటంటే…?? ( వీడియో )

Gun Misfire : తుపాకి మిస్‌ ఫైర్‌.. హోంగార్డ్ భార్య మృతి.. ఘటనకు సంబంధించి కారణాలు ఇలా..?

Moodami 2024: మూఢాల్లోనూ యోగాల వర్షం! ఆ రాశుల వారికి శుభ ఫలితాలు.
Moodami 2024: మూఢాల్లోనూ యోగాల వర్షం! ఆ రాశుల వారికి శుభ ఫలితాలు.
దళపతి విజయ్ చేతులు, తలపై గాయాలు.. నెట్టింట్లో ఫోటోలు వైరల్
దళపతి విజయ్ చేతులు, తలపై గాయాలు.. నెట్టింట్లో ఫోటోలు వైరల్
అందమైన దుబాయ్‌ని ఛిద్రం చేసిన వర్షం.. తిరిగి మెరవాలంటే ఎంతఖర్చు.?
అందమైన దుబాయ్‌ని ఛిద్రం చేసిన వర్షం.. తిరిగి మెరవాలంటే ఎంతఖర్చు.?
ఈ 5 అలవాట్లు సంబంధాల్లో చీలికను సృష్టిస్తాయి.. ఈరోజే మార్చుకోండి
ఈ 5 అలవాట్లు సంబంధాల్లో చీలికను సృష్టిస్తాయి.. ఈరోజే మార్చుకోండి
సింగిల్ చార్జ్‌పై ఏకంగా 300 కి.మీ. కొత్త స్కూటర్ అదిరింది..
సింగిల్ చార్జ్‌పై ఏకంగా 300 కి.మీ. కొత్త స్కూటర్ అదిరింది..
మీన రాశిలో రెండు గ్రహాల కలయిక..వారి జీవితాల్లో పెనుమార్పులు పక్కా
మీన రాశిలో రెండు గ్రహాల కలయిక..వారి జీవితాల్లో పెనుమార్పులు పక్కా
బాప్‌రే.. ఏం డ్రామా అక్కా! హెల్మెట్‌ లేకుండా పట్టుబడిన లేడీ టీచర్
బాప్‌రే.. ఏం డ్రామా అక్కా! హెల్మెట్‌ లేకుండా పట్టుబడిన లేడీ టీచర్
ఈ వస్తువులు మీ పాకెట్‌లో పెట్టుకుంటే అన్నింట్లోనూ మీదే విజయం..
ఈ వస్తువులు మీ పాకెట్‌లో పెట్టుకుంటే అన్నింట్లోనూ మీదే విజయం..
సైక్లింగ్ మీ జీవితాన్నే మార్చేస్తుంది.. ప్రయోజనాలు తెలిస్తే..
సైక్లింగ్ మీ జీవితాన్నే మార్చేస్తుంది.. ప్రయోజనాలు తెలిస్తే..
ట్యాక్స్ కొత్త, పాత విధానాలతో గందరగోళంగా ఉందా? ఇది ట్రై చేయండి..
ట్యాక్స్ కొత్త, పాత విధానాలతో గందరగోళంగా ఉందా? ఇది ట్రై చేయండి..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!