Anakapalle: ఔరా..! నీ టాలెంట్‌కు సలాం గురూ.. పెన్సిల్ మొనపై 2024

అనకాపల్లిజిల్లా నక్కపల్లి మండలం దొడ్డిగొల్లు గ్రామంలో వెంకటేష్ అనే కళాకారుడుకి సూక్ష్మ కళాఖండాలు రూపొందించడం హాబీ. ప్రతిసారి.. సందర్భానికి అనుగుణంగా సమాజానికి ఒక చక్కని మెసేజ్ ఇస్తుంటాడు. అనేక దేవతా మూర్తులు, మహానుభావుల విగ్రహాలు చిన్న వస్తువులపై తనదైన శైలిలో చెక్కి జీవం పోస్తుంటాడు. అంతే కాదు ప్రత్యేకమైన శిల్పిగా , సూక్ష్మ కళాకారుడి గా ఖ్యాతిని కూడా గడించాడు.

Anakapalle: ఔరా..! నీ టాలెంట్‌కు సలాం గురూ.. పెన్సిల్ మొనపై 2024
2024
Follow us
Maqdood Husain Khaja

| Edited By: Rajeev Rayala

Updated on: Jan 02, 2024 | 1:31 PM

నూతన సంవత్సరానికి అంతా గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పారు. ఒక్కొక్కరు ఒక్కో స్టైల్‌లో ఉత్సాహంగా సంబరాలు చేసుకుంటు విషెస్ చెప్పుకున్నారు. కానీ కొత్త సంవత్సరాన్ని ఆహ్వానం పలుకుతూ తమదైన శైలిలో ప్రత్యేకత చాటుకున్నాడు సూక్ష్మ కళాకారుడు. న్యూ ఇయర్ సందర్భంగా అద్భుతమైన కళాఖండాన్ని చెక్కాడు. పెన్సిల్ మొనపై 2024 సూక్ష్మ శిల్పాన్ని చెక్కి ఔరా అనిపించాడు.

అనకాపల్లిజిల్లా నక్కపల్లి మండలం దొడ్డిగొల్లు గ్రామంలో వెంకటేష్ అనే కళాకారుడుకి సూక్ష్మ కళాఖండాలు రూపొందించడం హాబీ. ప్రతిసారి.. సందర్భానికి అనుగుణంగా సమాజానికి ఒక చక్కని మెసేజ్ ఇస్తుంటాడు. అనేక దేవతా మూర్తులు, మహానుభావుల విగ్రహాలు చిన్న వస్తువులపై తనదైన శైలిలో చెక్కి జీవం పోస్తుంటాడు. అంతే కాదు ప్రత్యేకమైన శిల్పిగా , సూక్ష్మ కళాకారుడి గా ఖ్యాతిని కూడా గడించాడు. ఇప్పటికే వందల సంఖ్యలో సూక్ష్మ కళాఖండాల రూపొందించి అవార్డులు, రివార్డులు, రికార్డులు కూడా సొంతం చేసుకున్నాడు వెంకటేష్.

తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా.. కొత్త సంవత్సరాన్ని ఆహ్వానం పలుకుతూ పెన్సిల్ మొనపై అద్భుతమైన కళాఖండాన్ని చెక్కాడు. దాని పొడవు వెడల్పు గురించి తెలుసుకుంటే ఔరా అనక మానరు. వెడల్పు ఆరు మిల్లీమీటర్లు, ఎత్తు 12 మిల్లీమీటర్లు. 4బి ఫ్లాట్ పెన్సిల్ మొనపై ఈ సూక్ష్మ కళాఖండం చెక్కడానికి రెండు గంటల సమయం పట్టిందని అంటున్నాడు వెంకటేష్. ముఖ్యంగా పెన్సిల్ మొనపై చెక్కిన 2024 అంకెలు ఔరా అనిపిస్తుంది. ఈ కొత్త ఏడాది అందరికీ శుభం కలగాలని ఆకాంక్షించాడు సూక్ష్మ కళాకారుడు వెంకటేష్. ఈ సూక్ష్మ కళాఖండాన్ని చూసిన వారంతా వెంకటేష్ ప్రతిభను అభినందిస్తున్నారు.

Miniature ArtMiniature Art

Miniature Art 1

Miniature Art

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.