AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nara Lokesh: నారా లోకేష్ పాదయాత్రలో వంగవీటి రాధా.. ఏపీ పాలిటిక్స్‌లో ఇక ఆ రూమర్లకు చెక్!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ను మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ కలిశారు. అన్నమయ్య జిల్లా పీలేరులో యువగళం పాదయాత్రలో రాధా పాల్గొన్నారు. లోకేష్‌తో కలిసి నడిచారు. ఇద్దరు యువ నేతలు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.

Nara Lokesh: నారా లోకేష్ పాదయాత్రలో వంగవీటి రాధా.. ఏపీ పాలిటిక్స్‌లో ఇక ఆ రూమర్లకు చెక్!
Nara Lokesh, Vangaveeti RadhaImage Credit source: TV9 Telugu
Janardhan Veluru
|

Updated on: Mar 07, 2023 | 6:07 PM

Share

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ను మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ కలిశారు. అన్నమయ్య జిల్లా పీలేరులో యువగళం పాదయాత్రలో రాధా పాల్గొన్నారు. లోకేష్‌తో కలిసి నడిచారు. ఇద్దరు యువ నేతలు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా రాజకీయపరమైన అంశాలు చర్చించినట్లు తెలుస్తోంది. కొద్ది రోజులుగా వంగవీటి రాధా పార్టీ మారతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆయన జనసేన పార్టీలోకి వెళతారని సోషల్ మీడియాలో ఊహాగానాలు కూడా వినిపించాయి. అయితే ఇప్పుడు ఆయన లోకేష్‌ను కలవడంతో టీడీపీలోనే కొనసాగుతాననే సంకేతాలు పంపించారనే చర్చ జరుగుతోంది.

వచ్చే ఎన్నికల్లో వంగవీటి రాధాను ఎక్కడి నుంచి బరిలోకి దింపాలనే విషయంలో టీడీపీ అధిష్టానం ఇప్పటికే కసరత్తు చేస్తోంది. అలాంటి సమయంలో జనసేన నుంచి తమ పార్టీలో ఆయన చేరబోతున్నారనే లీకులు రావడంతో అప్రమత్తమైంది. రాధాతో చంద్రబాబు నేరుగా ఫోన్ లో మాట్లాడినట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు లోకేష్ పాదయాత్రలోనే కలిసి నడవడంతో పార్టీ మార్పు రూమర్లకు చెక్ పడినట్లయింది. జనసేనలో వంగవీటి రాధా చేరబోతున్నట్లు గత కొంతకాలంగా వినిపిస్తున్న ఊహాగానాలకు వంగవీటి రాధా స్వయంగా ఫుల్ స్టాప్ చెప్పినట్లయ్యింది.

మొత్తానికి టీడీపీలోనే కొనసాగనున్నట్లు వంగవీటి రాధా హింట్ ఇవ్వడంతో తెలుగు తమ్ముళ్లలో కొత్త జోష్ కనిపిస్తోంది. జనసేన శ్రేణులు మాత్రం నిరాశ చెందుతున్నారు. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి విజయవాడ సెంట్రల్ టికెట్ ఇవ్వలేదన్న కారణంతో రాధా అలిగే టీడీపీలో చేరారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తలు చదవండి..