TS – AP: విభజన అంశాలపై ముందడుగు.. రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలన్న కేంద్ర హోం శాఖ..
విభజన చట్టం పెండింగ్ అంశాలపై కేంద్ర హోంశాఖ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ భవన్ విభజనపై ముందడుగు పడింది. భవన్ విభజనపై కమిటీ ఏర్పాటు చేయాలని..
విభజన చట్టం పెండింగ్ అంశాలపై కేంద్ర హోంశాఖ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ భవన్ విభజనపై ముందడుగు పడింది. భవన్ విభజనపై కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రెండు నెలల్లో అధ్యయనం చేసి భవన్ విభజనపై నివేదిక ఇవ్వాలని కోరింది. ఢిల్లీలో 19 ఎకరాల్లో ఉమ్మడి భవన్ ఆస్తులు, ఏపీకి 58, తెలంగాణకు 42 నిష్పత్తి చొప్పున పంపిణీకి నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్ర విభజన అంశాలపై కేంద్ర హోంశాఖ రెండు తెలుగు రాష్ట్రాల అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అధికారులు వర్చువల్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఢిల్లీ నుంచి కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాతో ఏపీ, తెలంగాణ రాష్ట్రా ప్రభుత్వ కార్యదర్శులు సమీర్ శర్మ, సోమేష్ కుమార్ తో విభజన అంశాలపై చర్చించారు. ఏపీ పునర్విభజన 9, 10 షెడ్యుళ్ల పరిధిలోని వివిధ సంస్థల విభజనతో పాటు, ఆర్ధిక వనరుల పంపకాలపై చర్చించారు.
అలాగే షీలా బేడి కమిటీ సిఫర్సు చేసిన అంశాలపైనా సమీక్షిచారు. ఏపీ జెన్ కోకు తెలంగాణ డిస్కంలు చెల్లించాల్సిన రూ. ఆరు వేల కోట్ల బకాయిలను చెల్లించేలా చూడాలని ఏపీ అధికారులు కోరారు. మరోవైపు కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో పాటు దుగరాజపట్నం, రామాయపట్నం పోర్టుల నిర్మాణంలో కేంద్రం ఆర్ధిక సహకారం అందించాలని ఏపీ కోరింది.
ఇవి కూడా చదవండి: Viral Video: కర్మ ఫలాం ఎలా ఉంటుందో తెలుసా.. ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది..