Vijayawada: కొంపముంచిన అత్యాశ.. వజ్రాల కోసం వెళ్తే ప్రాణమే పోయింది.. అసలు ఏం జరిగిందంటే..

తాజాగా వజ్రాల వేటలు వచ్చిన ఓ వ్యక్తి మృతి చెందాడు. పొరుగు ప్రాంతానికి చెందిన అతను కృష్ణా జిల్లా గుడిమెట్ల కొండపై వజ్రాల వేటకు వచ్చి అనుమానాస్పద రీతిలో మృతి చెందడం కలకలం రేపుతోంది. అతడు హత్యకు గురైయ్యాడా..? సాధారణ మరణమేనా అనేది తెలియడం లేదు. ఆ వివరాలేంటీ..? అతడు ఎవరు అనేది తేలాల్సి ఉంది. పొరుగు రాష్ట్రం నుంచి వజ్రాల వేట కోసం వచ్చిన ఒ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలంలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.. అయితే..

Vijayawada: కొంపముంచిన అత్యాశ.. వజ్రాల కోసం వెళ్తే ప్రాణమే పోయింది.. అసలు ఏం జరిగిందంటే..
Dies Under Suspicious
Follow us
M Sivakumar

| Edited By: Sanjay Kasula

Updated on: Oct 12, 2023 | 1:23 PM

విజయవాడ, అక్టోబర్ 12: అత్యాశ కొన్ని సార్లు ప్రాణాల‌ మీదకు తెస్తుంది. తాజాగా వజ్రాల వేటలు వచ్చిన ఓ వ్యక్తి మృతి చెందాడు. పొరుగు ప్రాంతానికి చెందిన అతను కృష్ణా జిల్లా గుడిమెట్ల కొండపై వజ్రాల వేటకు వచ్చి అనుమానాస్పద రీతిలో మృతి చెందడం కలకలం రేపుతోంది. అతడు హత్యకు గురైయ్యాడా..? సాధారణ మరణమేనా అనేది తెలియడం లేదు. ఆ వివరాలేంటీ..? అతడు ఎవరు అనేది తేలాల్సి ఉంది.

పొరుగు రాష్ట్రం నుంచి వజ్రాల వేట కోసం వచ్చిన ఒ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలంలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.. అయితే మృతుడు మృతికి కారణం హత్య , సాధారణ మరణమా అనే కోణంలో దర్యాప్తు ను చేపట్టారు..

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రాథమిక ఆధారాలను సేకరించారు.. చందర్లపాడు పీఎస్ ఏస్పై రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణ రాష్ట్రం నాగార్జునసాగర్ కు చెందిన ఇస్రం రాంబాబు (40) ఆటో డ్రైవర్గా పని చేస్తాడు. చందర్లపాడు మండలం గుడిమెట్ల అటవీ ప్రాంతంలో కొంతకాలంగా వజ్రాల వేట కొనసాగుతున్న సంగతి అందరికి తెలిసిందే.. ఈ క్రమంలో రాంబాబు కూడా వజ్రాలు అన్వేషించేందుకు గత మూడు రోజుల క్రితం గుడిమెట్ల వచ్చాడు.

బుధవారం వజ్రాల వేటకు వచ్చిన కొందరు రాంబాబు అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండడాన్ని గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారమివ్వడంతో చందర్లపాడు పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించడంతోపాటు ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. వజ్రాల వేటకు వచ్చిన వ్యక్తి హత్యకు గురయ్యాడా? లేదంటే ఇంకేదైనా కారణాల వల్ల మృతి చెందాడా అనే అంశాలపై దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి