Andhra Pradesh: యాసిడ్ దాడి ఘటనలో 117 రోజుల్లోనే తీర్పు.. నిందితులకు యావజ్జీవ కారాగారం..
Andhra Pradesh News: నేరానికి శిక్ష తప్పదు అది ఐపిసి సెక్షన్ల ప్రకారం అయినా భగవంతుని కోర్టులో నైనా అయినా అని చాలా మంది నమ్ముతుంటారు. ఇలా పైన భగవంతుడు ఉన్నాడు అని కోవటం ధైర్యం కోసం మరోవైపు ఖచ్చితంగా తనకు దేవుడు న్యాయం చేస్తాడని నమ్మటం కూడా కావచ్చు. కాని ఎపుడో ఏదో జరుగుతుందని కాదు నేరం జరిగిన 117 రోజుల్లో కేసు ట్రయల్స్ పూర్తి చేసుకుంది.
Eluru, October 12: నేరానికి శిక్ష తప్పదు అది ఐపిసి సెక్షన్ల ప్రకారం అయినా భగవంతుని కోర్టులో నైనా అయినా అని చాలా మంది నమ్ముతుంటారు. ఇలా పైన భగవంతుడు ఉన్నాడు అని కోవటం ధైర్యం కోసం మరోవైపు ఖచ్చితంగా తనకు దేవుడు న్యాయం చేస్తాడని నమ్మటం కూడా కావచ్చు. కాని ఎపుడో ఏదో జరుగుతుందని కాదు నేరం జరిగిన 117 రోజుల్లో కేసు ట్రయల్స్ పూర్తి చేసుకుంది. నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష ఖరారు చేసింది కోర్టు. ఏలూరు వివాహితపై జరిగిన యాసిడ్ దాడి, ఆమె మ్రృతి ఘటనపై నమోదైన కేసులో వచ్చింది ఈ తీర్పు. ఖచ్చితంగా ఈ తీర్పు మహిళలపై జరుగుతున్న ఘటనలకు చెక్ పడుతుందని నేరస్తులు భయపడేలా చేస్తుందంటున్నారు న్యాయవాదులు.
ఏపీలో మహిళల రక్షణ కోసం ఇప్పటికే కఠిన చట్టాలు అమలులోకి తెచ్చారు. మహిళల విషయంలో తప్పు చేయాలంటేనే వెన్నులో వణుకు పుట్టే విధంగా చట్టాలను మార్చడమే కాక కఠిన శిక్షలు అమలు చేస్తున్నారు. ఆ క్రమణంలోనే మహిళల రక్షణ కోసం ఆంధ్ర ప్రదేశ్ దిశా చట్టాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చింది. ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటుచేసి నిందితులకు త్వరితగతిన శిక్ష పడేలా పోలీసులు తీసుకుంటున్న చర్యలు తగిన ఫలితాలను అందిస్తున్నాయి. ఇటీవల ఏలూరులో ఓ వివాహితపై జరిగిన యాసిడ్ దాడిలో నిందితులకు ఘటన జరిగిన 117 రోజుల్లోనే పోలీసులు యావజ్జీవ శిక్షపడేలా చేశారు. ఏలూరు శ్రీరామ్ నగర్ లో ఫ్రాన్సిక అనే వివాహిత తన భర్తతో మనస్పర్ధలు కారణంగా తన తండ్రి ఇంటి వద్ద నివాసం ఉంటుంది. ఫ్రాన్సిక స్థానిక దంత వైద్యశాలలో రిసెప్సిస్ట్ గా పని చేస్తుంది.
అయితే ఫ్రాన్సిక సోదరి సౌజన్య కూడా తన భర్తతో గొడవపడి పుట్టింటిలోనే ఉంటుంది. ఏలూరు వన్ టౌన్ కు చెందిన బోడ నాగ సతీష్ తో సౌజన్య సన్నిహితంగా ఉంటుంది. అది గమనించిన ఫ్రాన్సిక తన సోదరీ సౌజన్యతో మాట్లాడవద్దని సతీష్ ని హెచ్చరించింది. సౌజన్యతో మాట్లాడకుండా ఫ్రాన్సిక అడ్డుపడుతుందని ఆమెపై సతీష్ కక్షపెంచుకున్నాడు. ఎలా అయినా ఆమెను చంపి అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేశాడు. పెయింటింగ్ పనులు చేస్తున్న తన స్నేహితులైన మోహన్, కిరణ్ ల సహాయంతో ఫ్రాన్సిక ను చంపాలనుకున్నాడు. ఫ్రాన్సిక ను చంపి తనకు అడ్డు తొలగిస్తే మోహన్, కిరణ్ లకు చెరొక 50 వేలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఫ్రాన్సికను యాసిడ్ పోసి చంపాలని నిర్ణయించారు. ఖాజా అనే వ్యక్తి సహాయంతో యాసిడ్ని కొని సిద్ధం చేశారు.
గత జూన్ 13వ తేదీ రాత్రి ఫ్రాన్సిక విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళుతున్న సమయంలో విద్యానగర్ వద్ద సతీష్, మోహన్, కిరణ్ లు ఫ్రాన్సిక కోసం కాపు కాసి రెక్కీ నిర్వహించారు. ఫ్రాన్సిక స్కూటీ పై వస్తున్న సమయంలో సతీష్, మోహన్, కిరణ్లకు సమాచారం అందించాడు. దాంతో వారి వెంట తెచ్చుకున్న యాసిడ్ ను ఎదురుగా వస్తున్న ఫ్రాన్సిక మొహంపై పోయడంతో ఆమె శరీరంలో చాలా భాగం కాలిపోయింది. తీవ్ర గాయాలతో ఇంటికి చేరుకున్న ఆమెను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే యాసిడ్ దాడి ఘటన తెలుసుకున్న ఏలూరు రేంజ్ డీఐజీ, జిల్లా ఎస్పీ బాధితురాలి వద్దకు చేరుకొని, ఆమెను పరామర్శించి మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి అక్కడ నుంచి విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ కి తరలించారు.
ఘటనపై కేసు నమోదు చేసిన 24 గంటల్లోనే నిందితులను అరెస్టు చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాధితురాలు మృతి చెందింది. ఈ యాసిడ్ ఘటన దాడిని పోలీసులు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నిందితులకు త్వరితగతిన కఠిన శిక్ష పడేలా చేయాలని ఉద్దేశంతో 21 రోజుల్లోనే పూర్తి దర్యాప్తు చేసి చార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించారు. దాంతో ముగ్గురు నిందితులకు 117 రోజుల్లోనే న్యాయమూర్తి యావర్జీవ కారాగార శిక్ష విధించారు. అతి తక్కువ సమయంలో తప్పు చేసిన నిందితులకు శిక్ష పడేలా చేసిన పోలీసులను పలువురు ప్రశంసలతో ముంచేత్తుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..