Nandyal: రిటైర్డ్ జడ్జికి తప్పని రెవెన్యూ తిప్పలు.. నంద్యాల జిల్లా అధికారుల వేధింపులకు నిరసనగా కోర్టుకు..
Nandyal district News: భూ సమస్య పరిష్కారం కోసం అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిప్పుకుంటరు ఈ పరిస్థితి సామాన్యులకే అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే. రెండేళ్ళుగా ఒక జడ్జి తాను రిటైర్డ్ అయ్యాక కొన్న రెండు ఎకరాల రిజిష్టర్ భూమిని ఆన్లైన్ ఎక్కించ కుండ కాళ్లరిగేలా తిప్పుతూ వేధించిన సంఘటన నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో చోటు చేసుకుంది. వెంకట పురం గ్రామం వద్ద జడ్జి నాగేంద్రరావు తాను కొనుగోలు చేసిన రెండు ఏకరాల భూమి రిజిష్టర్ ఐన వెంటనే తాను స్వయంగా రెవిన్యూ కార్యాలయానికి వెళ్లి..

నంద్యాల జిల్లా, అక్టోబర్ 12: సామాన్య ప్రజలకు, రైతులకు రెవిన్యూ అధికారులు భూ సమస్య పరిష్కారం కోసం అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిప్పుకుంటరు ఈ పరిస్థితి సామాన్యులకే అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే. రెండేళ్ళుగా ఒక జడ్జి తాను రిటైర్డ్ అయ్యాక కొన్న రెండు ఎకరాల రిజిష్టర్ భూమిని ఆన్లైన్ ఎక్కించ కుండ కాళ్లరిగేలా తిప్పుతూ వేధించిన సంఘటన నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో చోటు చేసుకుంది. వెంకట పురం గ్రామం వద్ద జడ్జి నాగేంద్రరావు తాను కొనుగోలు చేసిన రెండు ఏకరాల భూమి రిజిష్టర్ ఐన వెంటనే తాను స్వయంగా రెవిన్యూ కార్యాలయానికి వెళ్లి అన్ని డాక్యుమెంట్లు సమర్పించి ఆన్లైన్ చేయాలని కోరారు.
కొన్ని రోజుల గడిచిన తాను కొనుగోలు చేసిన భూమిని ఆన్లైన్ ఎక్కించక పోవడంతో రెవిన్యూ అధికారులను జడ్జి స్వయంగా వెళ్లి కనుకున్నపటికి సామాన్యులకు ఇచ్చే సమాధానమే జడ్జికి ఎదురైంది. చూస్తాం చేస్తాం అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఎదురైనప్పట్టికి తన సమస్య పరిష్కారం కోసం జడ్జి స్వయంగా తానే రెండేళ్ళుగా జిల్లాకలెక్టర్ మనిజీర్ జిలానీ కి డోన్ లో స్పందనలో పిర్యాదు చేసిన సమస్య పరిష్కారం కాక పోవడంతో రెవిన్యూ అధికారులు పట్టించుకోక పోవడంతో , రెవిన్యూ అధికారుల వేధింపులు తట్టుకోలేక న్యాయమూర్తి తనకు న్యాయం కోసం రెవిన్యూ అధికారుల వేధింపులు నుండి కాపాడాలని ఓ న్యాయ మూర్తి న్యాయంకోసం లోకాయుక్త లో పిర్యాదు చేసిన సంఘటన నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో చోటు చేసుకుంది.
భూ సమస్యల్లో సామాన్య రైతులకే కాదు తమకి ఎవరైనా ఒకటే నంటూ ఈ సంఘటనతో తేలిపోయింది. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి భూ సమస్యలను పరిష్కరించాలని రెండేళ్లుగా న్యాయమూర్తి సమస్యను పరిష్కరించకుండా వేధిస్తున్న రెవిన్యూ అధికారులపై ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం