Andhra Pradesh: ఏపీ ప్రజలకు సీఎం జగన్ గుడ్ న్యూస్.. ఆ సర్టిఫికెట్ ఇక పర్మనెంట్..
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కొన్ని విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజల ముంగిటకే అన్ని సేవలను తీసుకొచ్చారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా సచివాలయాల ద్వారా సేవలందిస్తున్నారు. ఇక జగనన్న సురక్ష, జగనన్న ఆరోగ్య సురక్ష వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఏమేమి..
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కొన్ని విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజల ముంగిటకే అన్ని సేవలను తీసుకొచ్చారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా సచివాలయాల ద్వారా సేవలందిస్తున్నారు. ఇక జగనన్న సురక్ష, జగనన్న ఆరోగ్య సురక్ష వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఏమేమి అవసరమున్నాయో కూడా గుర్తించి ఇంటిముంగిటే అందిస్తున్నారు. మూడు నెలల క్రితం జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులను రాష్ట్రంలో ఉన్న లక్షా 60 వేల కుటుంబాలను సందర్శించేలా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం ద్వారా ఇంటింటికి వెళ్లి ప్రజలకు అవసరమైన అన్ని రకాల సర్టిఫికెట్లు అందించేలా చర్యలు తీసుకున్నారు. క్యాస్ట్ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్, ఫ్యామిలీ సర్టిఫికెట్, రేషన్ కార్డు వంటి అన్ని రకాల ప్రభుత్వ సేవలను ఇంటిముంగిటకే అందించారు. అది కూడా ఒక్క రూపాయి ఖర్చు లేకండా ఇంటింటికీ వెళ్లి మరీ వాలంటీర్లు అందించారు. దీనిద్వారా ప్రజలకు ఆయా సర్టిఫికెట్ల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేకుండా ప్రభుత్వమే అన్ని చర్యలు తీసుకుంది. అటు జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా మరోసారి ఇంటింటికీ తిరుగుతూ వైద్య పరంగా అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటుంది ప్రభుత్వం. తాజాగా మరోసారి సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ద్వారా ప్రజల్లో ప్రభుత్వంపై మరింత విశ్వాసం పెరగాలంటున్నారు సీఎం.
ఆ సర్టిఫికెట్ తీసుకుంటే ఇక పర్మినెంట్ గా ఉండిపోతుంది..
రాష్ట్రంలో ఎక్కువగా ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్లను ప్రభుత్వం గుర్తించింది. వివిధ పథకాలు, ఇతర అవసరాల కోసం ప్రభుత్వ కార్యాలయాల్లో సమర్పించేందుకు అవసరమైన సర్టిఫికెట్ల జారీలో ప్రజలు ఇబ్బందులు పడకుండా కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తుంది. ఈ పథకాలకు అర్హత కోసం క్యాస్ట్ సర్టిఫికెట్ లు ఎక్కువగా అవసరం ఉంటుంది. అయితే చాలా సందర్భాల్లో లేటెస్ట్ సర్టిఫికెట్ లు కావాలంటూ అధికారులు అడుగుతున్న పరిస్థితి ఉంది. దీంతో ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇకపై ఇలాంటి పరిస్థితి లేకుండా ఒకసారి కుల ధృవీకరణ పత్రం తీసుకుంటే శాశ్వతంగా చెల్లుబాటు అయ్యేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదే విషయాన్ని అన్ని శాఖలు పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. అంతేకాదు డిజిలాకర్లలో సర్టిఫికెట్లు అందుబాటులో ఉంచుతుంది. ఇదే విషయంపై జీవో నెంబర్ 469ను విడుదల చేసిన సర్కార్.. ఆయా శాఖలకు గైడ్ లైన్స్ కూడా జారీ చేసింది. గత ఏడాది ప్రభుత్వం 52 లక్షల క్యాస్ట్ సర్టిఫికెట్లు జారీ చేసింది. ఈ ఏడాది 42 లక్షలు సర్టిఫికెట్లు జారీ చేసింది. ఒకసారి మీ సేవలో సర్టిఫికెట్ తీసుకుంటే దాన్ని ఆధారంగా చేసుకుని సర్టిఫికెట్లు ఇవ్వాలని చెప్పింది. క్యాస్ట్ సర్టిఫికెట్ కోసం ఎమ్మార్వో లేదా ఇతర అధికారులు విచారణ చేయాల్సిన అవసరం లేదని కూడా స్పష్టం చేసింది ప్రభుత్వం. ప్రభుత్వ పథకాలకు లబ్దిదారుడి తండ్రి, సోదరులు ఎవరైనా గతంలో సర్టిఫికెట్ తీసుకుని ఉంటే బంధుత్వం ఆధారంగా క్యాస్ట్ ఖరారు చేయాలని సూచించింది.. ప్రభుత్వం ఇచ్చిన తాజా విధివిధానాలతో 95 శాతం మేర సర్టిఫికెట్ల జారీ తగ్గిపోతుందంటున్నారు అధికారులు.
స్టూడెంట్స్‌కు ఆ సర్టిఫికెట్స్‌పై వెసులుబాటు..
కుల ధృవీకరణ పత్రాలతో పాటు ఆదాయ సర్టిఫికెట్ల పైనా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. దీనికి సంబంధించి జీవో నెంబర్ 484ను విడుదల చేసింది ప్రభుత్వం. ఎక్కువగా విద్యార్ధులకు ఇన్‌కమ్ సర్టిఫికెట్లు అవసరం ఉంటుంది.దీనికోసం ఎప్పటికప్పుడు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. దీనికి కూడా చెక్ పెట్టేలా ప్రభుత్వం నిర్నయం తీసుకుంది. ప్రభుత్వ పథకాలు, ఫీజులు మినహాయింపులు, స్కాలర్ షిప్ లు పొందేందుకు గత రెండేళ్లలో 75 లక్షల ఇన్‌కమ్ సర్టిఫికెట్లు జారీ చేసింది ప్రభుత్వం. ఇకపై ఈ సర్టిఫికెట్ కోసం అధికారులు ఆరు దశల నిర్ధారణ సరిపోతుందని, విద్యార్ధులను అడగవద్దని పేర్కొంది రెవెన్యూ అధికారులు ప్రతిసారి విచారణ అవసరం లేకుండా గ్రామ, వార్డు సచివాలయాల్లో నిర్వహించే ఆరు దశల నిర్ధారణ ప్రక్రియ ద్వారా ముందుకెళ్లాలని సూచించింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..