Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: అప్పటి వరకు కళ్లముందు కదలాడిన రెండేళ్ల కొడుకు.. నీటి సంపులో శవమై..!

అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు.. ఉన్నట్టుండి నీటి గండంతో మృత్యువాత పడ్డాడు. ఈ దారుణ సంఘటన చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. కర్నూలు జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అందరూ జాగ్రత్తలు పాటించాలని అధికారులు చూస్తున్నారు.

Andhra Pradesh: అప్పటి వరకు కళ్లముందు కదలాడిన రెండేళ్ల కొడుకు.. నీటి సంపులో శవమై..!
Water Sump
Follow us
J Y Nagi Reddy

| Edited By: Balaraju Goud

Updated on: Apr 05, 2025 | 5:49 PM

అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు.. ఉన్నట్టుండి నీటి గండంతో మృత్యువాత పడ్డాడు. ఈ దారుణ సంఘటన చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. కర్నూలు జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.

ఆదోని మండలం దొడ్డనగేరి గ్రామంలో రెండేళ్ల బాలుడు నీటి సంపులో పడి మృతి చెందడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. బందువులు తెలిపిన వివరాల ప్రకారం.. దొడ్డనగేరి గ్రామంలో ఆటో నడుపుకుంటూ జీవనం సాగించే రాజబాబు, అతని భార్య లక్ష్మి దంపతులకు ఒక కూతురు, ఇద్దరు కుమారులు. వారిలో రెండేళ్ల వరుణ్ తేజ ఆఖరి సంతానం. నీరు అవసరమై తల్లి లక్ష్మీ ఇంటి ముందు ఉన్న నీటి సంపు తెరిచి నీళ్లు తోడుకుని సంపు మూత మూసి ఇంట్లోకి వెళ్లి పోయింది.

అయితే తొందర్లో సంపు మూత సరిగా మూసుకోకపోవడంతో అక్కడే ఆడుకుంటూ ఉన్న వరుణ్ తేజ ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మృతి చెందాడు. అప్పటి వరకు కళ్ల ముందు ఆడుకుంటున్న కొడుకు కనిపించకపోవడంతో ఆ తల్లి చుట్టుపక్కల వెతికింది. చివరికి నీటి సంపులో బిడ్డను చూసి తల్లడిల్లిపోయింది. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కొడుకు నీటి సంపులో విగత జీవిగా మారడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిపోయింది. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అందరూ జాగ్రత్తలు పాటించాలని అధికారులు చూస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ఉగ్రదాడికి స్ట్రాంగ్ ఎన్కౌంటర్! ఇండియాలో PSL బ్యాన్
ఉగ్రదాడికి స్ట్రాంగ్ ఎన్కౌంటర్! ఇండియాలో PSL బ్యాన్
నియంత్రణ రేఖ వెంబడి పాక్ కవ్వింపు చర్యలు.. భారత్ ఆర్మీపై కాల్పులు
నియంత్రణ రేఖ వెంబడి పాక్ కవ్వింపు చర్యలు.. భారత్ ఆర్మీపై కాల్పులు
తొలి బంతికే సిక్స్.. ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి ఇలా
తొలి బంతికే సిక్స్.. ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి ఇలా
10th విద్యార్ధులకు 2025 అలర్ట్..పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే
10th విద్యార్ధులకు 2025 అలర్ట్..పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే
జూలై 3న అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం.. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే
జూలై 3న అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం.. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే
ఉగ్రవేటకు రంగం సిద్ధం.. నేడు పహల్గాంకు ఆర్మీ చీఫ్ రాక..!
ఉగ్రవేటకు రంగం సిద్ధం.. నేడు పహల్గాంకు ఆర్మీ చీఫ్ రాక..!
నా పని అయిపోయింది అనుకున్న! ఆక్సిడెంట్ పై ఫ్లింటాఫ్..
నా పని అయిపోయింది అనుకున్న! ఆక్సిడెంట్ పై ఫ్లింటాఫ్..
8 మ్యాచ్‌ల్లో 2 విజయాలు.. 3వ విజయం కోసం చెన్నై, హైదరాబాద్ పోరు
8 మ్యాచ్‌ల్లో 2 విజయాలు.. 3వ విజయం కోసం చెన్నై, హైదరాబాద్ పోరు
పాక్ కి గుణపాఠం చెప్పేందుకు వ్యూహాత్మకంగా భారత్ అడుగులు
పాక్ కి గుణపాఠం చెప్పేందుకు వ్యూహాత్మకంగా భారత్ అడుగులు
ఇంటర్‌లో ఫెయిల్.. UPSCసివిల్స్‌లో మాత్రం సత్తాచాటిన తెలుగు బిడ్డ!
ఇంటర్‌లో ఫెయిల్.. UPSCసివిల్స్‌లో మాత్రం సత్తాచాటిన తెలుగు బిడ్డ!