Students Missing: పండగపూట విషాదం.. పెన్నా నదిలో ఇద్దరు విద్యార్థుల గల్లంతు..
Penna River: శివరాత్రి పర్వదినాన కడప జిల్లాలో విషాదం నెలకొంది. పెన్నా నదిలోకి స్నానానికి వెళ్లిన ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. ఈ ఘటన జిల్లాలోని పుష్పగిరి..
Penna River: శివరాత్రి పర్వదినాన కడప జిల్లాలో విషాదం నెలకొంది. పెన్నా నదిలోకి స్నానానికి వెళ్లిన ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. ఈ ఘటన జిల్లాలోని పుష్పగిరి ఆలయం సమీపంలో చోటుచేసుకుంది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కడపజిల్లలోని ముద్దనూరు మండలం థర్మల్ గ్రామంలో తొమ్మిదో తరగతి చదువుతున్న కొంతమంది విద్యార్థులు.. వల్లూరు పరిధిలోని పుష్పగిరి పుణ్యక్షేత్రానికి గురువారం ఉదయం వెళ్లారు. ఈ క్రమంలో పుష్పగిరి కొండపై నున్న సంతాన మల్లేశ్వర స్వామి, చెన్నకేశవుల స్వామివార్లను దర్శించుకున్నారు.
అనంతరం విద్యార్థులంతా కలిసి కొండ దిగువన ప్రవహిస్తున్న పెన్నానదిలో స్నానం చేసేందుకు వెళ్లారు. స్నానం చేస్తున్న క్రమంలో నది లోపలికి వెళ్లిన ఇద్దరు విద్యార్థులు అక్కడ సుడిగుండంలో చిక్కుకుని గల్లంతయ్యారు. గల్లంతైన వారు కార్తీక్, నందకిశోర్‌గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోని పరిస్థితిని సమీక్షించారు. స్థానికంగా ఉన్న గత ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Also Read: