తెల్లవారుజామున కాకినాడలో రెండు లారీలు దగ్ధం.. క్లీనర్ సజీవ దహనం!
కత్తిపూడి నేషనల్ హైవేపై గురువారం (జనవరి 29) తెల్లవారుజామున నాలుగు గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు లారీలు అగ్నిక ఆహుతవగా.. ఒకరు సజీవ దహనమయ్యారు. అన్నవరం వైపు నుంచి రాజమండ్రి వైపు చేపల ఫీడ్ తో వెళుతున్న లారీని వెనకనుంచి..

ప్రత్తిపాడు, జనవరి 29: కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో దారుణ ఘటన చోటు చేసుకుంది. కత్తిపూడి నేషనల్ హైవేపై గురువారం (జనవరి 29) తెల్లవారుజామున నాలుగు గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు లారీలు అగ్నిక ఆహుతవగా.. ఒకరు సజీవ దహనమయ్యారు. అన్నవరం వైపు నుంచి రాజమండ్రి వైపు చేపల ఫీడ్ తో వెళుతున్న లారీ జంక్షన్ వద్ద మలుపు తిరుగుతుండగా వెనకనుంచి కంటైనర్ లారీ వేగంగా ఢీ కొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో రెండు లారీల క్యాబ్లు అగ్నికి హాహుతయ్యాయి.
ఈ ఘటనలో కంటైనర్ లారీలో ఉన్న క్లీనర్ మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యాడు. అయితే రెండు లారీల డ్రైవర్లు మాత్రం త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకుని సురక్షితంగా బయటపడ్డారు. స్థానికులు గమనించి ఫైర్ ఇంజన్‌కు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి ఫైర్ ఇంజన్ చేరుకుని మంటలను అదుపు చేసింది. దీనిపై అన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. మృతుడిని కోల్‌కతాకు చెందిన కమల్ షేక్ (43)గా గుర్తించారు. డ్రైవర్లు ఇద్దరికి గాయాలయ్యాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.




