Anantapuram: అనంతపురం జిల్లాలో చిరుత పులుల హల్‌చల్.. భయాందోళనలో ప్రజలు..
Anantapuram: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో చిరుత పులులు హల్ చల్ చేస్తుననాయి. రెండు చిరుత పులులు అక్కడ తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి.
Anantapuram: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో చిరుత పులులు హల్ చల్ చేస్తుననాయి. రెండు చిరుత పులులు అక్కడ తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా ఎక్కడో ఒక చోట చిరుతపులులు కనిపిస్తూనే ఉన్నాయి. దాంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఏ సమయంలో ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తాయో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక కళ్యాణదుర్గం సమీపంలోని అటవీ ప్రాంతాల్లోని గ్రామాల్లోనూ చిరుత పులులు సంచరిస్తున్నారు. పవుశులపై దాడులు చేస్తున్నాయి.
తాజాగా పట్టణ సమీపంలోని అక్కమ్మ కొండ పై చిరుత పులులు కనిపించడంతో జనాలు భయబ్రాంతులకు గురయ్యాడు. పెద్ద బండ రాయి పైన రెండు చిరుతలు అటు ఇటు తిరుగుతూ చాలాసేపు అక్కడే ఉండిపోయాయి. చిరుతలను చూసి జనం బెంబేలెత్తిపోయారు. ఈ సంఘటనపై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అయితే అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకునేలోపు చిరుత పులులు అక్కడి నుంచి వెళ్లిపోయాయి. తరచూ ఇలా చిరుతపులులు జనావాసాల్లోకి రావడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీశాఖ అధికారులు దీనిపై స్పందించి చిరుతలను పట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Also read:
Health Tips: మెరుగైన ఆరోగ్యం కోసం.. మీ డైట్‌లో ఈ 5 ఆహారాలను తప్పనిసరిగా చేర్చుకోండి..
మాదాపూర్‌లోని CII జంక్షన్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారు బీభత్సం.. వీడియో
Vastu Tips: అదృష్టం పొందాలంటే.. ఈ వస్తువులను వెంటనే మీ పర్సు నుంచి తీసేయండి.!