దేవరగట్టు బన్నీ ఉత్సవంలో ప్రమాదం.. ఇద్దరు మృతి, 100 మందికి గాయాలు..

కర్నూలు జిల్లా దేవరగట్టు బన్నీ ఉత్సవంలో విషాదం చోటు చేసుకుంది. ఉత్సవాన్ని చూసేందుకు వచ్చి కొంతమంది స్థానికులు సమీపంలోని చెట్లు ఎక్కారు. ఎక్కువ మంది ఎక్కడంతో ఆ బరువుకు చెట్టు కొమ్మ విరిగి ఇద్దరు మృతి చెందారు. మృతులు ఆస్పరికి చెందిన గణేష్‌, కమ్మరచేడుకు చెందిన రామాంజనేయులుగా గుర్తించారు పోలీసులు.

దేవరగట్టు బన్నీ ఉత్సవంలో ప్రమాదం.. ఇద్దరు మృతి, 100 మందికి గాయాలు..
Devaragattu Bunny Festival
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 25, 2023 | 8:00 AM

కర్నూలు జిల్లా దేవరగట్టు బన్నీ ఉత్సవంలో విషాదం చోటు చేసుకుంది. ఉత్సవాన్ని చూసేందుకు వచ్చి కొంతమంది స్థానికులు సమీపంలోని చెట్లు ఎక్కారు. ఎక్కువ మంది ఎక్కడంతో ఆ బరువుకు చెట్టు కొమ్మ విరిగి ఇద్దరు మృతి చెందారు. మృతులు ఆస్పరికి చెందిన గణేష్‌, కమ్మరచేడుకు చెందిన రామాంజనేయులుగా గుర్తించారు పోలీసులు.

ఇదిలా ఉంటే.. ప్రతి ఏడాది లాగే ఈసారి దేవరగట్టులో రక్తం చిందింది. బన్నీ ఉత్సవంలో పదుల సంఖ్యలో తలలు పగిలాయి. బన్నీ ఉత్సవం రణరంగాన్ని తలపించింది. అర్ధరాత్రి వేళ మాళమల్లేశ్వర స్వామిని దక్కించుకోవడంలో స్థానిక ప్రజలు బన్నీ ఉత్సవంలో పోటీపడ్డారు. సాంప్రదాయం, ఆచారం పేరిట భక్తి పోరాటం చేశారు. ఉత్సవం ఓ వైపు కోలాహలంగానూ, మరోవైపు నెత్తురుమయంగానూ కనిపించింది. మరోవైపు బన్నీ ఉత్సవంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కొందరు దుండగులు కాగడాల దివిటీలను గాల్లోకి ఎగరేయడంతో పలువురికి గాయాలు అయ్యాయి. ఈ కర్రల సమరంలో మొత్తంగా 100 మందికి గాయాలు కాగా వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

కర్నూలు జిల్లా దేవరగట్టు గ్రామంలోని కొండపై ఉన్న మాల మల్లేశ్వరస్వామి ఆలయంలోని మాళమ్మ, మల్లేశ్వరస్వామికి దసరా పండుగ రోజు అర్ధరాత్రి 12 గంటలకు కల్యాణం నిర్వహించారు.తర్వాత కొండకు సమీపంలోని పాదాలగట్టు, రక్షపడ, శమీవృక్షం, బసవన్నగుడి ప్రాంతాల్లో దివిటీల వెలుతురులో మాళమ్మ, మల్లేశ్వరస్వామి విగ్రహాలను ఊరేగించారు. ఉత్సవ విగ్రహాలను దక్కించుకోవటం కోసం మూడు గ్రామాల ప్రజలు ఓ వర్గంగా, ఐదు గ్రామాల ప్రజలు మరో వర్గంగా ఏర్పడి కర్రలతో దాడి చేసుకున్నారు.

ఈ బన్నీ ఉత్సవ యుద్దానికి పెద్ద చరిత్రే ఉంది. మాళమల్లేశ్వర విగ్రహం కోసం దేవరగట్టుతో పాటు చుట్టుపక్కల గ్రామాలవారు కర్రలతో కొట్టుకోవడం ఆనవాయితీగా వస్తుంది. దసరా రోజున అర్ధరాత్రి వేళా స్వామి విగ్రహాన్ని తీసుకెళ్తే అంతా మంచి జరుగుతుందని అక్కడి ప్రజల నమ్మకం. అందుకే ఉత్సవాన్ని యుద్ధంలా జరుపుకుంటారు ప్రజలు. ప్రతీ ఏడాదిలాగే ఈసారి సమరంలో అనేక మందికి గాయాలయ్యాయి, తలలు పగిలాయి. రక్తం చిందింది. రక్తపు మరకలు అంటాయి. అయినా తగ్గేదేలే అంటూ మాళమల్లేశ్వర స్వామిని దక్కించుకోవడం కోసం స్థానిక భక్తులు పోరాటం సాగించారు. ప్రతి ఏటా జరుగుతున్న బన్నీ ఉత్సవంలో ప్రశాంతత నెలకొల్పడానికి పోలీసు, అధికారులు ప్రయత్నించారు. దేవరగట్టులో రక్తపాతం జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా ఈసారి బందోబస్తు ముమ్మరం చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

దుబాయ్‌ కారు రేసులో ప్రమాదం.. హీరో అజిత్‌‌కు గాయాలు
దుబాయ్‌ కారు రేసులో ప్రమాదం.. హీరో అజిత్‌‌కు గాయాలు
ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభం..
ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభం..
నిమ్మ కాయను నేరుగా అప్లై చేస్తే చర్మానికి ఎంత హానికరమో తెలుసా
నిమ్మ కాయను నేరుగా అప్లై చేస్తే చర్మానికి ఎంత హానికరమో తెలుసా
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2025: మీరు తెలుసుకోవాల్సిన కీలక అంశాలు..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2025: మీరు తెలుసుకోవాల్సిన కీలక అంశాలు..
భారతీయులకు భారీ గుడ్‌న్యూస్.. అమెరికా సంచలన నిర్ణయం!
భారతీయులకు భారీ గుడ్‌న్యూస్.. అమెరికా సంచలన నిర్ణయం!
వందకోట్లు ఇచ్చిన ఆ పని చేయను..
వందకోట్లు ఇచ్చిన ఆ పని చేయను..
మొబైల్‌ని ఫుల్ చార్జింగ్ చేయడానికి ఎన్ని యూనిట్ల విద్యుత్ అవసరం
మొబైల్‌ని ఫుల్ చార్జింగ్ చేయడానికి ఎన్ని యూనిట్ల విద్యుత్ అవసరం
కుంభమేళాపై విదేశీయులూ ఆసక్తి ఎన్ని దేశాల వారు ఆరా తీస్తున్నారంటే
కుంభమేళాపై విదేశీయులూ ఆసక్తి ఎన్ని దేశాల వారు ఆరా తీస్తున్నారంటే
సూపర్ ఫీచర్స్‌తో నయా ఫోన్ రిలీజ్ చేసిన రెడ్‌మీ..!
సూపర్ ఫీచర్స్‌తో నయా ఫోన్ రిలీజ్ చేసిన రెడ్‌మీ..!
మేం తలుచుకుంటే కాంగ్రెస్ నేతలు రోడ్ల మీద తిరగలేరు: కిషన్ రెడ్డి
మేం తలుచుకుంటే కాంగ్రెస్ నేతలు రోడ్ల మీద తిరగలేరు: కిషన్ రెడ్డి