వందకోట్లు ఇచ్చిన ఆ పని చేయను.. తెగేసి చెప్పిన ఎన్టీఆర్ హీరోయిన్..
చాలా మంది హీరోయిన్ ఇండస్ట్రీలో స్టార్ డమ్ తెచ్చుకోవడానికి చాలా కష్టపడుతున్నారు. ఎలాంటి పాత్రలైనా సరే ఓకే చేసి తమ నటనతో మెప్పిస్తున్నారు. కానీ కొంతమంది భామలు మాత్రం కొన్ని పాత్రలు చేయడానికి వెనకాడుతున్నారు. తాజాగా ఓ హీరోయిన్ కూడా ఇదే మాట చెప్పింది. వందకోట్లు ఇచ్చినా కూడా ఆ పాత్ర చేయను అని తెగేసి చెప్పింది.
సినిమా ఇండస్ట్రీ అనేది ఓ రంగుల లోకం. ఈ ప్రపంచంలో అడుగు పెట్టాలని.. రాణించాలని చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక చాలా మంది ముద్దుగుమ్మలు హీరోయిన్స్ గా రాణిస్తూ.. సినిమా సినిమాకు వేరియేషన్స్ చూపిస్తూ దూసుకుపోతున్నారు. పాత్ర డిమాండ్ చేస్తే ఎలా అయినా నటించడానికి కొంతమంది భామలు రెడీ అవుతున్నారు. అయితే మరికొంతమంది మాత్రం కోట్లు ఇచ్చిన కొన్ని పాత్రలు చేయము అని తెగేసి చెప్తున్నారు. ఎంత స్టార్ హీరోయిన్ అయినా.. ఎన్ని కోట్లు ఇచ్చినా సరే కొన్ని చేయంనంటే చేయం అంటున్నారు. తాజాగా ఓ హీరోయిన్ కూడా ఇదే స్టేట్మెంట్ ఇచ్చింది. వందల కోట్లు ఇచ్చిన కూడా ఆ పని చేయను అని అంటుంది. ఇంతకూ ఆమె ఎవరు.?
చాలా మంది ముద్దుగుమ్మతో తెలుగులో తక్కువ సినిమాలతోనే ప్రేక్షకులను మెప్పించారు. ఒకటి రెండు సినిమాలు చేసి ఆతర్వాత ఇండస్ట్రీకి దూరం అయిన వారు పదుల సంఖ్యలో ఉన్నారు. అలాంటి వారిలో అమీషాపటేల్ ఒకరు. ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ తెలుగులో క్రేజీ సినిమాల్లో నటించింది. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లాంటి బడా హీరోల సినిమాల్లో నటించింది అమీషా. ఆతర్వాత తిరిగి బాలీవుడ్ కు చెక్కేసి అక్కడ సినిమాలు చేసింది. బాలీవుడ్ లో ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.
ప్రస్తుతం ఈ అమ్మడు సినిమాల స్పీడ్ తగ్గించింది. మొనీమద్యే గదర్ 2 సినిమాతో భారీ హిట్ అందుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అందాలతో ప్రేక్షకులను కవ్విస్తుంది. ఇదిలా ఉంటే అమీషా పటేల్ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. గతంలో ఆమె మాట్లాడుతూ.. వందల కోట్లు ఇచ్చిన ఓ పాత్ర మాత్రం చేయను అని చెప్పింది. అయితే అమీషా పటేల్ అత్త పాత్రలో కనిపించడానికి ఒప్పుకోలేదు అని కామెంట్స్ చేశాడు. దానికి ఆమె కౌంటర్ ఇస్తూ.. ఏ పాత్ర చేయాలి, ఏ పాత్ర చేయకూడదు అనే క్లారిటీ నాకు ఉంది. మీరంటే నాకు గౌరవం ఉంది. వందకోట్లు ఇచ్చినా కూడా నేను అత్త పాత్రలు చేయను అని చెప్పుకొచ్చింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .