నిజం గెలవాలంటూ కదం తొక్కుతున్న చంద్రబాబు సతీమణి.. అండగా తెలుగు తమ్ముళ్లు
జైలులో ఉన్న చంద్రబాబు పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న కక్ష్య సాధింపు ను జనంలోకి తీసుకెళ్లాలన్నా లక్ష్యంతో నారా భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమం చేపట్టారు. ఇందు కోసం పార్టీ యంత్రాంగం ఈ మేరకు విస్తృత ఏర్పాట్లు చేసింది. వారంలో మూడు రోజులు పర్యటించేలా పార్టీ అంతరంగం ముందుగా చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో మూడు రోజుల పాటు పర్యటనను ఖరారు చేసింది.
తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అక్టోబర్ 25 నుంచి నిజం గెలవాలని జనం మధ్యకు వెళుతున్నారు. చంద్రబాబు సొంత గ్రామం నారావారిపల్లె నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. సోమవారం ఉదయం ముందుగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నారా భువనేశ్వరి అనంతరం నారావారిపల్లి లో గ్రామ దేవత, కులదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రబాబు తల్లిదండ్రులు నారా ఖర్జూర నాయుడు అమ్మనమ్మల సమాధుల వద్ద నివాళులు అర్పించారు.
జైలులో ఉన్న చంద్రబాబు పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న కక్ష్య సాధింపు ను జనంలోకి తీసుకెళ్లాలన్నా లక్ష్యంతో నారా భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమం చేపట్టారు. ఇందు కోసం పార్టీ యంత్రాంగం ఈ మేరకు విస్తృత ఏర్పాట్లు చేసింది. నారావారిపల్లి నుంచి టీడీపీ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. వారంలో మూడు రోజులు పర్యటించేలా పార్టీ అంతరంగం ముందుగా చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో మూడు రోజుల పాటు పర్యటనను ఖరారు చేసింది. మొదట రాయలసీమ జిల్లాల్లో ఈ పర్యటన సాగనుంది. మహిళలతో పెద్దఎత్తున సభ నిర్వహించేందుకు టీడీపీ యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.
చంద్రబాబు అరెస్టుతో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించనున్న నారా భువనేశ్వరి మంగళవారం మధ్యాహ్నం ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి నిజం గెలవాలి కార్యక్రమం చేపట్టనున్నారు. చంద్రబాబు అరెస్టుపై పోరాటంలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టనున్న భువనేశ్వరి.. చంద్రబాబుపై రాజకీయ కక్ష సాధింపుతోనే కేసు పెట్టారని, అసత్య ఆరోపణలతో జైల్లో పెట్టారన్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని భావిస్తున్నారు. పోరాటాన్ని ఉదృతం చేసేలా నిజం గెలవాలన్న కార్యక్రమాన్ని చేపట్టారు. 46 రోజులుగా జైల్‌లో ఉంటున్న చంద్రబాబుకు మద్ధతుగా రోడ్డెక్కుతున్న నారా భువనేశ్వరి మహిళల్లో చైతన్యం తెచ్చేందుకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
తొలి రోజు పాకాల మండలం నేండ్రగుంటకు చెందిన చిన్నబ్బ, చంద్రగిరికి చెందిన ప్రవీణ్ రెడ్డి కుటుంబాలను భువనేశ్వరి పరామర్శిస్తారు. అనంతరం చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ అగరాలలో నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొంటారు. పెద్ద ఎత్తున మహిళలు పాల్గొనేలా తెలుగు దేశం పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేశారు. తిరుపతి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లోనూ నిజం గెలవాలి కార్యక్రమంలో భువనేశ్వరి పాల్గొంటారు.
అయితే ఈ సందర్భంగా నారా భువనేశ్వరి సోషల్ మీడియా వేదికగా భావోద్వేగమైన ట్వీట్ చేశారు. చంద్రబాబు లేకుండా తొలిసారి తిరుమల వెళ్ళానని.. ఈ ప్రయాణం భారంగా ఉందంటూ ఏమోషనల్ అయ్యారు. దేవుడి దయతో నిజం గెలుస్తుందని నమ్ముతున్నన్నారు భువనేశ్వరి. ‟ఎప్పుడూ కుటుంబ సభ్యులతో ఊరు వచ్చే నేను.. బాబు జైల్లో ఉన్న కారణంగా ఒంటరిగా నారావారిపల్లె వెళ్ళాను. ఈ ప్రయాణం ఎంతో బాధ కలిగించింది. ప్రతి నిమిషం భారంగా గడిచింది. ఆ ఏడుకొండల వాడి దయతో, మా ఊరు నాగాలమ్మ తల్లి కృపతో, ప్రజల మద్దతుతో నిజం గెలుస్తుందని నమ్ముతున్నాను. దీనిలో భాగంగా చంద్రగిరిలో రేపు తొలి అడుగు వేస్తున్నాను” అంటూ ట్వీట్ చేశారు భువనేశ్వరి.
నా భర్త చంద్రబాబు నాయుడు గారు లేకుండా తొలిసారి తిరుమల వెళ్ళాను. ఎప్పుడూ కుటుంబ సభ్యులతో ఊరు వచ్చే నేను అయన జైల్లో ఉన్న కారణంగా ఈరోజు ఒంటరిగా నారావారిపల్లె వెళ్ళాను. ఈ ప్రయాణం నాకు ఎంతో బాధ కలిగించింది. ప్రతి నిమిషం భారంగా గడిచింది. ఆ ఏడుకొండల వాడి దయతో, మా ఊరు నాగాలమ్మ తల్లి… pic.twitter.com/81lB0pDtVr
— Nara Bhuvaneswari (@ManagingTrustee) October 24, 2023
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..