AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇకపై ఆటలు చెల్లవు.. కొండపై TTD కొత్త టెక్నాలజీ.. దళారుల బెడదకు చెక్..!

తిరుమలలో విజిలెన్స్ వింగ్ కొరడా జులిపిస్తోంది. దళారీల దందాకు చెక్ పెడుతోంది. దళారీ వ్యవస్థతో మోసపోతున్న భక్తుల ఫిర్యాదుపై వరుస కేసులు నమోదు చేస్తోంది. విజిలెన్స్ నిఘాతో తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రక్షాళన కొనసాగుతోంది. తిరుమలలో భక్తులను మోసగిస్తున్న దళారీల దందాకు చెక్ పెడుతున్న విజిలెన్స్ వింగ్ టెక్నాలజీని వినియోగించి భక్తులను మోసగిస్తున్న దొంగల ముఠాల భరతం పడుతోంది.

ఇకపై ఆటలు చెల్లవు.. కొండపై TTD కొత్త టెక్నాలజీ.. దళారుల బెడదకు చెక్..!
TTD
Raju M P R
| Edited By: |

Updated on: Jan 18, 2025 | 4:08 PM

Share

తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు.. ఆపద మొక్కుల స్వామి. అందుకే క్షణం పాటు వెంకన్న దర్శనం దొరికితే చాలు అన్నది భక్తుల ఆశ. అందుకే ఎన్నో వ్యయ ప్రయాసలు లెక్క చేయక శ్రీవారి దర్శనం కోసం పరితపిస్తారు. అయితే భక్తుల అవసరం తిరుమల కొండలో కొందరు దళారీలకు ఆదాయ వనరుగా మారిపోతుంది. భక్తులను దర్శనం వసతి కల్పిస్తామంటూ బురిడీ కొట్టించే కొందరు దళారీలు తిరుమల కొండపై దండా కొనసాగిస్తున్నారు. భక్తులను నిలువు దోపిఢీ చేస్తున్నారు.

భక్తులను వరుసగా మోసగిస్తున్న దళారీల భరతం పడుతున్న విజిలెన్స్ వింగ్ కొరడా జులిపిస్తోంది. ఇందులో భాగంగానే మూడ్రోజుల క్రితం ఇంటి దొంగల చేతివాటాన్ని గుర్తించింది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన నకిలీ టికెట్లతో భక్తులకు స్వామి వారి దర్శనం చేయించిన దళారీలను పట్టుకుంది. అనుమానంతో వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్ద కొందరు భక్తులను విచారించిన విజిలెన్స్ వింగ్ ముఠా గుట్టురట్టు చేసింది. అగ్నిమాపక సిబ్బంది మణికంఠ సహాయంతో నకిలీ టికెట్లను తయారు చేస్తున్న వైనం బయట పెట్టింది.

హైదరాబాద్, పొద్దుటూరు, బెంగళూర్ భక్తులు సుమారు 11 మంది నుంచి రూ 19 వేలు వసూలు చేసిన ఇంటి దొంగలను పట్టుకుంది విజిలెన్స్ విభాగం. తిరుపతికి చెందిన టాక్సీ డ్రైవర్లు శశి, చెన్నై జగదీష్, అగ్నిమాపక శాఖలో పనిచేసే ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ మణికంఠ, కౌంటర్ సిబ్బంది లక్ష్మీపతి, మరో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ భాను ప్రకాష్‌ లను విచారించిన విజిలెన్స్ వింగ్, తిరుమల 1 టౌన్ పీఎస్ లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తుండగా రెండ్రోజుల క్రితం తిరుమలలో మరో దళారీ దందా ను విజిలెన్స్ వింగ్ బయట పెట్టింది.

దర్శనం, వసతి పేరుతో బెంగుళూరుకు చెందిన భక్తుల నుంచి రూ 1.31 లక్షలు వసూలు చేసిన వేణుగోపాల్ అనే దళారీ బాగోతాన్ని బయట పెట్టింది. భక్తుల నుంచి డబ్బులు కాజేసిన వేణుగోపాల్ పోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడంతో మోసం వెలుగులోకి వచ్చింది. శ్రీవారి దర్శనం కోసం 16న బెంగళూరు భక్తులను తిరుమలకు‌ రమ్మని చెప్పిన దళారీ వేణుగోపాల్ అసలు రంగు వాళ్ళకు కొండకు చేరాక బయట పడింది. మొసపోయినట్లు గుర్తించిన బెంగుళూరు చెందిన 7 మంది భక్తులు టీటీడీ ఉద్యోగి ‌నంటూ పరిచయం చేసుకున్న వేణుగోపాల్ మోసగించినట్లు నిర్ధారించుకున్నారు. దీంతో టీటీడీ విజిలెన్స్ సిబ్బంది వద్ద మొరపెట్టుకున్నారు.

ఈ మేరకు భక్తుల ఫిర్యాదుతో వెలుగులోకి వేణుగోపాల్ ఘరానా మోసం బయటపడగా ఈ మేరకు విజిలెన్స్ అదికారులు విచారణ చేపట్టారు. గతంలోనూ వేణుగోపాల్ ఇలాంటి మోసాలకు పాల్పడినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఈ మేరకు తిరుమల -1 టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదయింది. ఇలా తిరుమలలో భక్తులను మోసగిస్తున్న దళారీల దందాకు చెక్ పెడుతున్న విజిలెన్స్ వింగ్ టెక్నాలజీని వినియోగించి భక్తులను మోసగిస్తున్న దొంగల ముఠాల భరతం పడుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
సాధారణ కీళ్ల నొప్పులకు, ఆర్థరైటిస్‌కు మధ్య తేడా ఏంటి?..
సాధారణ కీళ్ల నొప్పులకు, ఆర్థరైటిస్‌కు మధ్య తేడా ఏంటి?..
క్లాసికల్ సినిమా ఆడదు అన్నారు.. కట్ చేస్తే.. ఇండస్ట్ర్లీలోనే పెద్
క్లాసికల్ సినిమా ఆడదు అన్నారు.. కట్ చేస్తే.. ఇండస్ట్ర్లీలోనే పెద్
విమానాన్ని తలపించేలా ఆర్టీసీ లగ్జరీ బస్సులు..హాస్టెస్, వైఫై ఎన్నో
విమానాన్ని తలపించేలా ఆర్టీసీ లగ్జరీ బస్సులు..హాస్టెస్, వైఫై ఎన్నో
ఢాకేశ్వరి ఆలయం: బంగ్లాదేశ్‌లోని 800 ఏళ్ల పురాతన దుర్గాదేవి ఆలయం..
ఢాకేశ్వరి ఆలయం: బంగ్లాదేశ్‌లోని 800 ఏళ్ల పురాతన దుర్గాదేవి ఆలయం..
వేల కోట్లు ఆదా.. రికార్డు వేగంతో పనులు.. 5 ఏళ్లలో పీఎం గతిశక్తి
వేల కోట్లు ఆదా.. రికార్డు వేగంతో పనులు.. 5 ఏళ్లలో పీఎం గతిశక్తి
ప్రెగ్నెంట్‏గా ఉండి ఆ సినిమాలో స్పెషల్ సాంగ్ చేశా..
ప్రెగ్నెంట్‏గా ఉండి ఆ సినిమాలో స్పెషల్ సాంగ్ చేశా..
మంచం దగ్గరకు గుర్రాలు.. తల్లి చివరి కోరిక తీర్చిన కూతురు!
మంచం దగ్గరకు గుర్రాలు.. తల్లి చివరి కోరిక తీర్చిన కూతురు!
కేతువు సంచారం ఎఫెక్ట్.. 56 రోజుల పాటు ఈ 5 రాశులకు అదృష్టమే..
కేతువు సంచారం ఎఫెక్ట్.. 56 రోజుల పాటు ఈ 5 రాశులకు అదృష్టమే..
అదిరిపోయే ఫీచర్లతో కోడాక్ స్మార్ట్‌ టీవీ
అదిరిపోయే ఫీచర్లతో కోడాక్ స్మార్ట్‌ టీవీ
చికెన్‌ బ్రెస్ట్‌, లెగ్‌ పీస్‌.. ఏది తీసుకుంటే మంచిది?
చికెన్‌ బ్రెస్ట్‌, లెగ్‌ పీస్‌.. ఏది తీసుకుంటే మంచిది?