Traffic restrictions: వాహనదారులకు అలర్ట్.. రేపు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు.. ప్రత్యామ్నాయ మార్గాలివే
ఏప్రిల్ ఒకటో తేదీన తల్లీబిడ్డల నూతన వాహనాలు ప్రారంభం కానున్నందున విజయవాడ(Vijayawada) నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు(Traffic Restrictions) విధిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా వెల్లడించారు. బెంజ్ సర్కిల్ వేదికగా...
ఏప్రిల్ ఒకటో తేదీన తల్లీబిడ్డల నూతన వాహనాలు ప్రారంభం కానున్నందున విజయవాడ(Vijayawada) నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు(Traffic Restrictions) విధిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా వెల్లడించారు. బెంజ్ సర్కిల్ వేదికగా ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా వాహనాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో మార్చి 31వ తేదీ రాత్రి 10 గంటల నుంచి ఏప్రిల్ 1న మధ్యాహ్నం 12 గంటల వరకు బెంజిసర్కిల్ (Benz Circle) నుంచి ఆర్టీసీ వై జంక్షన్ వరకు ఎలాంటి వాహనాలకు అనుమతి లేదని తెలిపారు. ఈ మేరకు వాహనదారులకు ప్రత్యామ్నాయ మార్గాలు వివరాలను వివరించారు. చెన్నై వైపు నుంచి విజయవాడ మీదుగా విశాఖపట్నం వైపునకు వెళ్లే వాహనాలను ప్రకాశం జిల్లా తోవగుంట, చీరాల, బాపట్ల, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ హనుమాన్ జంక్షన్ మీదుగా మళ్లిస్తారు. ఏలూరు వైపు నుంచి హైదరాబాద్ వెళ్లే భారీ వాహనాలను ఇబ్రహీంపట్నం వైపు మళ్లిస్తారు. ఏలూరు వైపు నుంచి చెన్నై వెళ్లే వాహనాలను హనుమాన్ జంక్షన్ నుంచి ప్రకాశం జిల్లా మీదుగా, గుంటూరు వైపు నుంచి విశాఖపట్నం, హైదరాబాద్ వైపు వెళ్లే కార్లు, ఇతర చిన్న వాహనాలను కనక దుర్గమ్మ వారిధిపై అనుమతించమని వెల్లడించారు. వారు ప్రకాశం బ్యారేజీ మీదుగా నగరంలోకి రావాల్సి ఉంటుందని తెలిపారు.
ఏలూరు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను కారల్ మార్క్స్ రోడ్డు మీదుగా పండిట్ నెహ్రూ బస్టేషన్‌లోకి మళ్లిస్తామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఏలూరు వెళ్లే ఆర్టీసీ బస్సులను ఇదే మార్గంలో వెనక్కి పంపిస్తారు. అవనిగడ్డ కరకట్ట మీదుగా వచ్చే ఆర్టీసీ బస్సులను పెదపులిపాక వద్ద మళ్లించి, తాడిగడప మీదుగా రామవరప్పాడు, కారల్‌మార్క్స్‌రోడ్డులోకి అనుమతిస్తారు. అదేవిధంగా పీఎన్‌బీఎస్ నుంచి అవనిగడ్డ వెళ్లే వాహనాలను ఇదే మార్గంలో వెనక్కి పంపిస్తారు. ఈ ట్రాఫిక్ మళ్లింపులను గమనించి, పోలీసులకు సహకరించాలని సీపీ కాంతిరాణా కోరారు.
Also Read
Rajinikanth : సూపర్ స్టార్‌కు జోడీగా మరోసారి ఆ ప్రపంచ సుందరి.. ఏ సినిమాలో అంటే
Hyderabad Metro: సూపర్ సేవర్ కార్డు.. రూ.59తో రోజంతా ఎక్కడి నుంచి ఎక్కడికైనా తిరగొచ్చు