Telangana: పండుగ వేళ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమల్లోనే ఉంటుందా..?

సంక్రాంతి నేప‌థ్యంలో సొంతూళ్లకు వెళ్లే వారిని క్షేమంగా గ‌మ్య‌స్థానాల‌కు చేరవేసేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) పూర్తి స్థాయిలో స‌న్న‌ద్ద‌మైంది. ఈ పండుగ‌కు 6432 ప్రత్యేక బస్సులను నడపాలని యాజ‌మాన్యం ఇప్ప‌టికే నిర్ణ‌యించింది. ప్ర‌ధానంగా ఈ నెల 10, 11, 12 తేదిల్లో ప్ర‌యాణికుల ర‌ద్దీ ఎక్కువ‌గా ఉండే అవ‌కాశం ఉంది. ఆయా రోజుల్లో ర‌ద్దీ మేర‌కు ప్ర‌త్యేక బ‌స్సుల‌ను అందుబాటులో ఉంచేలా ప్లాన్ చేసింది. అలాగే, ఈ నెల 19, 20 తేదిల్లో తిరుగు ప్ర‌యాణ ర‌ద్దీకి సంబంధించి త‌గిన ఏర్పాట్లు చేసింది.

Telangana: పండుగ వేళ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమల్లోనే ఉంటుందా..?
Mahalakshmi Scheme
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 09, 2025 | 1:13 PM

సంక్రాంతి నేపథ్యంలో  హైదరాబాద్‌లో రద్దీ ప్రాంతాలైన ఎంజీబీఎస్‌, జేబీఎస్‌, ఉప్పల్‌ క్రాస్‌ రోడ్స్‌, ఆరాంఘర్‌, ఎల్బీనగర్‌ క్రాస్‌ రోడ్స్‌, కేపీహెచ్‌బీ, బోయిన్‌పల్లి, గచ్చిబౌలి, తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను టీజీఎస్ఆర్టీసీ నడుపుతోంది. ఆయా ప్రాంతాల్లో ప్రయాణికుల సౌక‌ర్యార్థం పండల్స్, షామియానాలు, కుర్చీలు, పబ్లిక్ అడ్రస్ సిస్టం, తాగునీటి సదుపాయం, మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేయ‌నుంది.

సంక్రాంతి పండుగ‌కు న‌డిపే ప్ర‌త్యేక బ‌స్సుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ జీవో ప్రకారం 1.50 వ‌ర‌కు టికెట్ ధ‌ర‌ల‌ను టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం స‌వ‌రించింది. తెలంగాణ‌తో పాటు ఇత‌ర రాష్ట్రాల‌కు తిరిగే స్పెషల్ బస్సులకు మాత్రమే సవరించిన చార్జీలు వర్తిస్తాయి. ఈ నెల 10, 11, 12 తేదిల‌తో పాటు తిరుగు ప్ర‌యాణ ర‌ద్దీ ఎక్కువ‌గా ఉండే 19, 20 తేదిల్లో మాత్ర‌మే స‌వ‌రించిన చార్జీలు అమ‌ల్లో ఉంటాయి. స్పెష‌ల్ బ‌స్సులు మిన‌హా రెగ్యూల‌ర్ బ‌స్సుల్లో సాధార‌ణ చార్జీలే అమ‌ల్లో ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వ మహాలక్ష్మి పథకంలో భాగంగా సంక్రాంతికి నడిపే పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరి, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం య‌థావిధిగా అమల్లో ఉంటుంది.

ప్ర‌ధాన పండుగలు, ప్ర‌త్యేక సంద‌ర్భాల్లో ప్రజలకు రవాణా పరంగా ఇబ్బందులు తలెత్తకుండా వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేసేందుకు స్పెష‌ల్ స‌ర్వీసుల‌ను ఆర్టీసీ యాజ‌మాన్యం నడుపుతోంది. తిరుగు ప్ర‌యాణంలో స్పెష‌ల్ బ‌స్సుల్లో ప్ర‌యాణికుల ర‌ద్దీ ఏమాత్రం లేన‌ప్ప‌టికీ.. ర‌ద్దీ ఉన్న రూట్ల‌లో ప్ర‌యాణికుల‌కు అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా ఉండేందుకు ఖాళీ బ‌స్సుల‌ను త్వ‌ర‌తగ‌తిన సంస్థ వెన‌క్కి తెప్పిస్తుంది. ప్ర‌యాణికుల ర‌ద్దీకి అనుగుణంగా వాటిని ఆయా రూట్ల‌లో న‌డిపిస్తుంది. ఆ స్పెష‌ల్ బ‌స్సుల‌కు అయ్యే కనీస డీజిల్ ఖర్చులు, నిర్వ‌హ‌ణ మేరకు టికెట్ ధ‌ర‌ను స‌వ‌రించుకోవాలని 2003లో జీవో నంబర్ 16 ను రాష్ట్ర ప్ర‌భుత్వం జారీ చేసింది. పండుగ‌లు, ప్ర‌త్యేక సంద‌ర్భాల్లో న‌డిచే స్పెష‌ల్ బ‌స్సుల్లో మాత్ర‌మే 1.50 వ‌ర‌కు టికెట్ ధ‌ర‌ల‌ను స‌వ‌రించుకునే వెసులుబాటును సంస్థకు ఇచ్చింది. రాష్ట్ర ప్ర‌భుత్వ జీవో ప్ర‌కారం ఈ సంక్రాంతికి కేవ‌లం 5 రోజులు పాటు టికెట్ ధ‌ర‌ల‌ను టీజీఎస్ఆర్టీసీ స‌వ‌రించింది.

టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ ను www.tgsrtcbus.in వెబ్ సైట్ లో చేసుకోవాలని యాజ‌మాన్యం తెలిపింది. సంక్రాంతి ప్రత్యేక బస్సులకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 సంప్రదించాలని సూచించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి. 

నటుడిగా 50 ఏళ్ల ప్రస్థానం.. సాయి కుమార్ గురించి ఆసక్తికర విషయాలు
నటుడిగా 50 ఏళ్ల ప్రస్థానం.. సాయి కుమార్ గురించి ఆసక్తికర విషయాలు
'కల్యాణ్ బాబాయికి ఓపిక ఎక్కువ.. దేన్నైనా భరిస్తారు': రామ్ చరణ్
'కల్యాణ్ బాబాయికి ఓపిక ఎక్కువ.. దేన్నైనా భరిస్తారు': రామ్ చరణ్
ఓర్నీ పాసుగులా.! కోపంతో విమానం డోర్ తెరవబోయాడు.. తీరా చూస్తే..
ఓర్నీ పాసుగులా.! కోపంతో విమానం డోర్ తెరవబోయాడు.. తీరా చూస్తే..
దొంగతనాలలో వాళ్ళ కో ఆర్డినేషన్ చూసి ఖాకీలే షాక్..!
దొంగతనాలలో వాళ్ళ కో ఆర్డినేషన్ చూసి ఖాకీలే షాక్..!
ఇలా వైకుంఠగా ముసాబైన తిరుమల.. తెల్లవారుజామునుంచే శ్రీవారి దర్శనం
ఇలా వైకుంఠగా ముసాబైన తిరుమల.. తెల్లవారుజామునుంచే శ్రీవారి దర్శనం
'పొద్దున్నే ముఖంపై ఉమ్మి అప్లై చేస్తా': టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
'పొద్దున్నే ముఖంపై ఉమ్మి అప్లై చేస్తా': టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
లగేజ్‌ స్కాన్ చేస్తుండగా కంగారుపడ్డ వ్యక్తి.. బ్యాగ్ ఓపెన్ చేయగా
లగేజ్‌ స్కాన్ చేస్తుండగా కంగారుపడ్డ వ్యక్తి.. బ్యాగ్ ఓపెన్ చేయగా
భక్తులకు భోజనం అందించేందుకు ఇస్కాన్ తో చేతులు కలిపిన అదానీ సంస్థ
భక్తులకు భోజనం అందించేందుకు ఇస్కాన్ తో చేతులు కలిపిన అదానీ సంస్థ
సల్మాన్ ఖాన్‌ను టీజ్ చేసిన హర్భజన్-యూవీ!
సల్మాన్ ఖాన్‌ను టీజ్ చేసిన హర్భజన్-యూవీ!
ఏపీ, తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఇవే.. ఎవరికి ఎన్ని రోజులంటే.?
ఏపీ, తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఇవే.. ఎవరికి ఎన్ని రోజులంటే.?