West Godavari : నాలుగు నెలలైనా చేతికి రాని దాళ్వా డబ్బు.. రోజుల తరబడి వర్షాలు, కొట్టుకుపోయిన నారుమళ్లు

పశ్చిమగోదావరి జిల్లాలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుంభవృష్టి వర్షాల ధాటికి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. పలుచోట్ల రాకపోకలు స్తంభించాయి.

West Godavari : నాలుగు నెలలైనా చేతికి రాని దాళ్వా డబ్బు.. రోజుల తరబడి వర్షాలు, కొట్టుకుపోయిన నారుమళ్లు
West Godavari Cultivation
Follow us
Venkata Narayana

|

Updated on: Jul 22, 2021 | 5:05 PM

West Godavari Paddy Cultivation : పశ్చిమగోదావరి జిల్లాలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుంభవృష్టి వర్షాల ధాటికి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. పలుచోట్ల రాకపోకలు స్తంభించాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కుండపోత వర్షాల కారణంగా జిల్లాలో వరి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరి నాట్లుకు సిద్ధంగా ఉన్న నారుమళ్లు భారీ వర్షాలు, వరద నీటికి కొట్టుకుపోయాయి.

నారుమళ్ళు నీట మునిగి.. పంట పొలాలు సైతం నదులను తలపిస్తున్నాయి.  అయితే, ఈ సంవత్సరం కాలువలు లేటుగా రావడంతో గత సంవత్సరానికన్నా 15 రోజులు వెనుకగా నారుమళ్లు పోశామని, ప్రస్తుతం నారుమళ్లు నీట మునగడంతో వరినాట్లు వేయడానికి తీవ్ర ఇబ్బంది పడుతున్నామని రైతులు అంటున్నారు. ఇప్పుడు మళ్లీ కొత్తగా వరి నారుమళ్లు వేసే అవకాశం లేదని చెబుతున్నారు.

ఇప్పటికే దుక్కులు, దమ్ములు, ఆకుతీతతో కలిపి సుమారు ఎకరాకు 10 వేల రూపాయల వరకు ఖర్చు అయ్యిందని వాపోతున్నారు.  నాలుగు నెలలు కావస్తున్నా దాళ్వా ధాన్యం డబ్బులు ఇంకా చేతికి అందలేదని, వడ్డీకి డబ్బులు తెచ్చి, పంట మీద పెట్టి, ఈ వర్షాల ధాటికి పంట నష్టం కలిగి అప్పుల పాలవుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read also: Poker Game : రాజకీయ అండదండలు.. పోలీసులతో సరిహద్దుల్లో కోతికొమ్మచ్చాడుతోన్న పేకాటరాయుళ్లు.!