Tomato Price: కిలో కోసం కిలోమీటర్ క్యూ.. 2 గంటలు వెయిటింగ్..! కర్రీ కోసం ఈ వర్రీ తప్పదు

రైతు బజార్లలో రాయితీ టమోటా వస్తుండడంతో.. జనం వాటి కోసం ఎగబడుతున్నారు. తెల్లవారుజాము నుంచి మిగతా కూరగాయల మాటేమో గానీ టమాటా కోసం క్యూ కడుతున్నారు. ఒక్కో కుటుంబంలో ఇద్దరిసి ముగ్గురు చొప్పున కూడా వచ్చి లైన్లో నిలుచుని ఎదురుచూస్తున్నారంటే.. టమాటాకి ఏ మేర డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

Tomato Price: కిలో కోసం కిలోమీటర్ క్యూ.. 2 గంటలు వెయిటింగ్..! కర్రీ కోసం ఈ వర్రీ తప్పదు
Tomato Price Hike
Follow us
Maqdood Husain Khaja

| Edited By: Ram Naramaneni

Updated on: Jul 27, 2023 | 10:43 AM

వంటింటి రుచుల్లో పెనవేసుకుపోయిన.. టమాటా ఇంకా ధర దిగి రావడం లేదు. డిమాండ్ భారీగా పెరగడం ఆపై సప్లై లేకపోవడంతో.. ధర భారీగా పెరిగి కొండెక్కి కూర్చుంది. రైతు బజార్లలోని సాధారణ కౌంటర్లలో కిలో 110 రూపాయలు ధర పలుకుతుంటే.. బహిరంగ మార్కెట్లలో దాని ధర 130 నుంచి 150 రూపాయలు. మరి ఏపీలో ప్రజల టమోటా కష్టాలను దృష్టిలో పెట్టుకొని రాయితీపై పంపిణీ చేస్తుంది ప్రభుత్వం. కిలో 50 రూపాయలకే పంపిణీ చేస్తున్నడంతో.. పరిమితంగా ఉన్న టమోటాలను కొనుగోలు చేసేందుకు క్యూ కడుతూనే ఉన్నారు జనం.

రెండు గంటల క్యూలో నిలుచుంటే కిలో టమాట..!

రైతు బజార్లలో రాయితీ టమోటా వస్తుండడంతో.. జనం వాటి కోసం ఎగబడుతున్నారు. తెల్లవారుజాము నుంచి మిగతా కూరగాయల మాటేమో గానీ టమాటా కోసం క్యూ కడుతున్నారు. ఒక్కో కుటుంబంలో ఇద్దరిసి ముగ్గురు చొప్పున కూడా వచ్చి లైన్లో నిలుచుని ఎదురుచూస్తున్నారంటే.. టమాటాకి ఏ మేర డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. బహిరంగ మార్కెట్లో టమాటా ధర భారీగా పెరగడం.. రాయితీపై టమాటా కిలో 50 రూపాయలకే ఇస్తున్న నేపథ్యంలో.. ఆయా కౌంటర్ల వద్ద జనం బారులు తీరుతున్నారు. ఆధార్ కార్డు తీసుకొస్తే ఒక్కొక్కరికి ఒక్కో కిలో మాత్రమే టమాటా రాయితీపై ఇస్తున్నారు. దీంతో రైతు బజార్లలో టమాటా కోసం క్యూ లైన్ తప్పడం లేదు. నరసింహ నగర్ రైతు బజార్ లో.. రెండు కౌంటర్లలోనూ దాదాపు కిలోమీటర్ వరకు క్యూ లైన్ కనిపిస్తుంది. రైతు బజార్ లోపల కౌంటర్ నుంచి.. ఆ లైన్ కాస్త రోడ్డు పైకి వచ్చేసింది. ఒక్కో లైన్ లో మూడు నుంచి 500 మంది వరకు.. జనం నిల్చుని కాపు కాస్తున్నారు. దీంతో కిలో టమాట పొందాలంటే రెండు గంటల వరకు సమయం పడుతుందని అంటున్నారు వినియోగదారులు.

ఇవి కూడా చదవండి

రాయితీ టమాటా కు ఫుల్ డిమాండ్…!

విశాఖ నగరంలో 13 రైతు బజార్లున్నాయి. రైతులు హోల్ సేల్ బజార్ నుంచి ఆయా రైతు బజార్లకు కూరగాయలు నిత్యం తరలించి అమ్ముతూ ఉంటారు. బయట మార్కెట్లో టమాటా పై భారీ ధర ఉండడం.. డిమాండ్ కూడా ఎక్కువ ఉన్న నేపథ్యంలోని ప్రభుత్వం 50 రూపాయలకే రాయితీపై కిలో టమాటా అందుబాటులో పెట్టింది. కిలో 50చొప్పున విక్రయించే ఏర్పాట్లు జరిగాయి. అయితే టమాటో సప్లై సరిగా లేక రోజూ ఈ రాయితీ టమాటో సప్లై చేయలేని పరిస్థితి. దీంతో డిమాండ్ భారీగా పెరిగిపోతుంది సప్లై తగ్గుతుంది. విశాఖ నగరంలోని రైతు బజార్లకు.. ఒక్కో ట్రిప్పులో సరుకు లభ్యతను బట్టి దాదాపు 7 నుంచి 800 వరకు బాక్సులు రాయితీ పై టమాటా పంపిస్తున్నారు. సీతమ్మధార, ఎంవిపి కాలనీ లాంటి పెద్ద రైతు బజార్లకు డిమాండ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. ఒక్కో రైతు బజారుకు 100 బాక్సుల చొప్పున టమాటో పంపుతున్నారు. మిగతా రైతు బజార్లకు సరుకులభ్యతను బట్టి 40 నుంచి 60 బాక్సుల చొప్పున అందుబాటులో పెడుతున్నారు. కిలో 50 కే వేస్తుండడంతో రాయితీ టమోటా కు అంతలా డిమాండ్ పెరిగిపోయింది.

కుటుంబమంతా క్యూ లైన్ లోనే..!

రాయితీపై టమాటా కిలో 50 కే లభిస్తునడంతో.. ఒక్కొక్కరు ఒక్కో ఐడియా సృష్టించుకుంటున్నారు. కొందరు తమ బంధుమిత్రులను కూడా తోడు తీసుకెళ్లి క్యూలో నిలిచబడుతుంటే.. మరికొందరు ఏకంగా ఫ్యామిలీ అంతా టమోటా కోసం క్యూ కట్టేస్తున్నారు. అదేమంటే.. టమాటా రుచి కావాలంటే ఈ మాత్రం కష్టం తప్పదని అంటున్నారు. మరి కొంతమంది అయితే.. సినిమా టికెట్ల కోసం రేషన్ సరుకుల కోసం .. క్యూలైన్లులో ఎదురు చూసినట్లు టమోటో రుచి కోసం ఆ మాత్రం చేయలేమా అంటున్నారు కూడా..

విశాఖలో రాయితీ టమాటా కోసం వినియోగదారుల వర్రీ. గంటల తరబడి క్యూలైన్ కాసి మరి కిలో టమోటా తో ఇంటికి వెళ్తున్నారు. అయితే.. టమాటా బ్లాక్ మార్కెట్కు తరలిపోకుండా ఉంటే కాస్త సాధారణ పరిస్థితిలో రావచ్చేమోనని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఎందుకంటే.. సాధారణ మార్కెట్లలో ధర ఎక్కువ చెల్లిస్తే ఈజీగా లభించే టమాటా.. మరి రాయితీపై ఎందుకు అంత రాదనేది కొందరి మాట..! ఏదేమైనా మళ్లీ సాధరణ పరిస్థితుల్లో రావాలంటే మరి కొంతకాలం వేచి చూడాల్సిందేనట..!

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!