Andhra Pradesh: చెరువుని తలపించిన ఆర్టీసీ కాంప్లెక్స్.. వరద నీటిలో తేలియాడిన సామగ్రి.. సిబ్బంది, ప్రయాణీకులకు ఇబ్బందులు
భారీ వర్షం కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్ లోని విశాఖపట్నం నాన్ స్టాప్ బస్ సర్వీస్ టికెట్ కౌంటర్లలోకి భారీగా వరద నీరు చేరింది. వరద నీటిలోనే ప్రయాణికులు టికెట్ కౌంటర్ వద్ద క్యూలైన్లో నిలబడి టికెట్లు తీసుకోగా.. కౌంటర్ల లోపల ఉన్న ఆర్టీసీ సిబ్బంది సైతం వరద నీటిలోనే విధులు నిర్వర్తించారు. కాంప్లెక్స్ లోని దుకాణాలను సైతం వరద నీరు ముంచెత్తింది.
బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా బుధవారం కురిసిన భారీ వర్షం శ్రీకాకుళంను అతలాకుతలం చేసింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. శ్రీకాకుళం నడిబొడ్డున ఉన్న ఆర్టీసీ కాంప్లెక్స్ జగదిగ్బంధంలో ఇరుక్కుపోయి చెరువుని తలపించింది. కాంప్లెక్స్ లోకి వెళ్లే ఎంట్రీ, ఎగ్జిట్ గేట్ల మొదలు లోపల ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంగణమంతా మోకాలు లోతులో వరదనీరు నిలిచిపోయింది. కాంప్లెక్స్ లోని ప్లాట్ఫార్మ్స్, దుకాణాలు, పాసింజర్ల వెయిటింగ్ ప్రాంగణం, టూ వీలర్స్ పార్కింగ్ ప్లేస్, కొరియర్ అండ్ లాజిస్టిక్స్ సెంటర్, మొత్తం నీటి మునిగి దయనీయ పరిస్థితిని తలపించింది. ప్లాట్ ఫామ్ పై ఆగి ఉన్న బస్సు ఎక్కడానికి ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, మహిళలు లగేజీలతో బస్సు ఎక్కే సమయంలో దిగే సమయంలో చాలా ఇబ్బందులు పడ్డారు. ప్రధాన రహదారి నుండి కాంప్లెక్స్ లోకి ఎంటర్ అవుతూనే మోకాళ్లలోతు నీరు ఉండటంతో శ్రీకాకుళంలో దిగాల్సిన పాసింజర్లను రోడ్డుపైనే దించి బస్సు లోపలికి వెళ్లే పరిస్థితి నెలకొంది.
మోకాలి లోతు నీటిలోనే టికెట్ కౌంటర్ సిబ్బంది విధులు
భారీ వర్షం కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్ లోని విశాఖపట్నం నాన్ స్టాప్ బస్ సర్వీస్ టికెట్ కౌంటర్లలోకి భారీగా వరద నీరు చేరింది. వరద నీటిలోనే ప్రయాణికులు టికెట్ కౌంటర్ వద్ద క్యూలైన్లో నిలబడి టికెట్లు తీసుకోగా.. కౌంటర్ల లోపల ఉన్న ఆర్టీసీ సిబ్బంది సైతం వరద నీటిలోనే విధులు నిర్వర్తించారు. కాంప్లెక్స్ లోని దుకాణాలను సైతం వరద నీరు ముంచెత్తింది. దుకాణాలలోనీ ఫుడ్ ఐటమ్స్ కొన్ని తడిచిపోగా.. కాంప్లెక్స్ లోని డస్ట్ బిన్లు ,వాటర్ టిన్లు వరద నీటిలోనే తెలియాడాయి. ప్రధాన రహదారి కంటే ఆర్టీసీ కాంప్లెక్స్ డౌన్ లో ఉండటంతో.. చిన్నపాటి వర్షానికి కూడా డ్రైనేజ్ వాటర్ తో పాటు రోడ్డుపై వాటర్ అంతా ఆర్టీసీ కాంప్లెక్స్ లోకే చేరుతుండటంతో వర్షాలు పడిన ప్రతిసారి ఈ సమస్య ఉత్పనమవుతుందనీ ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ కాంప్లెక్స్ దయనీయ పరిస్థితి పై పాలకులు దృష్టి పెట్టాలని ప్రయాణికులు, శ్రీకాకుళం వాసులు కోరుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..