Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: జ్వరాలకు చెక్‌ పెట్టేందుకు చేపలను రంగంలోకి దింపిన ఏపీ ప్రభుత్వం..

వర్షాకాలం వచ్చిందంటే చాలు సీజనల్ వ్యాధులతో జనం అల్లడిపోతుంటారు.. జ్వరాలు,ఇతర రోగాలతో ఆసుపత్రులకు క్యూ కడుతుంటారు.టైఫాయిడ్, మలేరియాతో పాటు ప్రమాదకరమైన డెంగ్యూ జ్వరం ఈ మధ్య కాలంలో ఎక్కువగా వ్యాపిస్తుంది. వ్యాధి ముదిరిన తర్వాత మాత్రమే చాలా మంది దీన్ని డెంగ్యూగా నిర్దారించుకుంటున్నారు. దీంతో సీజనల్ వ్యాధుల బారి నుంచి...

Andhra Pradesh: జ్వరాలకు చెక్‌ పెట్టేందుకు చేపలను రంగంలోకి దింపిన ఏపీ ప్రభుత్వం..
Representative Image
Follow us
S Haseena

| Edited By: Ram Naramaneni

Updated on: Jul 27, 2023 | 10:14 AM

వర్షాకాలం వచ్చిందంటే చాలు సీజనల్ వ్యాధులతో జనం అల్లడిపోతుంటారు.. జ్వరాలు,ఇతర రోగాలతో ఆసుపత్రులకు క్యూ కడుతుంటారు.టైఫాయిడ్, మలేరియాతో పాటు ప్రమాదకరమైన డెంగ్యూ జ్వరం ఈ మధ్య కాలంలో ఎక్కువగా వ్యాపిస్తుంది. వ్యాధి ముదిరిన తర్వాత మాత్రమే చాలా మంది దీన్ని డెంగ్యూగా నిర్దారించుకుంటున్నారు. దీంతో సీజనల్ వ్యాధుల బారి నుంచి ప్రజలను కాపాడేందుకు వైద్యారోగ్య శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. వర్షాకాలంలో ఇతర శాఖలతో కలిసి జ్వరాలు నియంత్రణ, ముందస్తు చర్యలు చేపడుతోంది. దీంట్లో భాగంగా సుమారు కోటి చేపలను చెరువులు, నీటి కుంటలు, కొలనుల్లోకి విడుదల చేసింది.

మలేరియా, డెంగ్యూను వ్యాపించే దోమల కోసం గంబూసియా చేపలు..

ఎక్కువగా జ్వరాలన్నీ దోమలతోనే వ్యాపిస్తుంటాయి.మలేరియా,డెంగ్యూ జ్వరాలకు దోమలు ప్రధాన కారణం.అందుకే దోమల నివారణ చేపడితే జ్వరాలు కూడా ఆరికట్టవచ్చని ప్రభుత్వం ఆలోచన.ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకూ రాష్ట్రంలో 2వేలకు పైగా డెంగీ కేసులు,1600 వరకూ మలేరియా కేసులు అధికారికంగా నిర్దారణ అయ్యాయి.అందుకే దోమలను నివారించడం కోసం గంబూసియా చేపలను చెరువులు,నీటి కుంటలు,కొలనుల్లో కి వదిలిపెట్టింది ఏపీ ప్రభుత్వం. మత్స్య శాఖ తో కలిసి వైద్యారోగ్య శాఖ పెద్ద మొత్తంలో చేపలను విడుదల చేసింది.గంబూసియా చేపలను మస్కిటో ఫిష్ అని కూడా అంటారు.

Fish

ఇవి కూడా చదవండి

ఈ చేపలు ఎందుకు?జ్వరానికి ఈ చేపలకు సంబంధం ఏంటి?

గంబూసియా చేపలు దక్షిణ అమెరికా ప్రాంతం నుంచి వచ్చిన జాతికి చెందినవి.ఈ చేపలు దోమ లార్వాలను ఆహారంగా తీసుకుంటాయి.ఆడ చేప 7 సెం.మీ,మగ చేప 4 సెం.మీ ఉంటుంది.పిల్ల చేపలు 8 నుంచి 9 మిమీ వరకూ ఉంటాయి.ఈ చేపలు నీటిలో వేగంగా కదులుతూ నీటిపై ఉండే జ్వరాలకు కారణమైన దోమల లార్వాలను హరించి వేస్తాయి.దీని ద్వారా దోమల నియంత్రణ జరుగుతుంది.ఈ దోమల జన్మస్థలమైన దక్షిణ అమెరికా లో కొన్నేళ్ల క్రితమే ఇది నిరూపించబడినట్లు అధికారులు చెప్తున్నారు.పూర్తి స్థాయిలో జ్వరాలను అరికట్టలేకపోయినా…దోమల నియంత్రణ తో కొంత మేర జ్వరాలు తగ్గించాలని ప్రభుత్వం ఆలోచన.అందుకే రాష్ట్రవ్యాప్తంగా సుమారు కోటి వరకూ గంబూసియా చేపలను ఆయా ప్రాంతాల్లో వదిలిపెట్టినట్లు అధికారులు చెప్పారు.అయితే నాలుగేళ్లుగా రాష్ట్రంలో అక్కడక్కడా ఈ చేపలను వదులుతుండగా…ఈసారి రాష్ట్రం మొత్తం గంబూసియా చేపలను చెరువులు,కొలనుల్లో వదిలిపెట్టినట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..