వీధి బడి నుంచి ప్రపంచ ప్రఖ్యాత వైద్యుడిగా ఖ్యాతి.. అయినా మాతృుభూమిపై ప్రేమతో సొంత ఊరిలో..

Kadapa District: సాధారణ వీధి బడిలో చదివిన ఓ వ్యక్తి ప్రపంచ ప్రఖ్యాత వైద్యుడు అయ్యారు. యూకేలో పేరు మోసిన బారిస్టిక్ లాప్రోస్కోపిక్ సర్జన్‌గా ఖ్యాతి గడించారు. ప్రపంచంలోనే అనేకమంది శస్త్ర చికిత్స నిపుణులను తయారు చేశారు. కృషి పట్టుదల ఉంటే..

వీధి బడి నుంచి ప్రపంచ ప్రఖ్యాత వైద్యుడిగా ఖ్యాతి.. అయినా మాతృుభూమిపై ప్రేమతో సొంత ఊరిలో..
Dr.keshava Reddy
Follow us
Sudhir Chappidi

| Edited By: శివలీల గోపి తుల్వా

Updated on: Jul 27, 2023 | 10:57 AM

కడప జిల్లా, జూలై 27: సాధారణ వీధి బడిలో చదివిన ఓ వ్యక్తి ప్రపంచ ప్రఖ్యాత వైద్యుడు అయ్యారు. యూకేలో పేరు మోసిన బారిస్టిక్ లాప్రోస్కోపిక్ సర్జన్‌గా ఖ్యాతి గడించారు. ప్రపంచంలోనే అనేకమంది శస్త్ర చికిత్స నిపుణులను తయారు చేశారు. కృషి పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమి లేదంటూ తన పట్టుదలే తనను ఇంతటి వ్యక్తిని చేసిందని చెబుతున్నారు. ఆయనే డాక్టర్ మన్నూరు కేశవరెడ్డి. ఉన్న ఊరి కోసం స్థానిక ప్రజల కోసం విదేశీయులతో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నారు

అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం కారంపల్లి నివాసి కారంపల్లి సుబ్బారెడ్డి కుమారుడు డాక్టర్ మన్నూరు కేశవరెడ్డి. స్థానిక కారంపల్లి ప్రభుత్వ వీధి బడిలో విద్యనభ్యసించి ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన వైద్యునిగా పేరు గడిచి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు కేశవరెడ్డి. యూకే దేశంలో మెడిసిన్‌లో ఉన్నత విద్యాభ్యాసం చేసిన కేశవరెడ్డి అక్కడే బారిస్టిక్ లాప్రోస్కోపిక్ సర్జన్‌గా పనిచేస్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శస్త్ర చికిత్స నిపుణుల్లో ఈయన ఒకరు. యూకేలోని హోమర్టన్ యూనివర్సిటీలో బారియేట్రిక్ లాప్రోస్కోపిక్ యూనిట్‌ను స్థాపించారు. 2017 సంవత్సరం వరకు ఆ యూనిట్‌కి ఈయనే డైరెక్టర్‌గా ఉన్నారు. ఇంత ఉన్నత స్థానానికి వెళ్ళినా కన్న ఊరి మీద మమకారం పోలేదు. రాజంపేట మండలం పెద్ద కారంపల్లిలో ఆయన విదేశీ వైద్యులతో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. స్థానిక ప్రజల కోసం వారి ఆరోగ్యం కోసం ఆయన విశేష కృషి చేస్తుంటారు.

భారతదేశంలో వైద్య విధానంలో మార్పులు అవసరం

భారత దేశంలో వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు అవసరమని ఆయన అన్నారు. రోగికి వైద్యులు భరోసా కల్పించాలని. అనవసరమైన టెస్టులు, శస్త్ర చికిత్సలు చేసి రోగులపై పెనుబారం మోపడం వల్ల వైద్యుల పై నమ్మకం సన్నగిల్లుతుంది అని ఆయన అన్నారు . మన దేశంలో చిన్న వైద్యం అయినా భారీస్దాయిలో టెస్టులు చేసి భయపెడుతున్నారని అలా కాకుండా మనోధైర్యాన్ని పెంచి శస్త్రచికిత్సలు చేయాలని ఆయన అన్నారు. ఉన్న ఊరి కోసం మా దగ్గర ఉన్న స్థలాన్ని కేటాయించి పాఠశాల ఏర్పాటు చేయడం జరిగిందని సొంత నిధులతో పాఠశాలను నిర్మించామని.. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని డాక్టర్ కేశవరెడ్డి తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..