AP News: పాక్‌ నుంచి భారత్‌లోకి అక్రమ ప్రవేశం, ఆపై వివాహం…! ఆపై జైలుకు..

ఇండియాలోకి అక్రమంగా ప్రవేశించిన పాక్ పౌరుడు ఏపీకి చెందిన మహిళను పెళ్లి చేసుకుని, తొమ్మిదేళ్లు కాపురం చేశాడు. సౌదీ మీదుగా పాకిస్తాన్ రిటన్ వెళ్లే ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఇమ్మిగ్రేషన్ అధికారులకు దొరికిపోయి జైలు పాలయ్యాడు. నాలుగేళ్లుగా జైల్లో ఉండటంతో అతని కుటుంబం ఇప్పుడు ఇబ్బందులు పడుతుంది. భర్తను విడుదల చేయాలని ఐదుగురు బిడ్డల తల్లి కోర్టుల చుట్టూ తిరుగుతోంది.

AP News: పాక్‌ నుంచి  భారత్‌లోకి అక్రమ ప్రవేశం, ఆపై వివాహం…! ఆపై జైలుకు..
Meet the Andhra woman who is fighting for Pakistani husband's release from jail
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 27, 2023 | 12:22 PM

పబ్‌జీలో పరిచయమైన యూపీ యువకుడు సచిన్ మీనా కోసం తన నలుగురు పిల్లలతో ఇండియాకు వచ్చేసిన పాకిస్థాన్ మహిళ సీమా హైదర్ ఇప్పుడు దేశంలో ట్రెండింగ్ టాపిక్. తాజాగా ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తి కోసం పాకిస్థాన్ వెళ్లిన రాజస్థాన్ మహిళ అంజు (34).. అక్కడ ఇస్లాంను స్వీకరించిన అనంతరం ప్రియుడు నస్రుల్లాను పెళ్లాడింది. ఈ రెండు ఘటనలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అయితే మీరు ఏపీలో జరిగిన ఇలాంటి ఓ ఘటన గురించి కూడా తెలుసుకోవాలి.

విధి ఎంత వైచిత్రమైనదో చూడండి. ఆంధ్రాలోని నంద్యాలకు చెందిన ఓ మహిళతో పాకిస్థాన్ దేశానికి చెందిన వ్యక్తితో పద్నాలుగేళ్ల క్రితం 2010 లో రాంగ్ కాల్ ద్వారా పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి వారి మధ్య స్నేహం మొదలైంది. ఆ స్నేహం ప్రేమగా మారింది. దీంతో ఆమెను పెళ్లి చేసుకునేందుకు అతడు ముంబై మీదుగా ఇండియాకు వచ్చాడు. అప్పటికే పెళ్లై భర్తను కోల్పోయిన, ఒక బిడ్డ ఉన్న ఆ మహిళను నిఖా చేసుకున్నాడు. కాలం ముందుకు వెళ్తుండగా.. వారికి నలుగురు పిల్లలు జన్మించారు. ఈ క్రమంలోనే తిరిగి తన సొంత దేశానికి వెళ్లే క్రమంలో అనూహ్య రీతిలో ఇమ్మిగ్రేషన్ అధికారులకుచిక్కి.. జైలుకు వెళ్లాడు

నంద్యాల జిల్లాకు చెందిన నివాసం ఉండే దౌలత్‌ బీకు  2010లో వచ్చిన ఫోన్‌ కాల్‌ ద్వారా పాక్ దేశస్థుడు గుల్జార్‌ఖాన్‌తో పరిచయం ఏర్పడింది.  పాకిస్తాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌కు చెందిన గుల్జార్‌ అప్పట్లో సౌదీ అరేబియాలో పెయింటర్‌. ఫోన్‌ పరిచయంతో ఇద్దరూ రెగ్యులర్‌గా మాట్లాడుకుంటూ ఉండేవారు. ఆపై దౌలత్‌బీతో ప్రమేలో పడ్డ గుల్జార్‌ఖాన్‌.. ఆమె కోసం సౌదీ నుంచి ముంబై మీదుగా ఇండియాలోకి ఇల్లీగల్‌గా ఎంటరయ్యారు.

ముంబై నుంచి నేరుగా గడివేములకు వచ్చి 2011 జనవరి నెలలో 25న దౌలత్‌బీని మనువాడాడు. 9 సంవత్సరాల పాటు అక్కడే కాపురం ఉన్నారు. ఈ దంపతులకు ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి పుట్టారు. తొమ్మిదేళ్ల పాటు అంతా బాగానే సాగింది. గుల్జార్‌ గడివేములలోనే.. ఆధార్ సైతం సంపాదించాడు. దాని ఆధారంగా తనతో పాటు భార్యాపిల్లలను సౌదీ అరేబియాకు తీసుకెళ్లేందుకు వీసాలు కూడా తీసుకున్నాడు. అక్కడి నుంచి పాకిస్థాన్‌ పోవాలన్నది అతడి ప్లాన్.

అనుకున్నట్లుగానే గుల్జార్ 2019లో కుటుంబ సభ్యులతో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారలు  వెరిఫికేషన్‌లో గుల్జార్‌ఖాన్‌ అక్రమంగా ఇండియాలోకి వచ్చినట్లు గుర్తించారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని చరసాలకు తరలించారు. విమానశ్రయంలో భర్తకు దూరమైన దౌలత్‌ బీ.. దిక్కుతోచని పరిస్థితుల్లో పిల్లలతో తీస్కుని గడివేములకు తిరిగి వచ్చేసింది. ప్రస్తుతం ఒంటరి అవ్వడంతో పిల్లల పోషణకు ఆమె ఎంతో ఇబ్బంది పడుతుంది.  ఐదుగురు సంతానంతో పాటు..  బుద్ధిమాంద్యంతో బాధపడుతున్న సోదరి భారం సైతం ఆమె పైనే పడింది. ప్రజంట్ ఇళ్లల్లో పనులు చేస్తూ ఆమె కుటుంబాన్ని నెట్టుకొస్తుంది.

పెద్ద తనయుడు మహమ్మద్‌ ఇలియాస్‌ కూలీ పనులకు వెళ్తున్నాడు.  మిగిలిన వారంతా 10 సంవత్సరాలలోపు చిన్నారులే. గుల్జార్‌ఖాన్‌ అరెస్టయిన 6 నెలల తర్వాత కరోనా వలన జైలు నుంచి రిలీజయ్యాడు. ఏడాది పాటు భార్య పిల్లలతో కలిసి జీవించాడు. 2022లో పోలీసులు అతడిని మళ్లీ హైదరాబాద్‌లోని జైలుకు తరలించారు. అప్పటినుంచి తన భర్తను విడుదల చేయాలని అధికారులు, న్యాయస్థానాల చుట్టూ దౌలత్ బీ తిరుగుతోంది.

మరిన్ని ట్రెండింగ్  వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి..

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
బాలకృష్ణ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన ఎన్టీఆర్.
బాలకృష్ణ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన ఎన్టీఆర్.
లావా నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌.. రూ.10వేల కంటే తక్కువ ధరల్లో..
లావా నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌.. రూ.10వేల కంటే తక్కువ ధరల్లో..
పుష్ప 2 టికెట్స్ ఇచ్చి ఆ స్టార్ హీరో సినిమా వేశారు.. ఎక్కడంటే?
పుష్ప 2 టికెట్స్ ఇచ్చి ఆ స్టార్ హీరో సినిమా వేశారు.. ఎక్కడంటే?
విద్యాశాఖ కీలక నిర్ణయం.. స్కూల్లో టీచర్ల ఫోటోలు..
విద్యాశాఖ కీలక నిర్ణయం.. స్కూల్లో టీచర్ల ఫోటోలు..
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!