Jagananna Videshi Vidya Deevena: విద్యార్థులకు వైసీపీ సర్కార్ గుడ్ న్యూస్.. రేపే విదేశీ విద్యా దీవెన పథకం కింద ఆర్థిక సాయం
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విద్యార్థులకు మళ్లీ గుడ్ న్యూస్ చెప్పారు. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. అర్హులైన విద్యార్థులు విదేశాలలో ఉన్నత విద్య అభ్యసించేందుకు వైసీపీ సర్కార్ ఆర్థిక సహయం అందజేస్తోంది.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విద్యార్థులకు మళ్లీ గుడ్ న్యూస్ చెప్పారు. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. అర్హులైన విద్యార్థులు విదేశాలలో ఉన్నత విద్య అభ్యసించేందుకు వైసీపీ సర్కార్ ఆర్థిక సహయం అందజేస్తోంది. అయితే జులై 27న సీఎం జగన్ ఈ విదేశీ విద్యా దీవెన పథకం కింద విద్యార్థులకు ఆర్థిక సాయం అందించనున్నారు. అర్హులైన 357 మంది స్టూడెంట్స్‌కు విదేశీ విద్యతు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుంది. గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి నేరుగా బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో రూ.45.53 కోట్లు జమ చేయనున్నారు.
ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు రూ.1.25 కోట్ల వరకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అందించనున్నారు. అలాగే ఇతర విద్యార్థులకు కోటి రూపాయల వరకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అందించనున్నారు. ఈ పథకం కింద ప్రపంచంలో ఉన్న టాప్ 200 యూనివర్శిటీలలో సీట్ పొంది.. పీజీ, పీహెచ్‌డీ లేదా ఎంబీబీఎస్ చేయాలనుకునే విద్యార్థులకు వైసీపీ ప్రభుత్వం ఫీజు రియింబర్స్‌మెంట్ అందిస్తుంది. ఏడాదికి రూ.8 లక్షల ఆదాయం లోపు ఉన్నవారందరికీ ఈ పథకం వర్తిస్తుంది.