Chandhrababu: ప్రెజెంటేషన్ స్టైల్ మార్చిన టీడీపీ అధినేత చంద్రబాబు.. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో..
Mangalagiri News: ఏపీ రాజకీయాల్లో ఇది ట్రెండ్ మారింది. ప్రతిపక్షాలు చేసే విమర్శలకు ఏపీ అసెంబ్లీ వేదికగా ప్రజంటేషన్లతో అటు ఎమ్మెల్యేలను, ప్రజలను ఆకట్టుకున్న జగన్ స్ట్రాటజీని ఇప్పుడు చంద్రబాబుకూడా మొదలుపెట్టారు. బుధవారం ఆయన మంగళగిరి టీడీపీ కార్యాలయంలో రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇస్తూ..
మంగళగిరి, జూలై 26: పొలిటికల్ పార్టీకి చీఫ్ అన్న తర్వాత వ్యూహాల్లోనే కాదు, ప్రజంటేషన్లోకూడా దిట్ట అనిపించుకోవాలి. ఏపీ రాజకీయాల్లో ఇది ట్రెండ్ మారింది. ప్రతిపక్షాలు చేసే విమర్శలకు ఏపీ అసెంబ్లీ వేదికగా ప్రజంటేషన్లతో అటు ఎమ్మెల్యేలను, ప్రజలను ఆకట్టుకున్న జగన్ స్ట్రాటజీని ఇప్పుడు చంద్రబాబుకూడా మొదలుపెట్టారు. బుధవారం ఆయన మంగళగిరి టీడీపీ కార్యాలయంలో రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇస్తూ అధికార పార్టీపై విమర్శులు ఎక్కుపెట్టారు. విషయాన్ని మనకు అర్ధం అయ్యేలాకాదు, అందరికీ అందులోనూ సామాన్యులకూ అర్థమయ్యేలా చెప్పగలగాలి. అప్పుడే మనం చెప్పే విషయాల్లో క్లారిటీ ఉంటుంది, ప్రజలకూ స్పష్టత వస్తుంది. తద్వారా పార్టీకి మైలేజీ వస్తుందని గట్టిగా నమ్మిన వ్యక్తి జగన్.
బహిరంగ సభల్లో కాని, అసెంబ్లీలోకాని, మీడియా కాన్ఫరెన్స్‌లో కాని ఒక విషయాన్ని ఆయన చెప్పేటప్పుడు దానిపై మంచి కసరత్తు చేస్తారు. అటువైపు నుంచి వచ్చే ప్రశ్నలు ఏంటి? ప్రజల మెదళ్లలో ఉన్న సందేహాలు ఏంటి? వాటికి జవాబులుగా మన దగ్గరున్న మెటీరియల్ ఏంటి? అన్నదానిపై పూర్తిస్థాయిలో ఆయన వివరాలు తెప్పించుకుని రెడీ అవుతారు. వీటిని బలపరిచేలా స్టాటస్టిక్స్, జీవోలు, ఆర్డర్లు, వీడియోలు, ఫొటోలు.. ఇలా అన్ని ఎలిమెంట్స్‌ను జోడించుకుంటూ వెళ్తారు. ప్రభుత్వ రంగ ఉద్యోగులు, రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి, మద్యం విధానం, ఇసుక పాలసీ, ముఖ్యంగా పోలవరం లాంటి సబ్జెక్టుల వచ్చినప్పుడు ప్రజంట్ చేయడంలో తనను కొట్టేవాడు లేరన్నట్టుగా జగన్ అసెంబ్లీలో మాట్లాడారంటూ ఆయన పార్టీ ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు దీనికి దీటుగా టీడీపీకూడా రెడీ అయినట్టుగానే కనిపిస్తోంది.
ఇటీవల చంద్రబాబుకూడా ఈ స్ట్రాటజీలో ముందుకు సాగుతున్నారు. ఇవాళ జరిగిన ఇరిగేషన్‌పై ప్రెస్‌మీట్‌లో రాయలసీమ ప్రాజెక్టుల గురించి ఆయన ప్రజంటేషన్ ఇచ్చారు. తన హయాంలో, ఈ ప్రభుత్వం హయాంలో ఖర్చులను వివరించే ప్రయత్నంచేశారు. ఇందులో వివరాలపై నిర్ధారణ ఏంటన్న విషయాన్ని పక్కనపెడితే, తాను చెప్పదలచుకున్న విషయాన్ని ప్రజలకు స్పష్టంగా చేరవేయడానికి టీడీపీ చీఫ్ గట్టిప్రయత్నంచేశారని చెప్పొచ్చు.
జగన్‌కు దీటుగా తమన నాయకుడు కూడా ప్రజంటేషన్లు ఇవ్వగలరన్న కామెంట్లు టీడీపీ సర్కిల్లో వినిపించాయి. మరోవైపు టీడీపీ చేస్తున్న ఆరోపణలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టడంలో ఇటు వైసీపీకూడా ఇటీవల కాలంలో దూకుడుగానే ఉంది. ప్రభుత్వం అయితే ఏకంగా ఫ్యాక్ట్‌చెక్‌పేరిట ప్రతిరోజూ వివరాలు వెల్లడిస్తోంది. మరి రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో ఇవాళ చంద్రబాబు చేసిన ఆరోపణలపై కచ్చితంగా వైసీపీ నుంచి కాని, ప్రభుత్వం నుంచి కాని వివరాలు బటయపెట్టే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం