Tomato Prices: భారీగా పెరిగిన టామోట ధరలు.. లాబోదిబోమంటున్న ప్రజలు
Tomato Prices: టామోటా.. ఇది లేనిది ఇళ్లంటూ ఉండదు. చాలా కూరల్లో టామోటా లేనిది నడవదు. ప్రజలు ఎక్కువగా వినియోగించే టామోటా ధరలకు రెక్కలొచ్చాయి. వినియోగదారులకు..
Tomato Prices: టామోటా.. ఇది లేనిది ఇళ్లంటూ ఉండదు. చాలా కూరల్లో టామోటా లేనిది నడవదు. ప్రజలు ఎక్కువగా వినియోగించే టామోటా ధరలకు రెక్కలొచ్చాయి. వినియోగదారులకు ధరలు చుక్కులు చూపిస్తున్నాయి. విజయనగరం (Vijayanagaram) జిల్లా లావేరు మార్కెట్ పరిధిలో 10 రోజుల కిందట కిలో టామోటా ధర రూ.20 ఉండగా, ప్రస్తుతం ఈ రేటు రూ.60కి పెరిగింది. దీంతో టామోటాలను కొనాలంటేనే ప్రజలు జంకుతున్నారు. ముందే వంట నూనె ధరలతో పాటు నిత్యవసర సరుకుల ధరలు ఆకాశాన్నంటడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న సామాన్యులకు.. తాజాగా టామోటా ధర పెరగడంతో మరింత భారం కానుంది. తమ నుంచి వ్యాపారులు కిలో రూ.10కి కొని.. ఇప్పుడు తమ వద్ద పంటలేని సమయంలో వ్యాపారులు సిండికేట్‌గా మారిపోయి రూ.60కి అమ్ముతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరో వైపు ఎండలు మండిపోతుండటం, పంట వాడిపోతుండటంతో టామోటాలకు భారీ డిమాండ్ పెరిగింది. దీంతో వ్యాపారులు రైతుల దగ్గరకు తక్కువ ధరకు కొనుగోలు చేసి బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. అటు మదనపల్లి మార్కెట్‌లోనూ టమోటా ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. వారం రోజల కిందట టమోటా రూ.30 నుంచి 35 పలకగా, రంజాన్ పండుగ సమీపిస్తున్న తరుణంలో ఆదివారం కిలో టమోటా గరిష్టంగా రూ.55 పలికింది. ఇలా టామోటా ధరలు పెరగడంతో కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి: