AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: హెడ్ మాస్టర్ వేధింపుల నుంచి కాపాడండి.. జిల్లా కలెక్టర్ కు క్రాఫ్ట్ టీచర్ ఫిర్యాదు

విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి, సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన వృత్తిలో ఉన్న ఉపాధ్యాయులే దారుణంగా ప్రవర్తిస్తున్నారు. పిల్లలకు సరైన దారి చూపించి, సన్మార్గంలో నడిపించాల్సిన టీచర్లే దారి తప్పుతున్నారు...

Andhra Pradesh: హెడ్ మాస్టర్ వేధింపుల నుంచి కాపాడండి.. జిల్లా కలెక్టర్ కు క్రాఫ్ట్ టీచర్ ఫిర్యాదు
Harassment
Ganesh Mudavath
|

Updated on: May 02, 2022 | 2:44 PM

Share

విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి, సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన వృత్తిలో ఉన్న ఉపాధ్యాయులే దారుణంగా ప్రవర్తిస్తున్నారు. పిల్లలకు సరైన దారి చూపించి, సన్మార్గంలో నడిపించాల్సిన టీచర్లే దారి తప్పుతున్నారు. విద్యార్థులపై ఉపాధ్యాయులు వేధింపులకు పాల్పడిన ఘటనలు ఎన్నో చూశాం. అయితే మరో అడుగు ముందుకేసి.. తోటి ఉపాధ్యాయులపైనే వేధింపులకు పాల్పడుతున్నారు. తమ కోరిక తీర్చాలంటూ వేధిస్తున్నారు. తాజాగా కోనసీమ(Konaseema) జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. ప్రధానోపాధ్యాయుడు తనను వేధిస్తున్నాడని ఓ క్రాఫ్ట్ టీచర్.. జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. అతడి వేధింపుల నుంచి కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ప్రధానోపాధ్యాయుడు నాగోజిరావు వేధింపుల నుంచి కాపాడాలంటూ జిల్లా కలెక్టర్ క్రాఫ్ట్ టీచర్ ఫిర్యాదు చేశారు. మామిడికుదురు మండలంలోని పాసర్లపూడి బాడవ జడ్పీ హైస్కూలు ప్రధానోపాధ్యాయుడు తనను లైంగిక వేధిస్తున్నాడని స్పందన కార్యక్రమంలో జిల్లా పాలనాధికారికి తెలిపారు.

ఇవాళ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరుగుతున్న స్పందన కార్యక్రమంలో ఈ తరహా ఫిర్యాదు వెలుగుచూడటంతో అధికారులు షాక్ కు గురయ్యారు. ఆరు నెలల నుంచి ప్రధానోపాధ్యాయుడు నాగోజిరావు తనను మానసికంగా, లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వేధింపులపై ఫిబ్రవరిలో ఫిర్యాదు చేసినా.. ఎవరూ పట్టించుకోలేదని వాపోయారు. తనకు న్యాయం చేయాలని, అతడి వేధింపుల నుంచి కాపాడాలని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీచదవండి

Power Crisis: బొగ్గు కొరతపై అమిత్‌షా అత్యున్నతస్థాయి సమావేశం.. కరెంట్‌ కోతలను నివారించడానికి చర్యలపై సమీక్ష

Tirupati: తిరుమలలో ఐదేళ్ల బాలుడి కిడ్నాప్‌ కలకలం.. రంగంలోకి ప్రత్యేక బృందాలు