Tirupati: తిరుమలలో ఐదేళ్ల బాలుడి కిడ్నాప్‌ కలకలం.. రంగంలోకి ప్రత్యేక బృందాలు

తిరుమల శ్రీవారి సన్నిధిలో ఐదేళ్ల బాలుడు కిడ్నాప్ కావడం తీవ్ర కలకలం రేపుతోంది. గుండు చేపించుకున్న ఓ మహిళ బాలుడిని అపహరించింది.

Tirupati:  తిరుమలలో ఐదేళ్ల బాలుడి కిడ్నాప్‌ కలకలం.. రంగంలోకి ప్రత్యేక బృందాలు
Tirumala Boy Kidnap
Follow us

|

Updated on: May 02, 2022 | 1:27 PM

Tirumala: తిరుమలలో కిడ్నాప్‌ కలకలం రేపింది. ఐదేళ్ల బాలుడు కిడ్నాప్‌కు గురయ్యాడు. బాలుడిని మరో మహిళ ఎత్తుకుపోయింది. గులాబీ కలర్‌ టాప్‌, క్రీమ్‌ కలర్‌ ప్యాంట్‌ ధరించి, గుండుతో మహిళ బాలుడ్ని తీసుకెళ్తున్న విజువల్స్ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. మరి, ఏం మాయ మాటలు చెప్పిందో ఏమో, బాలుడు కూడా ఆమెతో వెళ్తున్నట్లు దృశ్యాల్లో కనిపిస్తోంది.  బాలుడిని గుర్తుతెలియని మహిళ ఎత్తుకెళ్లడంతో తల్లి తల్లిడిల్లిపోతోంది. తన కొడుకును వెతికి పెట్టమని పోలీసులను వేడుకుంటోంది. తల్లి కంప్లైంట్‌తో బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా సెర్చింగ్‌ చేస్తున్నారు. బాలుడిని తీసుకెళ్లిన ఆ మహిళ ఎవరో, ఎక్కడ్నుంచి వచ్చిందో గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. కిడ్నాపర్‌ ఇంకా తిరుపతి దాటి వెళ్లలేదని భావిస్తున్న పోలీసులు, ఆమెను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఎవరికైనా బాలుడి జాడ తెలిస్తే 9440796769, 9440796772 నంబర్లకు తెలియజేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Also Read:   Vizag: యువకుడిని చూసి అరిచిన పోలీస్ శునకం.. అతడి స్కూటీని చెక్ చేసిన పోలీసుల మైండ్ బ్లాంక్

కిడ్నాప్‌కు గురైన బాలుడిని తిరుపతి దామినీడుకు చెందిన గోవర్దన్‌ రాయల్‌గా పోలీసులు గుర్తించారు. కడపకు చెందిన దంపతులు తిరుపతికి వచ్చి స్థిరపడ్డారు. తిరుమల కొండపై పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. భర్త స్థానికంగా పని చేసుకుంటుండగా.. భార్య తిరుమల కొండపై తిరునామాలు పెడుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం తల్లి భక్తులు నామాలు పెడుతూ.. పిల్లాడిని పక్కన కూర్చోబెట్టింది. అయితే, వెంకన్న ఆలయం ఎదురుగా కూర్చొని ఉన్న బాలుడిని మహిళ కిడ్నాప్‌ చేసింది.