Vizag: యువకుడిని చూసి అరిచిన పోలీస్ శునకం.. అతడి స్కూటీని చెక్ చేసిన పోలీసుల మైండ్ బ్లాంక్
పోలీస్ శునకం రోడ్డుపై ఉన్న ఇద్దరు యువకులను చూసి అదే పనిగా అరిచింది. దీంతో పోలీసులు వారిలో ఒకరిని పట్టుకున్నారు. అతడి బైక్ చెక్ చేసి వారు ఖంగుతిన్నారు.
మత్తు వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ప్రభుత్వాలు, పోలీసులు.. ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. డ్రగ్స్‌కు ఎండ్ కార్డు వేయలేకపోతున్నారు. ఈ మధ్య కాలంలో ఎక్కడ పడితే డ్రగ్స్ లభ్యమవుతూనే ఉన్నాయి. రోజుకు పదుల సంఖ్యలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇంకా చిక్కని మత్తగాళ్లు ఎంతోమంది ఉన్నారు. తాజాగా విశాఖలో ఓ యువకుడు గంజాయితో అనూహ్యంగా పోలీసులకు చిక్కాడు. నార్కోటిక్ శునకం అతడిని పట్టించింది. బీచ్ రోడ్లో బైక్‌పై 150 గ్రాముల గంజాయితో ఇద్దరు యువకులు నిల్చుని ఉన్నారు. ‘సిసర్’ అనే శునకం ఈ ఇద్దరిని చూసి గట్టిగా అరిచింది. దీంతో ఇద్దరు యువకులు భయంతో అక్కడి నుంచి పరుగులు పెట్టారు. పోలీసులు.. వారిని వెంబడించి పట్టుకున్నారు. వారి వద్ద చెక్ చేయగా ఏం దొరకలేదు. కానీ వారు ప్రయాణిస్తున్న స్కూటీలో గంజాయి బయటపడింది. యవకుడిని అదుపులోకి తీసుకుని.. పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పరారైన రెండో వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు. వీరికి గంజాయి ఎలా వస్తుంది.. అమ్ముతున్నారా లేదా ఎవరికైనా అమ్ముతున్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. గంజాయి దొరికిన స్కూటీలో 30కి పైగా చలానాలు పెండింగ్ ఉన్నాయి.
Also Read: Hyderabad: కొడుకు చేసిన పని తల్లిదండ్రుల పాలిట శాపంగా మారింది.. ఆస్పత్రి పాలయ్యేలా చేసింది