సీఎం చంద్రబాబుతో సినీ పెద్దల భేటీ వాయిదా..! కారణం ఇదే..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో టాలీవుడ్ ప్రముఖుల భేటీ వాయిదా పడింది. షూటింగ్ షెడ్యూల్స్ కారణంగా కీలక నటులు అందుబాటులో లేకపోవడం వల్ల ఈ వాయిదా జరిగింది. థియేటర్ల బంద్ పిలుపు నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల తర్వాత, ప్రభుత్వాన్ని కలవాలని టాలీవుడ్ నిర్ణయించింది.

Cm Chandrababu
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో టాలీవుడ్ పెద్దలు ఆదివారం భేటీ కావాల్సింది ఉంది. కానీ, తాజాగా ఆ భేటీ వాయిదా పడింది. ప్రముఖ సినీ పెద్దలు అందుబాటులో లేకపోవడంతో భేటీ వాయిదా పడినట్లు సమాచారం. షూటింగ్స్ కారణంగా కొంతమంది సినీ పెద్దలు రేపు అందుబాటులో లేకపోవడంతో సమావేశం వాయిదా వేశారు. మళ్లీ తిరిగి భేటీ ఎప్పుడు ఉంటుందనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. కాగా, థియేటర్ల బంద్ పిలుపు నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఏపీ ప్రభుత్వాన్ని మర్యాదపూర్వకంగా కలిసేందుకు ఇండస్ట్రీలోని పెద్దలు నిర్ణయించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
