Ganja Drug in Tirupati: స్టూడెంట్సే టార్గెట్.. బెగ్గర్సే సేల్స్ మెన్స్.. మత్తులో జోగుతున్న టెంపుల్ సిటీ..!

ఇప్పుడు ఏడుకొండల స్వామి కొలువై ఉన్న తిరుపతి ఇపుడు మత్తులో జోగుతోంది.. గంజాయికి బానిసలైన యువత సైకోల్లా మారుతున్నారు వాళ్లని చూస్తే హృదయం చలించిపోతోంది.

Ganja Drug in Tirupati: స్టూడెంట్సే టార్గెట్.. బెగ్గర్సే సేల్స్ మెన్స్.. మత్తులో జోగుతున్న టెంపుల్ సిటీ..!
Drug Trade, The Dark Side Of Temple City Tirupati
Follow us

|

Updated on: Jun 12, 2021 | 10:56 AM

Ganja Drug Trade in temple city Tirupati: అవును ఇప్పుడు ఏడుకొండల స్వామి కొలువై ఉన్న తిరుపతి ఇపుడు మత్తులో జోగుతోంది.. గంజాయికి బానిసలైన యువత సైకోల్లా మారుతున్నారు వాళ్లని చూస్తే హృదయం చలించిపోతోంది అని స్వయంగా తిరుపతి అర్బన్ ఎస్పీ కామెంట్ చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.. అంతేకాదు మత్తులో అమ్మాయిలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు తిరుపతి ఎమ్మల్యే భూమన కరుణాకరరెడ్డి.. ఇది కేవలం మాటలతో ముగియలేదు.. తిరుపతి మున్సిపల్ కార్పోరేషన్ సమావేశంలో ఈ గంజాయిని తుదముట్టించడానికి ఏకంగా తీర్మానం చేసారు.

ఒక సిటీలో నుంచి మత్తును పారద్రోలడానికి మున్సిపల్ కార్పోరేషన్ కార్పోరేటర్లు అంతా తీర్మానం చేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి కావొచ్చు.. గంజాయి, డ్రగ్స్ ఇక్కడ ఎంతటి ప్రబావాన్ని చూపుతున్నాయి అనడానికి ఇవి నిదర్శనాలు.. ఎక్కడో విశాఖ జిల్లా ఏజెన్సీ నుంచి అక్రమమార్గాల్లో ఇక్కడికి వస్తున్న గంజాయి ఇలా యువత జీవితాలతో ఆటలాడుకుంటోంది. దీనిపైనే గతం పదిరోజులుగా తిరుపతి పోలీసులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు.. ఎక్కడెక్కడైతే గంజాయి అమ్మే హాట్ స్పాట్లను గుర్తించి రైడ్స్ చేస్తున్నారు..ఇప్పటి వరకూ వందకు పైగా గంజాయి అమ్మేవారిని అరెస్ట్ చేశారు. మూడువందలమంది విద్యార్థులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు

విద్యార్థులే లక్ష్యం.. ఎక్కువగా గంజాయి మత్తులో తూగుతోంది విద్యార్థులే. అందులో ఇంటర్, బీటెక్ విద్యార్థులే ఎక్కువగా ఉన్నారు. కరోనా కారణంగా గత ఏడాది కాలం నుంచి సరిగా కళాశాలలు నడవకపోవడంతో ఇలా మత్తు బారిన పడుతున్నారు. ముఖ్యంగా తిరుపతిలో ఉన్న హాస్టళ్లు ఇందుకు అడ్డాగా మారుతున్నాయి.. ఇప్పటికీ హాస్టళ్లలో ఉన్న విద్యార్థులు తోటి విద్యార్థుల ద్వారా గంజాయి , డ్రగ్స్ బారిన పడుతున్నారు. డ్రగ్స్ కొనాలంటే ఎక్కువ రేటు కాబట్టి ఎక్కువమంది గంజాయిని వాడుతున్నారు.. మత్తుకు అమ్మాయిలను కూడా యువత బానిసలుగా చేస్తోంది. గంజాయి మత్తు యువ రక్తాన్ని నిర్వీర్యం చేస్తోంది. అఘాయిత్యాలకు పాల్పడేలా చేస్తోంది. అమ్మాయిలను ఇలా మత్తుకు బానిసలను చేసి వారిపై అత్యాచారాలకు పాల్పడుతున్నట్టు తేలింది. మత్తుకు బానిసైన యువకులు ఎన్నో కుటుంబాల్లో నరకం చూపిస్తున్నారు. తిరుపతిలో 4 వేల మంది కి పైగా యువకులు మత్తుకు బానిసలయినట్టు ఓ సర్వేలో తేలింది. ఎంతో మంది తల్లిదండ్రులు గంజాయి తాగే అలవాటు పడ్డ పిల్లలను భరించలేక పోతున్నారు…

బెగ్గర్సే సేల్స్ మెన్స్.. అవును ఇది వినడానికి ఆశ్చరంగా ఉన్నప్పటికీ ఇది నిజం.. బెగ్గర్స్ అయితే ఎవరికీ అనుమానం రాదు కాబట్టి వారికి గంజాయి ప్యాకెట్లు ఇచ్చి వారిచేత అమ్మిస్తున్నారు. ఆధ్యాత్మిక క్షేత్రం కాబట్టి దేశవ్యాప్తంగా ఎక్కడెక్కిడి నుంచో భక్తులు వస్తుంటారు. అందుకే వారు ఇచ్చే డబ్బుల కోసం ఇక్కడ బిచ్చగాళ్లు ఎక్కువగానే ఉంటారు. అలిపిరిరోడ్డు, కపిలతీర్ధం ప్రాంతాల్లో వందల్లో బిచ్చగాళ్లు కనిపిస్తారు. వీరందరి చేత గంజాయిని విచ్చలవిడిగా అమ్మిస్తున్నారు స్మగ్లర్లు. చిన్నచిన్న పొట్లాల్లో చుట్టి వారి బ్యాగుల్లో పెట్టుకుని రోడ్డుపక్కనే అమ్మేస్తున్నారు బిచ్చగాళ్లు. పెద్దమొత్తంలో కావాలంటే మాత్రం స్మగ్లర్ల ఫోన్ నంబర్లు ఇస్తున్నారు.

గంజాయి అడ్డాలుగా శివారు ప్రాంతాలు.. తిరుపతి శివారు ప్రాంతాల్లో జోరుగా గంజాయి అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నాయిు. ముఖ్యంగా రైలు పట్టాలపై బెగ్గర్ల తో గంజాయి ప్యాకెట్లు అమ్మిస్తున్నారు స్మగ్లర్లు. తిరుపతిలోని యువతకు ఈజీగానే చేతికి గంజాయి అందుతోంది. తిరుచానూరు రోడ్ లోని కెనడీనగర్ లో గంజాయిని ప్యాకెట్ల రూపంలో తయారు చేస్తోంది ముఠా.

బయటపడింది ఇలా… జయప్రకాష్ అనే ఫిజియోథెరపిస్టు, ఎమ్మెస్సీ చదువుతున్న శివయ్య అనే ఇద్దరిని అరెస్టు చేసి 1350 గ్రాముల గంజాయి స్వాదీనం చేసుకున్నారు తిరుపతి ఈస్ట్ పోలీసులు. ప్రధాన నిందితుడు తిరుపతిలోని బైరాగి పట్టెడ కు చెందిన మోనీష్ గా గుర్తించారు…టెంపుల్ సిటీలో గంజాయిఅమ్మకాలకు అసలు మాస్టర్ మోనిష్…కొన్ని కాలేజీల్లో నూ కొంతమంది విద్యార్థులు కమిషన్ ఇచ్చి వారి చేత గంజాయి అమ్మిస్తున్నారు.

సైకోల్లో మారుతున్న యువత.. అవును మత్తుకు బానిసలు అవుతున్నవారిలో ఎక్కువ మంది బీటెక్ విద్యార్థులే.. ఒకపూట గంజాయి పీల్చకపోతే వారి శరీరం వణికిపోతోంది..మాట పడిపోతోంది..శరీరంలో అనేక మార్పులు వస్తున్నాయి..గంజాయికి అలవాటుపడి ముఖం పీక్కుపోయి, శరీరం బక్కపల్చగా మారిపోయి చూడడానికి వికృతంగా తయారువుతున్నారు విద్యార్థులు..తిరుపతి అర్బన్ ఎస్పీ అప్పలనాయడు ఇలా పట్టుబడిన విద్యార్థులందరికీ తానే స్వయంగా కౌన్సిలింగ్ ఇచ్చారు. వారి తల్లిదండ్రులందరినీ పిలిపించి వారి ముందే విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అలా కౌన్సిలింగ్ ఇస్తున్న సమయంలోనూ విద్యార్థులు కనీసం పదినిమిషాలు నిలబడలేకపోతున్నారు. కనీసం మాట్లాడలేకపోతున్నారు. వారి ప్రవర్తన విచిత్రంగా ఉంది. సైకో లక్షణలా కనిపిస్తున్నాయి. ఒక దశలో వారిని అలా చూసి వారి తల్లిదండ్రులు కుమిలిపోయారు. బంగారు భవిష్యత్తు ఉన్న విద్యార్థులు ఇలా మత్తుకు బానిసై పోవడం చూసి ఇటు ఎస్పీ కన్నీళ్లు పెట్టుకున్నారు.

విశాఖ ఏజెన్సీ వయా నెల్లూరు టూ తిరుపతి విశాఖ ఏజెన్సీ నుంచి స్మగ్లర్లు ఈ గంజాయిని ఇక్కడికి తెస్తున్నారు. నెల్లూరు జిల్లా గూడూరును గంజాయి హబ్ గా గంజా స్మగ్లింగ్ జరుగుతున్నట్లు గుర్తించారు పోలీసులు…గూడూరు నుంచి తిరుపతి, చెన్నై, వేలూరు, బెంగళూరుకు గంజాయి చేరుతోంది.. గూడూరు ను డిస్ట్రిబ్యూషన్ పాయింట్ గా పెట్టుకుంది గంజాయి ముఠా. తిరుపతి లో మోనిష్ అనే యువకుడు ద్వారానే గంజాయి వ్యాపారం సాగుతున్నట్లు గుర్తించారు..మోనీష్ ద్వారా గంజాయి స్మగ్లింగ్, నడిపిస్తున్న ముఠాల ను కనుగొనే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. అరకు నుంచి గంజాయిని ఎవరికీ అనుమానం రాకుండా రైళ్లు బస్సుల్లో తరలిస్తున్నారు స్మగ్లర్లు. సాధారణ ప్రయాణికుల మాదిరిగానే బట్టల బ్యాగుల్లో ఈ గంజాయి రవాణా అవుతోంది. పాకెట్ల రూపంలో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయి. ఒక్కొక్క గంజాయి ప్యాకెట్ ను రూ. 300 నుంచి రూ. 500 వరకు అమ్ముతున్నారు. అలాగే, సిగరెట్ లోపల పొగాకు తొలగించి అందులో గంజాయిని కూర్చి ఆ సిగరెట్లను అమ్ముతున్నారు.

మాదకద్రవ్యాల నియంత్రణ చెక్ పెట్టేదేలా.. ఇది ఇప్పుడు ప్రమాదకర స్థాయికి చేరుకుంది.. అయితే, ఇది నాలుగురోజులు పాటు పోలీసులు హడావిడి చేసి వందమందిని అరెస్ట్ చేస్తే ఏమాత్రం ప్రయోజనం ఉండదు.. ఇందుకోసం ప్రత్యేకబృందం నిరంతరం పని చేయాలి.. ముఖ్యంగా కొనుగోళ్లు జరగకుండా కంట్రోల్ చేస్తే స్మగ్లర్ల వ్యాపారం పడిపోతుంది..తద్వారా ఇక్కడికి తరలించే గంజాయి తగ్గుతుంది.. అలాగే పూర్తిగా గంజాయి బారిన పడిన విద్యార్థులకు రహస్యంగానైనా చికిత్స చేయించాలి.. వారికి సైకాలజిస్టుల చేత కౌన్సిలింగ్ ఇప్పించాలి. అలాగే గంజాయి అమ్మేవారిపై పీడీయాక్ట్ నమోదు చేయాలి.. అలాగే గంజాయిని అమ్ముతున్న బిచ్చగాళ్లకు దీనిపై అవగాహన కల్పించాలి.. మాదకద్రవ్యాల నియంత్రణకు అన్ని కాలేజీల్లో కమిటీలు ఏర్పాటు చేయాలి..అలాగే కాలేజీల్లో గంజాయి అమ్మకాలు చేయకుండా సీరియస్ గా చర్యలు తీసుకోవాలి..ఎక్కడైతే గంజాయి హాట్ స్పాట్ లు ఉన్నాయో అవన్నీ ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న పోలీసులందరికీ తెలుసు..ఆ స్పాట్లపపై నిరంతర నిఘా ఉంచాలి..ముఖ్యంగా నిర్మానుష్య ప్రదేశాల్లో ఎక్కువగా ఈ గంజాయి సేవిస్తున్నారు. అలాగే శేషాచలం అడవుల్లోనూ కొన్ని చోట్ల గంజాయి పీలుస్తున్నారు. ఈ స్పాట్లపై పోలీసుల నిఘా ఉంటే కచ్చితంగా అటువైపు వెళ్లడానికి విద్యార్థులు భయపడతారు.. అప్పుడే మత్తునుంచి పవిత్రనగరాన్ని బయటపడేస్తాం.

— అశోక్ వేములపల్లి, టీవీ9, తిరుపతి

Read Also….   Tirumala: మీ వివాహ మొదటి శుభలేఖ తిరుమల వెంకన్నకు ఇలా పంపించండి.. పెండ్లికానుక అందుకోండి 

ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..