AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టిటిడి పాఠశాలల్లో సద్గమయ శిక్షణా తరగతులు…ఎవరు అర్హులంటే?

సద్గమయ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యం విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం, ఆధ్యాత్మిక, సామాజిక, నైతిక విలువలు, నైపుణ్యాలు, సంస్కృతి – సాంప్రదాయాలు, వాస్తవాలు ప్రపంచాన్ని అధ్యయనం చేయడం, వ్యక్తిగత పురోగతి, సామరస్యం, సమాజంలో భాగస్వామ్యం, నాయక’లక్షణాలు ఇతర వ్యక్తులకు సంబంధించిన శిక్షణ పొందిన 70 మంది ఉపాధ్యాయులచే శిక్షణ ఇవ్వనున్నారు. తిరుపతి, తిరుమలలోని

టిటిడి పాఠశాలల్లో సద్గమయ శిక్షణా తరగతులు...ఎవరు అర్హులంటే?
Ttd's Sadgmaya Program
Raju M P R
| Edited By: Jyothi Gadda|

Updated on: Jul 29, 2025 | 11:12 AM

Share

ప్రాథమిక విద్య నుంచే విద్యార్థుల్లో భక్తి భావం పెంచేందుకు టీటీడీ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే టీటీడీ, హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్తంగా సద్గమయ శిక్షణ కార్యక్రమం ప్రారంభించింది. తిరుపతి, తిరుమలలోని టిటిడికి చెందిన 7 పాఠశాలల్లో ఈ మేరకు శిక్షణ తరగతులను ప్రారంభించింది. తిరుపతిలోని ఎస్.జీ.ఎస్. హైస్కూల్, ఎస్వీ ఓరియంటల్ హైస్కూల్, ఎస్వీ హైస్కూల్, ఎస్.కె.ఆర్.ఎస్ ఇంగ్లీషు మీడియం స్కూల్ , ఎస్పీ బాలికల పాఠశాల, తాటితోపులోని ఎస్.కె.ఎస్. హైస్కూల్, తిరుమలలోని ఎస్వీ హైస్కూల్ ల్లో ఏడు చోట్ల శిక్షణా తరగతులను నిర్వహిస్తోంది. 8, 9, 10 తరగతుల విద్యార్థులకు ఎంపిక చేయబడ్డ అధ్యాపకులచే శిక్షణ ఇప్పిస్తోంది.

సద్గమయ కార్యక్రమంలో విద్యార్థులకు భక్తి భావం, భగవద్గీత పరిచయం, మానవీయ కోణం, నైతిక విలువలు, వ్యక్తిత్వ వికాసం, క్విజ్, సింహహలోకనం, విద్యార్థులలో సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, వాస్తవ ప్రపంచాన్ని అధ్యయనం చేయడం, వ్యక్తిగత పురోగతి, సమాజంలో భాగస్వామ్యం, నైపుణ్యాలు, మన సంస్కృతి- సాంప్రదాయాలు లాంటి అంశాలపై విశ్లేషనాత్మకంగా శిక్షణ ఇస్తోంది. ఈ నెల 31వ తేదీ చివరి రోజు శిక్షణ అనంతరం విద్యార్థులకు సంబంధిత అంశాలపై పుస్తక ప్రసాదాన్ని అందించేందుకు టిటిడి ఏర్పాట్లు చేస్తోంది. తిరుపతి ఎస్.జి.ఎస్. హైస్కూల్ లో జరిగిన కార్యక్రమంలో డిపిపి కార్యదర్శి శ్రీరామ్ రఘునాథ్, డిఈవో వెంకట సునీల్ తో పాటు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సద్గమయ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యం విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం, ఆధ్యాత్మిక, సామాజిక, నైతిక విలువలు, నైపుణ్యాలు, సంస్కృతి – సాంప్రదాయాలు, వాస్తవాలు ప్రపంచాన్ని అధ్యయనం చేయడం, వ్యక్తిగత పురోగతి, సామరస్యం, సమాజంలో భాగస్వామ్యం, నాయక’లక్షణాలు ఇతర వ్యక్తులకు సంబంధించిన శిక్షణ పొందిన 70 మంది ఉపాధ్యాయులచే శిక్షణ ఇవ్వనున్నారు. తిరుపతి, తిరుమలలోని 7 పాఠశాలల్లో రోజుకు ఒక గంట చొప్పున 4 రోజుల పాటు సద్గమయ శిక్షణ కార్యక్రమం జరిగింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..