AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. దర్శనం టికెట్ల విషయంలో టీటీడీ కీలక మార్పులు.. తెలుసుకోకుంటే ఇబ్బందులు తప్పవు

ఇప్పటివరకు శ్రీవారి భక్తులకు గాలి గోపురం వద్ద దివ్య దర్శనం టోకెన్లు ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే శుక్రవారం (ఏప్రిల్‌14) నుంచి అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌లో ఈ టికెట్లను జారీ చేయనున్నారు. టోకెన్లు పొందిన భక్తులు అలిపిరి కాలినడక మార్గంలోని గాలిగోపురం దగ్గర ఉన్న కేంద్రంలో స్కాన్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

Tirumala: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. దర్శనం టికెట్ల విషయంలో టీటీడీ కీలక మార్పులు.. తెలుసుకోకుంటే ఇబ్బందులు తప్పవు
Tirumala Divya Darshan
Basha Shek
|

Updated on: Apr 14, 2023 | 12:19 PM

Share

తిరుమల శ్రీవారి భక్తులకు అలెర్ట్‌. దివ్యదర్శనం టికెట్లకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పలు మార్పులు చేసింది. ఇప్పటివరకు శ్రీవారి భక్తులకు గాలి గోపురం వద్ద దివ్య దర్శనం టోకెన్లు ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే శుక్రవారం (ఏప్రిల్‌14) నుంచి అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌లో ఈ టికెట్లను జారీ చేయనున్నారు. టోకెన్లు పొందిన భక్తులు అలిపిరి కాలినడక మార్గంలోని గాలిగోపురం దగ్గర ఉన్న కేంద్రంలో స్కాన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. టికెట్లు పొందిన భక్తులు ఎవరైనా ఒకవేళ స్కాన్‌ చేసుకోకపోయినా.. ఇతర మార్గాల్లో తిరుమల చేరుకున్నా.. ఎట్టి పరిస్థితుల్లోనూ స్వామివారి దర్శనానికి అనుమతించరు. ఇక యథా ప్రకారంగానే శ్రీవారి మెట్టు మార్గంలో దివ్యదర్శనం టోకెన్లను అందజేయనున్నారు. అంటే 1240వ మెట్టు వద్ద భక్తులకు ఈ టికెట్లను అందించనున్నారు. అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌లో ఇప్పటివరకు జారీ చేస్తున్న టైం స్లాట్‌ సర్వదర్శనం టోకెన్ల (ఎస్‌ఎస్‌డీ) కేంద్రాన్ని రైల్వే స్టేషన్‌ ఎదురుగా ఉన్న విష్ణు నివాసం యాత్రికుల వసతి సముదాయానికి తరలించారు.

ఇక సొంత వాహనాల్లో తిరుమలకు వెళ్లాలనుకునేవారికి, తిరుపతిలోనే ఎస్‌ఎస్‌డీ టోకెన్లను జారీ చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. ఆర్‌టీసీ బస్టాండ్‌ ఎదురుగా ఉన్న శ్రీనివాసం, తిరుపతి రైల్వేస్టేషన్ సమీపంలోని విష్ణు నివాసం, గోవింద రాజ సత్రాల్లో టైం స్లాట్‌ సర్వదర్శనం టోకెన్లను పంపిణీ చేయనున్నారు. భక్తులు ఈ మార్పులు గమనించి టీటీడీకి సహకరించాలని కోరారు. మరోవైపు వేసవి సీజన్ కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతోంది. దీంతో సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తూ వీఐపీ బ్రేక్‌, శ్రీవాణి, టూరిజం కోటా, వర్చువల్‌ సేవలు, రూ.300 దర్శన టికెట్లను తగ్గిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. అలాగే ఆలయ మాడ వీధుల్లో భక్తులకు ఎండ వేడి నుండి ఉపశమనం కల్పించేందుకు చలువపందిళ్లు, చలువసున్నం, కార్పెట్లు  ఏర్పాట్లు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..