AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: గుండెలు పిండేసే విషాదం.. శుభకార్యంలో అశుభం.. కరెంట్ షాక్‌తో నలుగురు మృతి..

అప్పటివరకు మనతో సంతోషంగా గడిపిన వాళ్లు హఠాత్తుగా కంటికి దూరమై అనంత లోకాలకు వెళ్లిపోతే ఎలా ఉంటుంది. అందులోనూ.. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురు-నలుగురు.. ఒకేసారి దూరమైతే ఇంకెలా ఉంటుంది. వాళ్లు కూడా ఓకే కుటుంబానికి చెందినవాళ్లు అయితే.. అమ్మో.. ఊహించడానికే కష్టంగా ఉంది.. తలచుకుంటేనే గుండె జల్లుమంటోంది.

Andhra Pradesh: గుండెలు పిండేసే విషాదం.. శుభకార్యంలో అశుభం.. కరెంట్ షాక్‌తో నలుగురు మృతి..
Crime News
Shaik Madar Saheb
|

Updated on: Apr 15, 2023 | 7:19 AM

Share

అప్పటివరకు మనతో సంతోషంగా గడిపిన వాళ్లు హఠాత్తుగా కంటికి దూరమై అనంత లోకాలకు వెళ్లిపోతే ఎలా ఉంటుంది. అందులోనూ.. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురు-నలుగురు.. ఒకేసారి దూరమైతే ఇంకెలా ఉంటుంది. వాళ్లు కూడా ఓకే కుటుంబానికి చెందినవాళ్లు అయితే.. అమ్మో.. ఊహించడానికే కష్టంగా ఉంది.. తలచుకుంటేనే గుండె జల్లుమంటోంది. కానీ.. సరిగ్గా అలాంటి ఘటనే ఏపీలోని అన్నమయ్య జిల్లాలో జరిగింది. సహజంగా ప్రతి ఒక్కరు తమ తమ కుటుంబాల్లో జరిగే వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని భావిస్తారు. బంధువులందరినీ ఆహ్వానించి.. ఇంట్లోని శుభకార్యాలను గ్రాండ్‌గా జరుపుకుంటారు. అయితే.. అలా జరుపుకునే వేడుకల్లో కొన్నిసార్లు అనుకోని ప్రమాదాలు జరిగి.. ఆయా కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. గృహప్రవేశ కార్యక్రమంలో కరెంట్‌ షాక్‌ తగిలి నలుగురు మృతి చెందిన ఘటన అన్నమయ్య జిల్లా పెద్దతిప్పసముద్రం మండలంలోని కానుగామాకులపల్లెలో చోటుచేసుకుంది. టెంట్‌ రూపంలో మృతువు ముంచుకొచ్చింది. భారీగా వీచిన గాలులతో టెంట్‌ పక్కనే ఉన్న 11 కేవీ విద్యుత్ తీగలపై పడటంతో ప్రమాదం జరిగింది. బంధుమిత్రుల ఆనందోత్సాహాల నడుము జరగాల్సిన కార్యక్రమం విషాదంగా మారింది.

పెద్దతిప్పసముద్రం మండలం కానుకమాకులపల్లెలో ఓ కుటుంబం కొత్తగా ఇంటిని నిర్మించుకుని గృహప్రవేశానికి సిద్ధమైంది. బంధువులు అంతా వేడుకకు రావటంతో హడావిడిగా ఉంది. కానీ.. అదే ఇంటిని మృత్యువు కూడా నీడలా వెంటాడింది. ఏం జరుగుతుందో ఊహకు కూడా అందకుండానే క్షణాల్లో దారుణం జరిగిపోయింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడ్డవారిని బి కొత్తకోట మండలంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇక.. మృతులను లక్ష్మమ్మ, శాంతమ్మ, లక్ష్మన్న, ప్రశాంత్‌గా గుర్తించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో వేడుక జరుగుతున్న ఆ ఇంట్లో విషాదఛాయలు అలముకున్నాయి. కుటుంబ సభ్యుల, బంధుమిత్రుల రోదనలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. శుభాకార్యం జరగాల్సిన ఇంట విషాద ఘటనతో చావు డప్పులు మోగాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..