AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీవాణి ట్రస్టుపై అసత్య ఆరోపణలు చేస్తే కఠిన చర్యలు.. త్వరలోనే శ్వేత పత్రం: టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలకమండలి సమావేశం ముగిసింది. శ్రీవారి ఆలయానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి. ఈక్రమంలో రూ.4.15కోట్లతో తిరుమలలో అదనపు లడ్డు కౌంటర్లు ఏర్పాటు చేయాలని తీర్మానించారు

శ్రీవాణి ట్రస్టుపై అసత్య ఆరోపణలు చేస్తే కఠిన చర్యలు.. త్వరలోనే శ్వేత పత్రం: టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి
Yv Subbareddy
Basha Shek
|

Updated on: Jun 19, 2023 | 3:47 PM

Share

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలకమండలి సమావేశం ముగిసింది. శ్రీవారి ఆలయానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి. ఈక్రమంలో రూ.4.15కోట్లతో తిరుమలలో అదనపు లడ్డు కౌంటర్లు ఏర్పాటు చేయాలని తీర్మానించారు. అలాగే రూ.2.35 కోట్లతో హెచ్వీసీ ప్రాంతం లో ఉన్న 144 గదులు ఆధునికీకరణ చేయాలని టీటీడీ నిర్ణయించింది. అలాగే రూ.1.88 కోట్లతో జీఎంసీ, ఎస్ఎంసీ ఉప విచారణ కార్యాలయాలను ఆధునికీకరణ చేసేందుకు తీర్మానం చేశారు. వీటితో పాటు దాతల సాయంతో రూ.4 కోట్లతో ఒంటిమిట్టలోని కోదండరామ స్వామి ఆలయం లో అన్నదాన భవనం నిర్మాణం, రూ.3.55 కోట్లతో పోలీస్ క్వార్టర్స్ అభివృద్ధికి, రూ.3.10 కోట్ల తో తిరుమలలో స్టైన్ లెస్ స్టీల్ బిన్లు ఏర్పాటుకు, రూ.5 కోట్లతో ఎస్వీ వేదిక్ యూనివర్సిటీలో స్టాఫ్ క్వార్టర్స్ నిర్మాణనికి, రూ. 7 కోట్ల తో టీటీడీలోని అన్ని విభాగాలలో నూతన కంప్యూటర్స్ ఏర్పాటుకు, రూ.9.50 కోట్లతో టీటీడీ పరిపాలన భవనంలో సెంట్రల్ రికార్డు రూమ్ నిర్మాణానికి, రూ. 2 కోట్లతో నగరిలోని బుగ్గ ఆలయంలో కళ్యాణమండపం నిర్మాణానికి, కర్నూలు జిల్లా అవుకు మండలం లో రూ. 4.18 కోట్లతో ఆలయ నిర్మాణానికి, రూ. 97 కోట్ల రూపాయలతో స్విమ్స్ ఆసుపత్రి ఆధునీకరణకు నిధులు కేటాయింపు, 1200 బెడ్స్ తో అసుపత్రి నిర్మాణానికి, రూ.7.75 కోట్లతో స్విమ్స్ లో గోడౌన్ నిర్మాణనికి, రూ.6.65 కోట్ల తో తిరుచానూరు పుష్కరిణి అభివృద్ధి, రూ.5.61 కోట్ల తో రామానుజ సర్కిల్ నుంచి రోడ్డు నిర్మాణం, గుజరాత్ లోని గాంధీనగర్, చత్తిస్ గడ్ రాష్ట్రం రాయపూర్ లో శ్రీవారి ఆలయ నిర్మాణాలు చేయాలని టీటీడీ నిర్ణయించింది.

కాగా రాజకీయ కారణాలతో టీటీడీ పై పలువురు అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. శ్రీవాణి ట్రస్టు నిధులను వైసీపీ నాయకులు దోచుకుంటున్నారంటు దారుణమైన ఆరోపణలు చేస్తున్నారని, వీటిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ‘ఆలయ నిర్మాణాలతో పాటు హిందూ ధార్మిక ప్రచారం కోసం శ్రీవాణి ట్రస్ట్ ని ప్రారంభించాం. శ్రీవాణి ట్రస్టు నిధులతో ఏపీతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో 2445 ఆలయాల నిర్మాణం చేశాం. 250 పురాతన ఆలయాలకు మరమ్మతులు చేశాం. త్వరలోనే శ్రీవాణి ట్రస్టు నిధులపై శ్వేత పత్రం విడుదల చేస్తాం. శ్రీవాణి ట్రస్టు నిధులు ఎక్కడ దుర్వినియోగం కాలేదు. దాత ఇచ్చిన ప్రతి రూపాయికి రసీదు ఇస్తున్నాం. శ్రీవాణి ట్రస్టు పై అసత్య ఆరోపణలు చేస్తున్న నాయకులపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటాం. కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటాం ‘ అని వైవీ సుబ్బారెడ్డి హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..