AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TTD Temple: తిరుమల శ్రీవాణి ట్రస్ట్‌ నిధులపై శ్వేతపత్రం విడుదల.. ఆస్తులు ఎంతో తెలుసా..

తిరుమలలో శ్రీవాణి ట్రస్ట్‌కి వచ్చే విరాళాల్లో జరుగుతున్న అక్రమాలపై కొద్దిరోజులుగా విపక్ష నేతలు పవన్, చంద్రబాబు ఘాటైన విమర్శిస్తున్నారు. ఆ విమర్శలకు సమాధానంగా ఇప్పుడు లెక్కాపత్రంతో ముందుకొచ్చారు టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి. శ్రీవారి ట్రస్ట్‌ నిధులపై శ్వేతపత్రం విడుదల చేశారు.

TTD Temple: తిరుమల శ్రీవాణి ట్రస్ట్‌ నిధులపై శ్వేతపత్రం విడుదల.. ఆస్తులు ఎంతో తెలుసా..
Yv Subbareddy
Shiva Prajapati
|

Updated on: Jun 23, 2023 | 8:09 AM

Share

తిరుమలలో శ్రీవాణి ట్రస్ట్‌కి వచ్చే విరాళాల్లో జరుగుతున్న అక్రమాలపై కొద్దిరోజులుగా విపక్ష నేతలు పవన్, చంద్రబాబు ఘాటైన విమర్శిస్తున్నారు. ఆ విమర్శలకు సమాధానంగా ఇప్పుడు లెక్కాపత్రంతో ముందుకొచ్చారు టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి. శ్రీవారి ట్రస్ట్‌ నిధులపై శ్వేతపత్రం విడుదల చేశారు. విరాళాలు, నిధుల సేకరణ, కార్యక్రమాలకు సంబంధించి.. పూర్తి పారదర్శకతతో శ్వేత పత్రం విడుదల చేస్తున్నామని వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. దళారీ వ్యవస్థను పూర్తిగా రూపుమాపామన్నారు. 70మంది దళారీలను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. 214 కేసులు నమోదు చేశామన్నారు వైవీ సుబ్బారెడడి. మొదటి 6 నెలల్లోనే ప్రక్షాళన చేపట్టామని తెలిపారాయన.

ఆస్తుల వివరాలివి..

ఇక ఆస్తుల వివరాలనూ వెల్లడించారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. ట్రస్ట్ ద్వారా వచ్చిన మొత్తం రూ.861కోట్లుగా వెల్లడించారు. రూ.602 కోట్లు వేర్వురు బ్యాంకుల్లో డిపాజిట్ చేశామని తెలిపారు. మూడున్నరేళ్లలో బ్యాంకుల ద్వారా వడ్డీ రూపంలో రూ. 36 కోట్లు వచ్చిందన్నారు. ఆలయాల నిర్మాణం, పాత ఆలయాల పునరుద్ధరణ, దీపదూప, గోసంరక్షణ, హిందూ ధర్మ ప్రచారం కోసం రూ. 120 కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు ట్రస్ట్ ద్వారా ఏపీ సహా పలు రాష్ట్రాల్లో టీటీడీ తరఫున అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు శ్రీకారం చుడుతున్నామన్నారు. ఇచ్చిన విరాళాలకు సరైన రసీదులు ఇస్తున్నామని వివరించారు వైవీ సుబ్బారెడ్డి. ట్రస్ట్ నిధులను ఎవరూ దారి మళ్లించడం లేదని, విపక్ష నేతలు అన్నట్లుగా ట్రస్ట్ నిధులను దారి మళ్లిస్తే స్వామివారే శిక్షిస్తారని కామెంట్ చేశారు వైవీ సుబ్బారెడ్డి.