AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: శ్రీవారి దర్శనం కోసం నడకదారిలో వెళ్లే భక్తులకు టీటీటీ కీలక సూచనలు..

తిరుమలలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. ఏకంగా ఓ బాలుడిపై అటాక్ చేయడంతో టీటీడీ అధికారులు అలెర్ట్ అయ్యారు. భక్తులకు కొన్ని కీలక సూచనలు చేశారు.

Tirumala: శ్రీవారి దర్శనం కోసం నడకదారిలో వెళ్లే భక్తులకు టీటీటీ కీలక సూచనలు..
TTD Divya Darshan
Ram Naramaneni
|

Updated on: Jun 23, 2023 | 1:58 PM

Share

గురువారం తిరుమల అలిపిరి నడక మార్గంలో చిరుతపులి ప్రత్యక్షమైంది. ఏడవ మైలు దగ్గర చిరుత బాలుడిపై దాడి చేసింది..అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లింది. వెంటనే అలెర్టైన బాలుడి తాత, అక్కడి యాత్రికులు కేకలు వేస్తూ అటవీ ప్రాంతంలో చిరుతను వెంటాడారు. ఈ సమయంలో అటుగా వెళ్తున్న తిరుపతి ఎస్సైకి సమాచారం అందడంతో.. హుటాహుటిన స్పాట్‌కు చేరుకున్నారు. చిరుత అటవీ ప్రాంతంలో దాదాపు 150 మీటర్ల దూరంలో బాలుడిని వదిలి వెళ్లింది..చిరుత దాడిలో బాలుడి తలకు, గుండె భాగంలో తీవ్రంగా గాయాలు అయ్యాయి..ఈ విషయం తెలియడంతో TTD EO ఏవి.ధర్మారెడ్డి ఘటనా స్ధలానికి వెళ్లి బాలుడిని 108 వాహనంలో తిరుపతిలోని చిన్న పిల్లల ఆసుపత్రికి తరలించారు..

మరోవైపు ఈ పరిణామాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై టీటీడీ ఆరా తీస్తోంది.అలిపిరి మెట్ల మార్గంలో భక్తుల భద్రత దృష్ట్యా శ్రీవారి మెట్టు మార్గం తరహాలో రాత్రి 6 గంటలు తర్వాత నడక అనుమతి నిలిపి వేసే విధంగా ఆలోచన చేస్తున్నారు. ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని.. మెట్ల మార్గంలో జంతువులు తిరిగే చోట ఫెన్సింగ్ ఏర్పాటుకు చర్యలు చేపడతాం అంటున్నారు TTD CVSO నరసింహ కిషోర్‌.

చిన్నారి కౌశిక్‌కు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పరామర్శించారు. బాలుడి ఆరోగ్యంపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. తిరుపతిలోని చిన్నపిల్లల ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న కౌశిక్ ఆరోగ్య పరిస్తితి మెరుగ్గా ఉంది..శ్రీ వేంకటేశ్వర స్వామి దయ వల్లనే చిరుత పులి బారి నుంచి ప్రాణాలతో బయటపడ్డా బాలుడు కౌశిక్ మెల్లిగా కోలుకుంటున్నారన్నారు. మరోవైపు నడక మార్గంలో టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళే భక్తులకు జాగ్రత్తలు చెబుతోంది. మెట్ల మార్గంలో నడిచి వెళ్తున్న భక్తులు గుంపులు, గుంపులుగా వెళ్లాలని మైక్‌ల ద్వారా విజిలెన్స్ అధికారులు భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు.అలిపిరి నడక మార్గంలో చిరుత సంచారం పై భక్తులు అప్రమత్తంగా ఉండాలని తిరుపతి జిల్లా ఫారెస్ట్ అధికారి సతీష్‌ సూచిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..