Tirupati by-poll 2021: రసవత్తరంగా తిరుపతి ఉప ఎన్నిక.. నేడు నామినేషన్ వేయనున్న వైసీపీ, బీజేపీ అభ్యర్థులు

Tirupati Lok Sabha by-poll 2021: ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. ఇప్పటికే ప్రధాన పార్టీలు ప్రచారంతో వేడెక్కిస్తూ.. గెలుపే లక్ష్యంగా దూసుకుపోతున్నాయి. ఈ ఉప ఎన్నిక పోలింగ్ ఏప్రిల్ 17న జరగనుంది. మంగళవారంతో నామినేషన్ల

Tirupati by-poll 2021: రసవత్తరంగా తిరుపతి ఉప ఎన్నిక.. నేడు నామినేషన్ వేయనున్న వైసీపీ, బీజేపీ అభ్యర్థులు
Tirupati By Poll 2021
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 29, 2021 | 2:52 AM

Tirupati Lok Sabha by-poll 2021: ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. ఇప్పటికే ప్రధాన పార్టీలు ప్రచారంతో వేడెక్కిస్తూ.. గెలుపే లక్ష్యంగా దూసుకుపోతున్నాయి. ఈ ఉప ఎన్నిక పోలింగ్ ఏప్రిల్ 17న జరగనుంది. మంగళవారంతో నామినేషన్ల పర్వానికి తెరపడనుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల పేర్లను ప్రకటించాయి. అధికార వైఎస్ఆర్ సీపీ డాక్టర్ గురుమూర్తి పేరును ఖరారు చేయగా.. తెలుగుదేశం మాజీ కేంద్రమంత్రి వనబాక లక్ష్మిని బరిలోకి దింపింది. బీజేపీ-జనసేన కూటమి నుంచి రత్న ప్రభ అనే మాజీ ఐఏఎస్ అధికారిని ప్రకటించగా.. కాంగ్రెస్ పార్టీ చింతామోహన్‌ను ప్రకటించింది. ఇప్పటికే టీడీపీ అభ్యర్థి మాజీమంత్రి పనబాక లక్ష్మి నామిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. నామినేషన్ల గడువు సమీపిస్తుండటంతో పార్టీలన్నీ సమయత్తమవుతున్నాయి. ఈ రోజు నెల్లూరు కలెక్టరేట్‌లో వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి, బీజేపీ- జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ నామినేషన్లను దాఖలు చేయనున్నారు.

తిరుపతి వైసీపీ ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ అకాల మరణంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఉప ఎన్నికలో ఎలాగైనా పట్టు సాధించాలని.. ప్రధాన పార్టీలన్నీ వ్యూహాలు రచిస్తున్నాయి. ఏపీలో మునిసిపల్, పంచాయతీ ఎన్నికల ఫలితాలతో జోరుమీదున్న అధికార పార్టీ వైసీపీ ఎలాగైనా సీటును దక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో డీలాపడిన పార్టీని ఎలాగైనా గాడిలో పెట్టాలని టీడీపీ ఈ ఎన్నికపై ప్రత్యేకంగా దృష్టిసారించింది. దీంతోపాటు బీజేపీ-జనసేన కూడా పట్టుసాధించాలని సంకల్పంతో దూసుకుపోతున్నాయి. ఈ మేరకు అధికార, ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటు నియోజకవర్గంలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జులను సైతం నియమించాయి. వైసీపీ నియోజకవర్గాల వారీగా ఇన్‌ఛార్జులను నియమించగా.. టీడీపీ 10 క్లస్టర్ల చొప్పున నియోజకవర్గాల వారీగా ఇన్‌ఛార్జ్‌లను నియమించింది. నామినేషన్ల పర్వం ముగిసిన వెంటనే తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రచారం హోరత్తనుంది.

Also Read: