Tirumala Darshan Tickets: గుడ్‌న్యూస్.. తిరుమల శ్రీవారి దర్శన టికెట్లను విడుదల చేయనున్న టీటీడీ.. ఎప్పుడంటే!
Tirumala Darshan Tickets: తిరుమల తిరుపతి వెంకన్నకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతి రోజు లక్షల్లో భక్తులు దర్శనాలు చేసుకుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా..
Tirumala Darshan Tickets: తిరుమల తిరుపతి వెంకన్నకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతి రోజు లక్షల్లో భక్తులు దర్శనాలు చేసుకుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి కూడా భారీ ఎత్తున వెంకన్నను దర్శించుకుంటారు. ఇక భక్తుల దర్శనాల కోసం టీటీడీ ఎన్నో చర్యలు చేపడుతోంది. ఇక ఈ రోజు రూ.300 దర్శన టికెట్ల నవంబర్, డిసెంబర్ కోటాను విడుదల చేయనుంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఉదయం 9 గంటలకు రూ.300 దర్శన టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ. ఇందులో భాగంగా రోజుకి 12 వేల టికెట్లు విడుదల చేయనుంది. అలాగే శనివారం ఉదయం 9 గంటలకు సర్వదర్శనం టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. ఇందులో భాగంగా రోజుకు 10 వేల సర్వదర్శన టికెట్లను విడుదల చేయనుంది టీటీడీ. సర్వర్ల సమస్య తలెత్తకుండా వర్చువల్ క్యూలో టికెట్ల కేటాయించనుంది.