TTD Online Ticket Booking: తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్‌.. దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేసిన టీటీడీ

TTD Online Ticket Booking: తిరుమల తిరుపతి వెంకన్నకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతి రోజు లక్షల్లో భక్తులు దర్శనాలు చేసుకుంటారు. భక్తుల దర్శనాలను దృష్టిలో ఉంచుకుని..

TTD Online Ticket Booking: తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్‌.. దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేసిన టీటీడీ
ఇక శీవారి వారి దర్శనం చేసుకునే భక్తుల సంఖ్యను పెంచడానికి తాము కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తున్నామని బోర్డు ఛైర్మన్ తెలిపారు. ప్రభుత్వం నుండి ఆదేశాలు వచ్చిన వెంటనే శ్రీవారి దర్శనాల సంఖ్య పెంచడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
Follow us
Subhash Goud

|

Updated on: Oct 22, 2021 | 9:18 AM

TTD Online Ticket Booking: తిరుమల తిరుపతి వెంకన్నకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతి రోజు లక్షల్లో భక్తులు దర్శనాలు చేసుకుంటారు. భక్తుల దర్శనాలను దృష్టిలో ఉంచుకుని టీటీడీ మెరుగైన సేవలను అందిస్తోంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి కూడా భారీ ఎత్తున తిరుమలను దర్శించుకునే వారుంటారు. ఇక ఈ రోజు రూ.300 దర్శన టికెట్ల నవంబర్‌, డిసెంబర్‌ కోటాను విడుదల చేసింది టీటీడీ. రెండు నెలలకు సంబంధించి కోటాలో భాగంగా ఈ రూ.300 దర్శన టికెట్లు ఆన్‌లైన్‌ లో విడుదల చేసింది. ఇందులో భాగంగా రోజుకి 12 వేల టికెట్లు విడుదల చేయనుంది దేవస్థానం. అలాగే శనివారం ఉదయం 9 గంటలకు సర్వదర్శనం టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. ఇందులో భాగంగా రోజుకు 10 వేల సర్వదర్శన టికెట్లను విడుదల చేయనుంది టీటీడీ. సర్వర్ల సమస్య తలెత్తకుండా వర్చువల్ క్యూలో టికెట్ల కేటాయించనుంది. అయితే ప్రతి రోజు ముందుగానే బుక్‌ చేసుకున్న వారికి మాత్రమే టికెట్లు కన్ఫర్మ్‌ అవుతాయి.

ఇవి కూడా చదవండి:

Horoscope Today: ఈరోజు ఈ రాశివారు కొత్త ఇంటిని కొనుగోలు చేసే అవకాశం.. ఏఏ రాశివారి ఫలితాలు ఎలా ఉన్నాయంటే..

Vidura Niti: నీతివంతుడితో కయ్యం, సర్పంతో నెయ్యం ప్రమాదకరమని చెప్పిన విదురుడు.. ఎందుకంటే..