Horoscope Today: ఈరోజు ఈ రాశివారు కొత్త ఇంటిని కొనుగోలు చేసే అవకాశం.. ఏఏ రాశివారి ఫలితాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope Today (October 22nd 2021): కొంతమందికి కొన్ని నమ్మకాలు ఉంటాయి. వాటిల్లో జాతక ఫలాలు ఒకటి. అవును కొందరు.. ఏ పని మొదలు పెట్టాలన్నా .. ఈరోజు జాతకం ఎలా..
Horoscope Today (October 22nd 2021): కొంతమందికి కొన్ని నమ్మకాలు ఉంటాయి. వాటిల్లో జాతక ఫలాలు ఒకటి. అవును కొందరు.. ఏ పని మొదలు పెట్టాలన్నా .. ఈరోజు జాతకం ఎలా ఉంది అని ఆలోచిస్తారు. తమ నక్షత్రాన్ని బట్టి.. ఏ పనులు చేస్తే మంచి ఫలితాలను పొందుతాము అని ఆలోచిస్తూ.. జాతకాలు, రాశిఫలాల ఆధారంగా చేసేవారు.. జాతకాలను విశ్వసించేవారు చాలామంది ఉన్నారు. అంతేకాదు తాము పనిని మొదలుపెట్టే ముందు కొంతమంది తమ దినఫలాలపై దృష్టి సారిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు (అక్టోబర్ 22వ తేదీ ) శుక్రవారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో.. తెలుసుకుందాం..!
మేష రాశి: ఈరోజు ఈ రాశివారికి అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. ప్రయాణాలు చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి ఉద్యోగరంగాల్లో బదిలీ అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉంటాయి. రుణప్రయత్నాలు చేస్తారు. కావాల్సినవారి కోసం ఎదురు చూస్తారు.
వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారికి అకారణంగా కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. స్త్రీలు పిల్లల పట్ల శ్రద్ధ తీసుకుంటారు. అనారోగ్య బాధలు కలుగుతాయి. భయందోలనకు గురవుతారు. వ్యాపార రంగంలోని వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారికి ఆకస్మిక ధన నష్టం కలుగుతుంది. ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవడం మంచిది. వృధా ప్రయాణాలు చేసే అవకశం ఉంది. సన్నిహితులతో విరోధం ఏర్పడే అవకాశం ఉంది.
కర్కాటక రాశి: ఈరోజు ఈ రాశివారు బంధు, మిత్రులతో కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. శారీరక శ్రమ, మానసిక ఆందోళన కలుగే అవకాశం ఉంది. చిన్న చిన్న పనులకు కూడా ఎక్కువగా శ్రమపడాల్సి ఉంటుంది.
సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు నూతన గృహనిర్మాణ పనులను చేపట్టే అవకాశం ఉంది. బంధు, మిత్రులను కలుస్తారు. ఆకస్మిక ధన లాభం ఉంది. గతంలో చేసిన అప్పులు తీరుస్తారు. రుణబాధలు తొలగిపోతాయి. ఆరోగ్య సమస్యలు తీరి కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.
కన్య రాశి: ఈరోజు ఈ రాశివారికి ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. కీళ్లనొప్పులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మానసిక ఆందోళన కలుగుతుంది. ప్రయాణం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
తులా రాశి: ఈరోజు ఈ రాశి కళాకారులకు, మీడియా రంగాలవారికి మేలు కలుగుతుంది. కుటుంబంలో సంతోషం కలుగుతుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. కొత్త వస్తు, నగలను కొనుగోలు చేస్తారు. సమాజంలో మంచి పేరు, ప్రతిష్ఠలు సంపాదించుకుంటారు.
వృశ్చిక రాశి: ఈరోజు ఈ రాశివారికి అధిక ప్రయాణాలు చేసేయాల్సి ఉంటుంది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసర ఖర్చులు చేస్తారు. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి.
ధనుస్సు రాశి: ఈరోజు ఈ రాశివారి కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. శుభకార్యాల ప్రయత్నాలు ఫలిస్తాయి. దైవర్శనం చేసుకుంటారు.
మకర రాశి: ఈరోజు ఈ రాశివారు బంధు, మిత్రులతో విందు వినోదకార్యక్రమాల్లో పాల్గొంటారు. శుభవార్త వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. కొత్త వస్తు, నగలను కొనుగోలు చేస్తారు.
కుంభ రాశి: ఈరోజు ఈ రాశివారి ఆరోగ్యం విషయం ఇబ్బందులను ఎదుర్కొంటారు. భయాందోళనలకు గురవుతారు. కొత్త్తపనులను ఆలస్యంగా చేపడతారు. మానసిక ఆందోళన కలిగే అవకాశం ఉంది.
మీన రాశి: ఈరోజు ఈ రాశి ఆర్ధికంగా మంచి ఫలితాలను పొందుతారు. మానసిక ఆనందాన్ని పొందుతారు. అన్నదమ్ములతో కలహాలు ఏర్పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు కలుగుతాయి. నూతన వ్యక్తులతో పరిచయాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
Also Read: